హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలకు జూలై 13న అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది కస్టర్లున్న అతిపెద్ద ప్రవేట్ బ్యాంక్ తమ కస్టమర్ బేస్ కోసం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫామ్‌కు బదిలీ చేస్తోంది. దీంతో 14 గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.
పనితీరు వేగాన్ని మెరుగుపరచడం, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, రిలియబులిటీ, స్కేలబిలిటీని పెంచడం ఈ మార్పు లక్ష్యం అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా జూలై 13న తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 13.50 గంటల పాటు పలు సర్వీసులు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.
ప్రభావితమయ్యే సేవలు ఇవే..
నెట్ & మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు జూలై 13న తెల్లవారు జామున 3:00 గంటల నుంచి 3:45 గంటల వరకు, మళ్లీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందుబాటులో ఉండవు. బిల్లు చెల్లింపులు, డీమ్యాట్, కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ఏటీఎం లావాదేవీల్లోనూ అంతరాయం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment