transacions
-
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో.. ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపులు లభించనున్నట్లు.. ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు. అయితే ఈ మినహాయింపు.. ఫిన్‌టెక్ సేవలకు వర్తించదు.రుణగ్రహీత రుణ నిబంధనలను పాటించనందుకు, అంటే.. ఈఎంఐ చెల్లింపు లేదా రీపేమెంట్ షెడ్యూల్‌లను ఉల్లంఘించిన్నప్పుడు బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా విధిస్తుంది. అయితే ఈ జరిమానాలపై కూడా ఎటువంటి జీఎస్టీ విధింపు ఉండదని సీతారామన్ ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదాబీమా ప్రీమియంపై జీఎస్టీ వాయిదాజీఎస్టీ కౌన్సిల్.. ఆరోగ్య, జీవిత బీమాతో సహా ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలకు GST తగ్గించడంపై చర్చ జరుగుతుండగా.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత చర్చ అవసరమని అన్నారు. తరువాత జనవరిలో జరగనున్న సమావేశంలో బహుశా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
రేపటి నుంచి ఈ బ్యాంక్ అలర్ట్స్ బంద్.. కానీ ఇలా చేస్తే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.ఈమెయిల్ ఇన్‌స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండిఇన్స్టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వండి» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్‌స్టా అలర్ట్స్‌పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. -
యూపీఐ ట్రాన్సక్షన్స్.. ఆగస్టులో అన్ని లక్షల కోట్లా?
ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
స్వైపింగ్ బాదుడు.. చార్జీల కుమ్ముడు
ఏలూరు (మెట్రో)/తణుకు : నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రభుత్వం, అధికారులు ఊదరగొడుతుండటంతో తాడేపల్లిగూడెంకు చెందిన యోహాన్ అనే యువకుడు కరెంటు బిల్లు చెల్లించేందుకు డెబిట్ కార్డు తీసుకెళ్లాడు. ఆ కార్డు సాయంతో మీ సేవ కేంద్రంలో కరెంటు బిల్లు నిమిత్తం రూ.460 చెల్లించాడు. సర్వీస్ చార్జీల రూపంలో రూ.5, డెబిట్ కార్డు వినియోగించినందుకు ట్యాక్స్ రూపంలో రూ.5 అతడి ఖాతా నుంచి ఎగిరిపోయాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన అరవింద్‌కుమార్ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఏడుసార్లు ఏటీఎం కార్డును ఉపయోగించి నగదు డ్రా చేశాడు. తీసుకున్న సొమ్ము పోగా తన పొదుపు ఖాతాలో ఉండాల్సిన నిల్వ మొత్తంలో రూ.200 తగ్గాయి. బ్యాంక్‌కు వెళ్లి ఇదేమిటని అడిగితే.. ఏటీఎం కార్డును ఐదు పర్యాయలకంటే ఎక్కువసార్లు వినియోగిస్తే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. తణుకు పట్టణానికి చెందిన పి.పోసిబాబు మోటార్ సైకిల్ కొనుక్కుందామని షోరూమ్‌కు వెళ్లా డు. అతనికి చెక్కు బుక్ లేకపోవడంతో డెబిట్ కార్డు ద్వారా స్వైపింగ్ విధానంలో సొమ్ము చెల్లిస్తానన్నాడు. అలాగైతే 2 శాతం పన్ను కింద రూ.1,300 అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పడంతో వెనుదిరిగి వచ్చేశాడు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమçలు ఇవి. పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ఇబ్బందులు పడిన జనం ప్రభుత్వ సూచనల మేరకు నగదు రహిత లావాదేవీల వైపు క్రమంగా మళ్లుతున్నారు. అయితే, సేవా రుసుములు, పన్నుల పేరిట భారీ దోపిడీకి గురవుతున్నారు. మీ డబ్బు మీరు తీసుకున్నా.. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో రూ.2 వేలు, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. చిల్లర సమ స్య నేపథ్యంలో ప్రజలు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఏటీఎం నుంచి ఒకసారి రూ.1,500 తీసుకుంటే మాత్రమే రూ.500 నోట్లు వస్తున్నాయి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే రూ.2 వేల నోట్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.10 వేలు కావాలంటే రూ.2 వేల నోట్లు 5 వస్తున్నాయి. దీంతో.. ఏటీఎంల నుంచి రూ.1,500 చొప్పున 7 పర్యాయాలు సొమ్ము తీసుకోవాల్సి వస్తోంది. ఐతే, నెలలో 5పర్యాయాలకు మించి ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ప్రతి లావాదేవీపై రూ.20 రుసుం, ఆపై 15 శాతం పన్నును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. దీంతో, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగదు రహిత లావాదేవీలపైనా బాదుడే వివిధ వస్తువుల కొనుగోళ్లు కోసం వినియోగించే డెబిట్, క్రిడెట్ కార్డు లావాదేవీలకు సేవా రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఇలాంటి లావాదేవీలపై సంబంధిత వ్యాపార సంస్థలు 2శాతం చొప్పున సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు స్వైపింగ్ యం త్రాలు ఇచ్చినందుకు ప్రతి లావాదేవీపైనా ఇలా వసూలు చేస్తున్నాయని, ఈ విషయంలో తామేమీ చేయ లేమని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. పన్ను ఎందుకు కట్టాలి పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు అదనంగా పన్ను వసూలు చేస్తున్నారు. స్వైపింగ్ విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అమలు సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదనపు పన్నులు మేమెందుకు చెల్లించాలి. – ఇ.రాజేష్, వినియోగదారుడు, తణుకు 7సార్లు ఏటీఎం వాడితే రూ.200 పోయింది జీతాన్ని డ్రా చేసుకునేందుకు ఈనెలలో 7సార్లు ఏటీఎం కార్డు ఉపయోగించాను. నేను డ్రా చేసిన దానికంటే అదనంగా రూ.200 పోయాయి. బ్యాంక్ అధికారులను అడిగితే సేవా రుసుంగా వసూలు చేశామని చెప్పారు. – బట్టు అరవింద్‌కుమార్, జంగారెడ్డిగూడెం నగదు రహిత లావాదేవీలపైనా మినహాయింపు లేదు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ఎటువంటి చార్జీలు ఉండవని చెప్పిన బ్యాంకులు ప్రస్తుతం సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. నేను చేపల వ్యాపారం చేస్తుంటాను. స్వైపింగ్ మెషిన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపైనా బ్యాంకులు భారీగా పన్ను వసూలు చేస్తున్నాయి. – చింతపూడి పెద్దిరాజు, ఏలూరు