హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్)ను కొత్త ఇంజినీరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు మారుస్తున్న నేపథ్యంలో యూపీఐ సేవలను తాత్కాలికంగా కొన్నిగంటల పాటు నిలిపేస్తామని ప్రకటించింది. దానికోసం జులై 13, 2024 శనివారం ఉదయం 3:00 నుంచి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యూపీఐ సేవలు పనిచేయవని తెలిపింది.
బ్యాంకింగ్ పనితీరు, సామర్థ్యం, విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ ప్రకటనలో చెప్పింది. కస్టమర్లకు మరింత వేగంగా సేవలందించేందుకు ఈ మైగ్రేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. బ్యాంక్ సర్వర్లను యాక్సెస్ చేసేపుడు అధిక ట్రాఫిక్ వాల్యూమ్‌ను నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
శనివారం బ్యాంక్ సెలవు కావడంతో ఈ అప్‌డేషన్ కోసం జులై 13ను ఎంచుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. యూపీఐ వినియోగదారులు మాత్రం శనివారం బ్యాంక్ ప్రకటించిన సమయాన్ని గమనించాలని కోరింది. కస్టమర్లు అంతకు ముందుగానే బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment