తెలంగాణలో ఒకేసారి నగదురహితం సాధ్యం కాదని, దాన్ని దశలవారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదించింది. నగదురహిత లావాదేవీలపై ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ 10 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నగదు రూపం లో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నిం టినీ ముందుగా నగదురహితంగా మార్చాలని సూచిం చింది. ‘‘సమాజాన్ని నగదురహితం చేయడం ఒకే సారి సాధ్యం కాదు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి, దశలవారీగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తే సరైన ఫలితముంటుంది.