
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.
జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.
ఈమెయిల్ ఇన్‌స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..
నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.
మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండి
ఇన్స్‌టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..
» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వండి
» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్స్‌టా అలర్ట్స్‌పై క్లిక్ చేయాలి.
» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.
» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.
» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment