
భువనేశ్వర్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి ఠారెత్తిస్తోంది. ఒడిశా(Odisha)లోని పలు నగరాల్లో ఇప్పటికే వేడిగాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం ఒడిశాలోని బౌధ్ సోమవారం వరుసగా మూడవ రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(Highest temperatures) నమోదైన ప్రదేశంగా నిలిచింది.
సోమవారం ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒడిశాలోని బార్‌గడ్‌లో 42 ఢిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల తర్వాత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యింది.
మంగళవారం నుండి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని, మార్చి 25- 31 మధ్య రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువ. ఢిల్లీతో పాటు ఇతర మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న హిమపాతం కారణంగా నిలిచింది. ఒడిశా విషయానికొస్తే బౌధ్‌లో శనివారం 42.5 డిగ్రీల సెల్సియస్, ఆదివారం 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోని ఆరు జిల్లాలకు మంగళవారం వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.
ఇది కూడా చదవండి: జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment