యూపీఐ సేవలకు సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్‌లో రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవ అందుబాటులో ఉండదని ప్రకటించింది.
కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 5, 23 తేదీలలో అవసరమైన సిస్టమ్ నిర్వహణ పనులు చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.
ఈ సేవలు అందుబాటులో ఉండవు
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని వినియోగించే హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని వినియోగించే మర్చంట్‌ల వద్ద కూడా యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.
ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
Comments
Please login to add a commentAdd a comment