
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా.. యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యం కాదని అందరూ అనుకుంటారు. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ట్రాన్సక్షన్ ఎలా చేయాలి?.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్‌పీసీఐ ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీ చేయవచ్చు, యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు చేయడం ఎలా..
➤మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయండి.
➤డయల్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.
➤మీ బ్యాంక్ పేరును ఎంటర్ చేసిన తరువాత.. మీ మొబైల్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల జాబితా కనిపిస్తుంది.
➤కావాల్సిన ఖాతాను ఎంచుకోవాలి. ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి.. డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయాలి.
➤యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేయకపోతే.. సెట్ చేసుకోవాలి. ఈ పిన్ లావాదేవీలను నిర్దారించడానికి ఉపయోగపడుతుంది.
డబ్బు పంపించాలంటే..
➤మీ ఫోన్‌లో *99# డయల్ చేసిన తరువాత.. డబ్బు పంపడానికి ఆప్షన్ ఎంచుకోవాలి.
➤ఆ తరువాత ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో.. వారి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయడానికి కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి.
➤మీరు పంపించాలనుకున్న మొత్తాన్ని.. ఎంటర్ చేసి చేసిన తరువాత.. లావాదేవీలను ధృవీకరించడానికి పిన్ నెంబర్ నమోదు చేయండి.
Comments
Please login to add a commentAdd a comment