intruption
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 14 గంటలు అంతరాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు జూలై 13న అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది కస్టర్లున్న అతిపెద్ద ప్రవేట్ బ్యాంక్ తమ కస్టమర్ బేస్ కోసం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫామ్‌కు బదిలీ చేస్తోంది. దీంతో 14 గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.పనితీరు వేగాన్ని మెరుగుపరచడం, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, రిలియబులిటీ, స్కేలబిలిటీని పెంచడం ఈ మార్పు లక్ష్యం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా జూలై 13న తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 13.50 గంటల పాటు పలు సర్వీసులు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..నెట్ & మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు జూలై 13న తెల్లవారు జామున 3:00 గంటల నుంచి 3:45 గంటల వరకు, మళ్లీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందుబాటులో ఉండవు. బిల్లు చెల్లింపులు, డీమ్యాట్, కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ఏటీఎం లావాదేవీల్లోనూ అంతరాయం ఉంటుంది. -
India vs Ireland: సిరీస్‌పై కన్నేసిన భారత్.. వరుణుడు కరుణించేనా..?
డబ్లిన్: తొలి టి20లో ఐర్లాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ నేడు జరిగే రెండో టి20లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే గత మ్యాచ్‌లాగే ఈ సారి కూడా ఆటకు వాన అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తొలి పోరులాగే మ్యాచ్‌ను కుదించాల్సి వచ్చినా... టీమిండియా ఆధిపత్యాన్ని ఐర్లాండ్ ఎంత వరకు నిలువరించగలదనేది చూడాలి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టి20ల్లోనూ ఐర్లాండ్‌ను చిత్తు చేయడం భారత్ పైచేయిని చూపిస్తోంది. వర్షం కురిస్తే పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండగా... వానతో అంతరాయం ఏర్పడకపోతే బ్యాటింగ్‌లో పరుగుల వరుద పారవచ్చు. సామ్సన్ లేదా త్రిపాఠి... 12 ఓవర్ల మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. కాబట్టి అదే జట్టును కొనసాగించాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. అయితే రుతురాజ్ గాయంతో బాధపడుతుండటంతో ఒక స్థానం ఖాళీగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా అనుభవం ఉన్న రాహుల్ త్రిపాఠి లేదా పునరాగమనం చేసిన సంజు సామ్సన్లలో ఒకరికి చోటు దక్కవచ్చని అంచనా. మిగతా ఆటగాళ్లంతా గత మ్యాచ్‌లో తమ వంతు పాత్రను పోషించారు. అరంగేట్ర మ్యాచ్‌లో వేసిన ఒకే ఒక ఓవర్లో తడబడిన ఉమ్రాన్ మలిక్‌కు కూడా మరో అవకాశం దక్కవచ్చు. భువనేశ్వర్, చహల్‌ల బౌలింగ్ ముందు ఐర్లాండ్ నిలబడలేకపోయింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే టాప్ ఆటగాళ్లు లేకపోయినా ప్రత్యర్థి ముందు భారత్ ఏ రకంగా చూసినా మెరుగైన జట్టే. జోరును కొనసాగిస్తే సిరీస్ గెలుపు ఖాయం. టెక్టర్‌పై దృష్టి... గత మ్యాచ్‌లో ఐర్లాండ్ సంతోషించే అంశం ఏదైనా ఉందీ అంటే అది హ్యారీ టెక్టర్ బ్యాటింగే. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన అతని బ్యాటింగ్ భారత శిబిరాన్ని కూడా ఆకట్టుకుంది. టెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ హార్దిక్ తన బ్యాట్‌ను అతనికి బహుమతిగా కూడా ఇచ్చాడు. పెద్ద జట్టుపై సత్తాను చాటేందుకు అతనికి ఇది మరో మంచి అవకాశం. తొలి పోరులో విఫలమైన సీనియర్లు పాల్ స్టిర్లింగ్, ఆండీ బల్బర్నీ, డాక్రెల్ బాధ్యతగా ఆడాల్సి ఉంది. సొంతగడ్డపై చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించేందుకు ఐర్లాండ్‌కు ఇదే మంచి అవకాశం. అయితే పేలవ బౌలింగ్‌తో జట్టు ఇబ్బంది పడుతోంది. టీమిండియాను నిలువరించడం వారికి కష్టం కావచ్చు. -
మీ అసహనం అర్థమైంది: మోదీ
సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు దాదాపుగా ఒక గంట పనిచెయ్యకపోవడాన్ని పశ్చిమ బెంగాల్ అభివృద్ధితో పోలుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటర్ల ఆశలకీ, నెటిజన్ల ఆందోళనలకీ ముడి పెడుతూ కామెంట్లు చేశారు. శుక్రవారం రాత్రి సోషల్ మీడియా 50–55 నిముషాలు ఆగిపోతేనే ప్రజలందరూ ఎంతో ఆందోళనకు లోనయ్యారని, అలాంటిది బెంగాల్లో అభివృద్ధి , ప్రజల కన్న కలలు 50–55 ఏళ్లు ఆగిపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం ఎందుకంత అసహనంగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ సారి ఎన్నికలంటే ఎమ్మెల్యేలను, సీఎంను ఎన్నుకోవడం కాదు, పరివర్తన తీసుకురావడం, స్వర్ణ బెంగాల్ ఏర్పాటు కావడం, ఇందు కోసం బీజేపీకి ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. అసోం టీ ఇమేజ్‌ని నాశనం చేసే వాళ్లకి మద్దతా? ఘుమఘుమలాడే అసోం టీ గుర్తింపుని నాశనం చేయాలనుకునే శక్తులకి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎగువ అసోంలోని చాబువాలో తేయాకు తోటల్లో పని చేసే కార్మికులతో సంభాషించిన మరుసటి రోజే అదే ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అత్యంత పురాతన టీ పరిశ్రమకున్న గౌరవం, గుర్తింపుతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో టూల్‌కిట్ సాయంతో అసోం టీ, భారతీయ యోగాని దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి టూల్కిట్లు తయారు చేస్తున్న వారికి కాంగ్రెస్ మద్దతునిస్తోందని విమర్శించారు. తేయాకు తోటల్లో పని చేసే వారి కష్టాలు చాయ్ వాలా తప్ప మరెవరు అర్థం చేసుకుంటారని ప్రధాని అన్నారు. -
సీ ప్లేన్కు బ్రేక్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఎంతో అట్టహాసంగా అక్టోబర్ 31 న అహ్మదాబాద్–కెవాడియా మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సేవలు నెలలోనే ఆగిపోయాయి. మెయింటెనెన్స్ కోసం నిర్వాహకులు సీ–ప్లేన్‌ను మాల్దీవులకు పంపించారు. అయితే నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి సీప్లేన్ సేవలు కనీసం 15 రోజుల తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పౌర విమానయాన విభాగం డైరెక్టర్ అజయ్ చౌహాన్ మాట్లాడుతూ, సీప్లేన్ ఫ్లైయింగ్ అవర్స్ ముగిశాయని, ఈ పరిస్థితుల్లో విమానానికి సర్వీసింగ్ అవసరమని, అందుకే సీప్లేన్‌ను మాల్దీవులకు తిరిగి పంపించామని తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ – కెవడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) మధ్య తిరిగే సీ ప్లేన్ సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అక్టోబర్ 31న ప్రారంభోత్సవం జరిగిన తరువాత, నవంబర్ 1 నుంచి ప్రజల కోసం సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల రోజుల్లో ఇప్పటికే 3–3 రోజుల పాటు రెండుసార్లు ఈ సీప్లేన్‌ను అధికారులు నిలిపివేశారు. ఆ సమయంలో క్రూ మెంబర్స్‌కు విరామాన్ని ఇచ్చేందుకు సేవలు ఆపినట్లు అధికారులు తెలిపారు. సీ ప్లేన్ వివరాలు సిట్టింగ్ కెపాసిటీ : 19 మంది బరువు: 3,377 కిలోలు వేగం: 170 కి.మీ./గంటకు ఇంధన సామర్థ్యం: 1,419 లీటర్లు పొడవు: 16 మీటర్లు 1 ఎత్తు: 6 మీటర్లు ఇంధన శక్తి: 272 లీటర్లు / గంటకు బరువు సామర్థ్యం: 5670 కిలోలు టికెట్ ధర (ఒక్కరికి): రూ.4,0005,000 సందర్శకుల సంఖ్య రోజుకు 13వేలు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకుల సంఖ్య రోజుకు 10 వేలు -
కేటీపీపీ రెండు ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి బ్రేక్
గణపురం : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 500, 600 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉదయం, 500 మెగా వాట్ల ప్లాంట్‌లో రాత్రి 7 గంటలకు ఉత్ప త్తి నిలిపోయింది. బాయిలర్‌లో నీటి ఆవిరిని సరఫరా చేసే పైపులు పగిలిపోవడంతో అవాం తరం ఏర్పడింది. రెండు రోజుల్లో ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.