Task Force Committee
-
ఏపీ: థర్డ్‌వేవ్‌లో కోవిడ్ పరిస్థితుల అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ
-
తెలంగాణ 10 రోజులు లాక్డౌన్.. మినహాయింపు వాటికే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి 10 రోజులపాటు (మే 12 నుంచి 21 వరకు) లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. మంగళ వారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశం ఈమేరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. లాక్డౌన్ సమయంలో ప్రజాజీవనం స్తంభించకుండా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అంటే నాలుగు గంటలపాటు కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఈ సమయంలో నిత్యావసరాల కొనుగోలు, ఇతర వస్తువుల కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రతీరోజు 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు తక్షణమే చేయాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన మంత్రివర్గం మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి అవసరమైన మందులు, ఆక్సిజన్, రెమిడిసివర్, వ్యాక్సిన్లు సమకూర్చుకోవడంపై టాస్క్‌ఫోర్స్ దృష్టి పెట్టాలంది. సమావేశం ప్రారంభం కాగానే.. సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్డౌన్ విధింపు అంశాన్ని ప్రస్తావించగానే కేబినెట్ ఆమోదించింది. ప్రజా జీవనం పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకు మంత్రివర్గం పలు రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు కూడా ఇచ్చింది. ఈనెల 20న మళ్లీ భేటీ: లాక్డౌన్ ఈనెల 21వ తేదీ వరకు కొనసాగునున్న నేపథ్యంలో.. మంత్రివర్గం ఈనెల 20న మరోసారి సమావేశమై లాక్డౌన్ అనంతర పరిస్థితిని సమీక్షించి అవసరమైతే పొడిగింపు లేదా ఎత్తివేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు పెరుగుతుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్ పేషెంట్లు వైద్యం కోసం రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. రాజధాని నగరంలో బెడ్స్‌కు కొరత ఏర్పడుతున్న వేళ లాక్డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. రెమిడెసివర్ ఉత్పత్తిదారులతో కేబినెట్ సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి రాష్ట్రానికి తగినన్ని మందులు సరఫరా చేయాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి లాక్డౌన్ అమలు చేయాలని మొదట్లో భావించినా బుధవారం నుంచే అమల్లోకి తేవడం గమనార్హం. మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు –రాష్ట్రంలో టీకా కొరత నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన టీకా కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలి. –ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్‌లోనూ రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశం. –అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కమిటీ వేయాలి. –ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలి. –రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘాపెట్టాలి. కేటీఆర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ కమిటీ –మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీని మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ ఏ రోజుకారోజు మందులు, టీకాలను త్వరితగతిన సమకూర్చి, సరఫరా చేయడంపై దృష్టిపెడుతుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్నవి: –అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న బాధితులు, వైద్యరంగంలో పనిచేసే వారి వాహనాలకు అనుమతి. –నిత్యావసర వస్తువుల పాలు, కూరగాయలు, ఆహార సామగ్రి, డెయిరీ ప్రొడక్ట్స్ రవాణాకు అనుమతి. –రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రయాణికుల వాహనాలు క్రమబద్ధీకరిస్తారు. నిత్యావసర వస్తువులవాహనాలకు ఎలాంటి అంక్షలు ఉండవు. –వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వాటి సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వారి వాహనాలకు అనుమతిస్తారు. –తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం యథావిధిగా కొనసాగనున్న ధాన్యం కొనుగోళ్లు. –వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, సాగుయంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్‌సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు. –గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది. –విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు పనిచేస్తాయి. –జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. –కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలు –ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా –ఉపాధిహామీ పనులు –ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. –గత లాక్డౌన్లో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. –వంట గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. –ముందస్తు అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి. మాస్క్‌లు, భౌతికదూరం పాటించాలి. –అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి. –ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. –ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. –సెక్యూరిటీ సర్వీసెస్.. ప్రైవేట్ రంగంలోని వారికి కూడా.. –ఈ కామర్స్ సంస్థల తినుబండారాలు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ పంపిణీకి అనుమతి. –ఐటీ, ఐటీయేతర సర్వీసులు, టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్ సర్వీసెస్‌కు అనుమతి. అయితే ఈ రంగాల్లో పనిచేసే వారికి వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించడం మంచిది. –అన్ని రకాల నిర్మాణాలు, ప్రాజెక్టు కార్యకలాపాల్లో పనిచేసే ప్రాంతంలోనే లేబర్స్ రక్షిత ప్రాంతాల్లో ఉంటూ పనులు చేసుకోవడానికి అనుమతి. వీటికి మినహాయింపు లేదు.. –సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, క్రీడా మైదానాలు –అన్ని మతపరమైన ప్రార్థనా కేంద్రాలు, మందిరాలు, మత పరమైన కార్యక్రమాల జన సమూహాలను నిషేధం. –అంతరాష్ట్ర బస్సులు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. అవీ.. ఇవీ.. –హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన బాధితులు బయట తిరగరాదు. ఒకవేళ బయటకు వేస్తే..వారిపై చర్య తీసుకోవడంతోపాటు, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు. –ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలి. ఉల్లంఘిస్తే.. సంబంధిత చట్టాల ప్రకారం చర్య తీసుకుంటారు. –అన్ని అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా మూసివేత. పౌష్టికాహారం తీసుకుంటున్న తల్లులు, గర్భిణీలు, పిల్లలకు ఇంటికి రేషన్‌ను తీసుకెళ్లాలి. –ఈ లాక్డౌన్ సమయంలో ప్రసవించడానికి ఉన్న గర్భిణీల లిస్టు రూపొందించి, పర్యవేక్షించడం, ఆసుపప్రతుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ సంస్థలు/ఆఫీసులు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం, పోలీసు, స్థానిక సంస్థలు, అగ్నిమాపక విభాగం, విద్యుత్, నీటి సరఫరా, పన్నులు వసూలు చేసే ప్రభుత్వ కార్యాలయాలు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన అనుబంధ విభాగాలు, పౌరసరఫరాల శాఖ, కోవిడ్ కోసం నియమితులైన సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో 33 శాతం ఉద్యోగుల హాజరుతో రోస్టర్ విధానంలో విధులకు హాజరు కావాలి. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు. ఇందులో పౌరసరఫరాల కమిషనర్, కమిషనర్ ట్రాన్స్‌పోర్టు, వరంగల్, హైదరాబాద్ రీజియన్ల పోలీసు ఐజీలు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్, ఉద్యానవన విభాగం డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ సభ్యులుగా ఉంటారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు, ఆక్సిజన్ పంపిణీ కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు 6 నెలల కాలపరిమితితో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులైన 12 మందిని అందులో సభ్యులుగా చేర్చింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రణాళికను రూపొందించే బాధ్యతను కూడా ఆ కమిటీకి అప్పగించింది. అలాగే, ఎయిమ్స్‌కు చెందిన రణదీప్ గులేరియా, మాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన సందీప్ బుధిరాజా, సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని ఇద్దరు ఐఏఎస్ అధికారులతో ఒక సబ్ కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా, నగరంలో వైద్య వ్యవస్థ మౌలిక వసతులను ఆ కమిటీ సమీక్షిస్తుంది. విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారం జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా కేంద్ర కేబినెట్ సెక్రటరీని, ఎక్స్ అíఫీషియో మెంబర్‌గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం నియమించింది. ఈ మేరకు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెబ్సైట్లో శనివారం అప్లోడ్ చేశారు. టాస్క్‌ఫోర్స్‌లో బాబాతోష్ బిశ్వాస్(వెస్ట్‌బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్‌లర్), దేవేందర్ సింగ్ రాణా(ఢిల్లీ్లలోని సర్ గంగారామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్పర్సన్), దేవీప్రసాద్ శెట్టి(బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్ చైర్పర్సన్, ఈడీ), గగన్‌దీప్ కాంగ్(వెల్లూర్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్) తదితరులున్నారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శాస్త్రీయ ప్రణాళికలను టాస్క్‌ఫోర్స్ నిపుణులు రూపొందిస్తారని, అలాగే, విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవసరాల మేరకు ఆక్సిజన్ డిమాండ్, సరఫరాలపై శాస్త్రీయ అంచనా సహా 12 విధులను కోర్టు ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఇందుకు రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలను టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ సబ్ కమిటీల్లో ఆయా రాష్ట్రాల కార్యదర్శి స్థాయి అధికారి, అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పేషెంట్ల చికిత్స సమయంలో వైద్యులు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం కాదని, మెడికల్ ఆక్సిజన్ పంపిణీ, వినియోగంలో పారదర్శకత నెలకొనాలని, అవసరాల మేరకు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా జరగాలనేదే తమ ఉద్దేశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ నివేదికను సమర్పించేంతవరకు.. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు తమకు మధ్యంతర నివేదికలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించింది. -
కల్తీరాయుళ్లపై దాడులు నిరంతరం
గుంటూరు వెస్ట్: కల్తీ వ్యాపారుల లీలలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలుగుతోందని.. వీరిపై దాడులను గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నిరంతరం జరపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. కల్తీ వ్యాపారుల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దన్నారు. గత సోమవారం ‘సాక్షి’లో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా అధికారులు నాలుగు రోజులుగా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లపై పెద్దఎత్తున దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నమూనాలు సేకరించడం, పరీక్షలకు పంపడం తదితర అంశాలు వేగంగా చేపట్టాలన్నారు. కల్తీ ఉన్నట్లు తేలితే 6 నెలలు జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధిస్తారని కల్తీరాయుళ్లకు చెప్పాలన్నారు. వ్యాపారులకు కూడా చట్టంపట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కల్తీ వ్యాపారులను పట్టించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరైనా 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు తక్షణం స్పందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఆహార వస్తువులు కల్తీ జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. కఠినంగా వ్యవహరిస్తున్నాం కాగా, సమావేశంలో వివిధ శాఖల అధికారులు తాము చేపడుతున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటివరకు 124 వ్యాపార సంస్థలను తనిఖీచేసి 16 సంస్థలను సీజ్ చేశామన్నారు. 87 సంస్థల్లో శాంపిల్స్ సేకరించామన్నారు. కొన్ని శాఖల మధ్య సమన్వయ లోపం కూడా అక్రమార్కులు విజృంభించడానికి కారణమని, సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహిద్దీన్, పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ చిన్నయ్య , జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇచ్చంపల్లి నుంచే 'అనుసంధానం'!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆదేశించింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 85 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేందుకు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలను తరలిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని నీటి పారుదల, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) పరిధిలోని, అనుసంధానం వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా టాస్క్ ఫోర్స్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ 2 ప్రతిపాదనలు ఇవీ.. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట)కు మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించే 247 టీఎంసీల్లో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్ ఫోర్స్ కమిటీకి పంపింది. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం.. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తే టాస్‌్కఫోర్స్ కమిటీ పేర్కొన్న మేరకు ప్రయోజనం ఉండదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమై పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని పేర్కొంటున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. లోయర్ గోదావరి సబ్ బేసిన్(జీ–10)లో ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిరి్మంచడానికి 1975 డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 85 టీఎంసీలను మాత్రమే ఇచ్చంపల్లి నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వినియోగించుకోవాలి. ఇచ్చంపల్లిలో అంతర్భాగమైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో ఉమ్మడి ఏపీ 27 శాతం, మహారాష్ట్ర 35 శాతం, మధ్యప్రదేశ్ 38 శాతం చొప్పున భరించాలి. విద్యుత్‌ను ఇదే దామాషాలో పంచుకోవాలి. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసిన జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉంటుంది. అభిప్రాయాలను తీసుకోకుండానే.. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ జానంపేట నుంచి గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదనను తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జానంపేట పరిసర ప్రాంతాల నుంచి గోదావరి జలాలను తరలించడానికి ప్రాజెక్టులు చేపట్టిందని, వాటి ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని జానంపేట నుంచి చేపడితే తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు ఈ అనుసంధానం పరిధిలోకి వస్తుందని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచే కావేరికి గోదావరి జలాలను తరలించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ ప్రతులను ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు పంపిన టాస్‌్కఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం పనులు చేపట్టేలా డీపీఆర్ రూపొందించాలని ఆదేశించింది. బేసిన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకల అభిప్రాయాలను తీసుకోకుండానే కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని నీటిపారుదలరంగ, న్యాయ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి గో‘దారి’!
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానానికి మొదట చేసిన ప్రతిపాదనకే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) మొగ్గు చూపింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా)కు, అక్కడి నుంచి సోమశిల (పెన్నా), అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట (కావేరీ)కు తరలించడం ద్వారా నాలుగు నదులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి వద్ద మిగులుగా 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు.. వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. మహానది–గోదావరిని అనుసంధానం చేశాక.. మహానది నుంచి గోదావరికి తరలించిన జలాలను రెండో దశలో కావేరికి తీసుకెళ్లాలని పేర్కొంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ నెల 25న ఢిల్లీలో భేటీ కానుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు ఎస్కే హల్దార్, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్, ఎనిమిది మంది సభ్యులు, పది మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. ఇతర నదుల అనుసంధానంతో పాటు ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ భేటీలో వెల్లడైన అంశాల ఆధారంగా మార్చి 4న తిరుపతిలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సులో గోదావరి–కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, కె.పళనిస్వామి, యడియూరప్ప, పి.విజయన్‌లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంప్రదింపులు జరపనున్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే, ఆ రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే గోదావరి నికర జలాల్లో మిగులు జలాలు కన్పిస్తున్నాయని, ఆ రాష్ట్రాలు వాటా జలాలను ఉపయోగించుకుంటే మిగులు జలాలు ఉండే అవకాశం లేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ సంపూర్ణ హక్కు కల్పించిన నేపథ్యంలో.. గోదావరి నుంచి మళ్లించే నీటిలో సింహభాగం ఏపీకే కేటాయించాలని సూచిస్తున్నారు. ఆ మూడు ప్రతిపాదనలు వెనక్కి గోదావరి–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ 2019లో మూడు ప్రతిపాదనలు చేసింది. జానంపల్లి, దమ్ముగూడెం, అకినేపల్లిల నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించడం ద్వారా అనుసంధానం చేయాలని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై భాగస్వామ్య రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాక ఈ అనుసంధానంపై చర్చించాలని సూచించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చేసిన మూడు ప్రతిపాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ పక్కన పెట్టింది. 2002లో మొదట చేసిన ప్రతిపాదననే మళ్లీ తెరపైకి తెచ్చింది. అయితే గోదావరి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే.. కృష్ణా, కావేరి జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కర్ణాటక, కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీటిపై ఈనెల 25న టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిక ఇవ్వనుంది. మార్చి 4న తిరుపతిలో జరగనున్న సదస్సులో ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీసుకోనున్నారు. నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాకే మిగులు జలాలను మళ్లించాలని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలు స్పష్టం చేసిన నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాలను కేంద్రం ఎలా ఒప్పిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. చదవండి: ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
వ్యాక్సిన్ డ్రై రన్: టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్లో ఎదురైన సమస్యలు, సవాళ్లపై సమీక్షించారు. పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ కమిటీకి జిల్లా కమిటీ పంపనుంది. (చదవండి: కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’) కాగా, కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు.(చదవండి: రెండు డోసులతోనే పూర్తి రక్షణ) -
ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో టిక్కెట్లు రద్దు చేసుకున్న వారు పోగా, 15 నుంచి వేల 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఇందులో 65 శాతం మంది గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు ఉన్నారన్నారు. శనివారం విజయవాడలోని ఆర్అండ్బీ కార్యాలయంలో నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్‌తో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు విశాఖపట్నం, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విజయవాడ విమానాశ్రయం, నెల్లూరు, రాయలసీమ నాలుగు జిల్లాలకు తిరుపతి ఎయిర్‌పోర్టులు కేటాయిస్తున్నామన్నారు. నార్త్, సౌత్ అమెరికా నుంచి వచ్చే విమానాలు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌కు చేరితే అక్కడి నుంచి విమానాల్లో తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశంలో ఏపీ, కేరళ రాష్ట్రాలు మాత్రమే ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పిస్తున్నాయని, మిగిలిన రాష్ట్రాల్లో పెయిడ్ క్వారంటైన్ అందిస్తున్నారన్నారు. ఈనెల 11న అమెరికా నుంచి మొదటి విమానం హైదరాబాద్‌కు చేరుకుంటుందని, ఇతర దేశాల నుంచి రాగానే, రిసెప్షన్ టీం ఉంటుందని, అక్కడే ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షలు చేస్తామన్నారు. అంతర్రాష్ట్ర రవాణాకు మరింత వెసులుబాటు కల్పించేందుకు డాక్యుమెంట్లతో కూడిన పత్రాలను టp్చnఛ్చీn్చ. జౌఠి. జీnకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా ఈ–పాస్‌లు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్స్‌కు వస్తాయి. సహేతుక కారణాలు, సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరచాలి. -
‘పీపీఈ కిట్లు కొరత లేకుండా చూస్తాం’
సాక్షి, నెల్లూరు: కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన సమావేశంలో వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ హాజరయ్యారు. జిల్లాలో క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో అందిస్తున్న సేవలు, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మంత్రి అనిల్‌కుమార్ తన సొంత నిధులతో 200 పిపిఈ కిట్లను మెడికల్ కళాశాల వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాలున్నాయని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. పీపీఈ కిట్లకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి'
ఢిల్లీ : దేశంలోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19ను కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ గురించి బయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రసుత్తం ఉన్న పరిస్థితులను ఎమర్జెన్సీగా భావించి టాస్క్‌ఫోర్స్ విభాగం పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లేడీ హార్డింగ్ ఆసుపత్రి, ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ప్రత్యేక పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా సోకిన వ్యక్తితో పాటు అతనితో వచ్చిన 88 మందిని అధికారులు గుర్తించారని, వారందరికి కరోనాకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు ఇండియాలో 28 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ('ముద్దులకు దూరంగా ఉండాల్సిందే!') (కరోనా ఎఫెక్ట్ : హోలీకి వారు దూరం) Delhi Chief Minister Arvind Kejriwal: A state-level task force has been constituted to control the situation arising due to #CoronaVirus. It will be chaired by me. It includes members from several agencies, departments & corporations. Each member has been assigned a role. pic.twitter.com/hlK92RpO1P — ANI (@ANI) March 4, 2020 -
‘కరోనా’ పై టాస్క్‌ఫోర్స్ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందడంతో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేసింది. చైనాలోని భారత విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా కరోనా వైరస్‌పై మంత్రుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర హోంశాఖ సహాయకమంత్రి కిషన్‌రెడ్డితో పాటు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి, పౌరవిమానయానశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌పోర్స్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. (చదవండి : భారత్‌లో మూడో ‘కరోనా’ కేసు) కాగా, కేరళలో సోమవారం మరో కరోనా కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. కేరళ కాసర్గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు.ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో 300 మందికి పైగా మృతి చెందారు. అలాగే 15 వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది. -
నైపుణ్యాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనకు ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 13న పరిశ్రమల రంగంపై జరిగిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి చైర్మన్‌గా, విద్యాశాఖ మంత్రిని కో–చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కన్వీనర్‌గా నియమిస్తున్నట్టు రాష్ట్ర ఐఐఐ అండ్ సీ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అనుబంధ సభ్యులతో పాటు.. ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకునే అవకాశాన్ని టాస్క్‌ఫోర్స్‌కి కల్పించారు. రాష్ట్రంలో ప్రస్తుత మానవ వనరుల నైపుణ్యంపై వాస్తవ పరిస్థితితో పాటు.. కొత్తగా ప్రవేశపెట్టే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎటువంటి సిలబస్‌ను రూపొందించాలన్న అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ అధ్యయనంచేసి తొలి సమావేశమైన ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను గుర్తించడంతో పాటు.. ఈ రంగంతో సంబంధం ఉన్న ఏపీఎస్ఎస్డీసీ, ఎస్ఈఈడీఏపీ, విద్యా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రధాన పెట్టుబడిదారులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొందించాలి. అలాగే పార్లమెంటు పరిధిలో ఈ కేంద్రం ఏర్పాటుకు సామర్థ్యం ఉన్న విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలను గుర్తించడంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ సంస్థలో శిక్షణ ఇవ్వడానికి అనుభవం ఉన్న ట్రైనీలను గుర్తించడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేలా సిలబస్‌ను రూపొందించడం, నిర్దిష్ట కాలపరిమితిలోగా శిక్షణ పూర్తయ్యేట్లు కార్యక్రమం రూపొందించడం, శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు ఉపాధి లభించాక వారి పనితీరును పరిశీలించడం వంటివి ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధాన లక్ష్యం. -
డీటీసీతో ‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది. ఆదాయపు పన్ను మూడు రకాలే... వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీడీటీకి మంగళం? ‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్‌పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది. -
ప్రత్యక్ష పన్నుల నివేదికపై మరింత గడువు?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టం రూపకల్పన కోసం ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ.. ఇందుకు మరింత గడువివ్వాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇప్పటిదాకా పురోగతి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించిన సందర్భంగా.. నివేదిక సమర్పించేందుకు మరో 2–3 నెలల గడువు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 50 ఏళ్ల నుంచి అమలవుతున్న ఆదాయ పన్ను చట్ట నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో 2017 నవంబర్‌లో కేంద్రం ఆరుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల వ్యవధిలో 2018 మే 22 నాటికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఆ తర్వాత ఆగస్టు 22 దాకా పొడిగించింది. అప్పటికీ నివేదిక సిద్ధం కాలేదు. ఈలోగా కమిటీ కన్వీనర్ అరవింద్ మోదీ సెప్టెంబర్ 30న రిటైర్ కావడంతో టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రశ్నార్థకంగా మారింది. -
బాలికల నిష్పత్తి పెంచాలి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): బాలికల లింగ నిష్పత్తిని పెంపొందించడం, వారిపై వివక్షను నిరోధించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం తన చాంబర్లో బేటీ బచావో పథకం జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల లింగ నిష్పత్తి తగ్గడానికి మహిళలకు స్వయం సాధికారత లేకపోవడం ఒక కారణమన్నారు. ఆడపిల్ల పుట్టిన తరువాత పౌష్టికాహారం, విద్యను అందించడంలో వివక్ష చూపుతున్నారని అన్నారు. సామాజిక రు గ్మతలు, లింగ నిర్ధారణ స్కానింగ్ సెంట ర్లు కూడా బాలికల నిష్పత్తి తగ్గడానికి కార ణాలు అవుతున్నాయని అన్నారు. 2011 సంవత్సరం జనాభా ప్రకారంగా వెయ్యి మంది పురుషులకు గాను 918 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. బాలికల నిష్పత్తిని పెంపొందించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని, అందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు తమవంతుగా కృషి చేయాలన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాలికల దశలో తక్కువగా ఉన్నారన్నారు. నిష్పత్తి సమానం కావాలంటే మహిళలు విద్య పరంగా ఎదగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 950 నిష్పత్తి కంటే తక్కువగా ఉన్న 640 జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. అందులో మన జిల్లా 945 నిష్పత్తితో ఉన్నట్లు వివరించారు. లింగ వివక్షను తగ్గించడానికి కొత్త పెళ్లి జంటలు, గర్భిణులు, తల్లులు, యువతీ యువకులు, వైద్యులు, డయాగ్నోసిస్ సెంటర్ల నిర్వహకులకు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అవగాహన ప్రచార సామగ్రి, విద్య, వైద్యం, ఇతర అంశాలను చేపట్టేందుకు రూ.50 లక్షలతో ప్రణాళికను టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ స్రవంతి, రవీందర్, డీఈఓ రాజేశ్, డీఎంఅడ్‌హెచ్‌ఓ సుదర్శనం, డీపీఓ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఘనంగా డోలోత్సవం మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహుడి ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా డోలోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి అనంతరం స్వామివారికి అభిషేకం చేసి డోలోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి ప్రభు, అర్చకులు శ్రీనివాసచార్యులు, నర్సింహాచార్యులు, పరందామచార్యులు, సిబ్బంది సంతోష్, బాలయ్య, రమేశ్ ఉన్నారు. -
సాగుకు ముందే పంట రుణం
స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటల బీమా సాక్షి, హైదరాబాద్: సీజన్లో సాగుకు ముందే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ‘ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు’ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. అప్పుడే రైతు తనకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసి ప్రైవేటు అప్పులకు దూరంగా ఉంటారని, రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ రాజిరెడ్డి కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో నాబార్డు సహా వ్యవసాయ, ఉద్యాన, పశుసం వర్థక, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతు ఆదాయం రెట్టింపునకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు తమ నివేదికలు అందజేశాయి. ప్రస్తుతం సాగు చేశాకే పంట రుణాలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని టాస్క్ ఫోర్స్ కమిటీ వివరించింది. పంట వేయడానికి ముందే వివిధ పంటలకు బీమా ప్రీమియం గడువులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడి, చేపలు, గొర్రెల పెంపకం వంటి వాటిని కూడా ఎంచుకోవాలని సూచించారు. ఎరువుల వాడకాన్ని తగ్గించాలి: వచ్చే ఖరీఫ్ నుంచి ఎరువుల వాడకాన్ని కనీసం పావు శాతానికి తగ్గించేలా చూడాలని కమిటీ సూచించింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న అంశంపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు రెండు బృందాలు వెళ్లి సర్వే నిర్వహించాయి. -
దశలవారీగా నగదురహితం
-
దశలవారీగా నగదురహితం
- ముందు పట్టణాల్లో,తర్వాత గ్రామాల్లో - 60 శాతం లక్ష్య సాధనకు కృషి - ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకేసారి నగదురహితం సాధ్యం కాదని, దాన్ని దశలవారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదించింది. నగదురహిత లావాదేవీలపై ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ 10 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నగదు రూపం లో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నిం టినీ ముందుగా నగదురహితంగా మార్చాలని సూచిం చింది. ‘‘సమాజాన్ని నగదురహితం చేయడం ఒకే సారి సాధ్యం కాదు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి, దశలవారీగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తే సరైన ఫలితముంటుంది. భారీ స్థాయి లో నగదు లావాదేవీలు జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే గనుక అక్కడే ముందుగా అమలు చేస్తే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు’’ అని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగా ణలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేం దుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయడం తెలిసిందే. పలు దఫాల సమావేశాల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు కమిటీ నివేదిక అందజేసింది. అందులోని ముఖ్యాంశాలు... 60 శాతం నగదురహితం లక్ష్యం ► నెట్ బ్యాంకింగ్, కార్డులు, మొబైల్ సేవలతో పాటు చెక్కులను ఉపయోగించాలి. అధిక విలువ కలిగిన లావాదేవీలపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలి. దీంతో 60 శాతం మొత్తం లెక్కలోకి, పన్నుల పరిధిలోకి వస్తుంది. ► ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలి... ► నగదురహిత లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ అక్షరాస్యత పట్టణాల్లో ఉన్నందున అమలు సులభం. గ్రామాల్లో జరిగే లావాదేవీలు తక్కువే. ► పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు ఎక్కువగా సాగితే ఉన్న నగదును గ్రామీణ ప్రాంతాలకు తరలించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా అందరికీ బ్యాంకు ఖాతాలుండేలా చూడాలి. వారందరికీ రూపే కార్డులిచ్చి పని చేసేలా చూడాలి. ప్రభుత్వం, బ్యాంకర్లు రూపే కార్డులను ప్రోత్సహించాలి. ► బ్యాంకు ఖాతాలున్న ప్రతిఒక్కరికీ రూపే కార్డులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి ► డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ► చౌకధర దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలను అమలు చేయాలి ► మార్కెట్ యార్డుల్లో రైతుల ఉత్పత్తులకు చేసే చెల్లింపులను బ్యాంక్ ఖాతాల్లోనే జమచేయాలి ► వంట గ్యాస్ సిలిండర్‌కు చెల్లింపులు నగదు రహితంగానే జరిగేలా చూడాలి ► ముందుగా ప్రభుత్వ లావాదేవీల్లో నగదురహిత విధానాన్ని అమల్లోకి తేవాలి ► రూ.500కు మించి ప్రభుత్వం చేసే, ప్రభుత్వానికి చేసే చెల్లింపులన్నీ డిజిటల్ పద్ధతిలో జరగాలి ►ఆన్లైన్లో విద్యుత్, మంచినీటి బిల్లుల చెల్లింపులపై సర్వీస్ చార్జీలను తొలగించాలి ►80 శాతం వరకు ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ► ప్రైవేట్ రంగంలోనూ అధిక విలువ కలిగిన లావాదేవీలు నగదురహితంగా జరిపేలా ప్రోత్సహించాలి ► రూ.5,000కు మించిన కొనుగోళ్లు.. రూ.1,000కి మించిన చెల్లింపులు నగదురహితంగా జరిగేలా చూడాలి ► నగదురహిత లావాదేవీల అమలు, పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి ► ఆన్లైన్, మొబైల్ సేవల్లో మోసాలు, అన్యాయాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి -
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి
టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ సుల్తానియా సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిం చడంలో భాగంగా బ్యాంకుల ద్వారా ఖాతాదారులకు రూపే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ సందీప్‌కుమార్ సుల్తానియా బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటికే ఖాతాదారుల వద్ద అందుబాటులో ఉన్న రూపే కార్డులన్నీ యాక్టివేట్ చేయాలన్నారు. డీమానిటైజేషన్పై ఏర్పాటైన టాస్క్ ఫోర్సు కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారిగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ వాడుకలో లేని కార్డులను బ్యాంకులు హోల్డ్‌లో పెట్టాయని, వీటిని తిరిగి వాడుకలోకి తీసుకురావాలన్నారు. రూపే కార్డులకు పిన్ నంబర్లను ఖాతాదారుల ఈమెయిల్‌కు పంపించాలని, ప్రతీ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ తదుపరి కేటాయింపుల్లో పోస్టాఫీసులకు కనీసం రూ.100 కోట్లు కేటాయించాలని, ఆసరా పింఛన్ దారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో చిన్న నోట్లను పంపిణీ చేసి రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. కొత్త జిల్లాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం 21 మంది జిల్లా కోఆర్డినేటర్లను నియమించమని ఆర్బీఐని కోరాలని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. నవంబర్ 8 తరువాత డిజిటల్ లావాదేవీల పెరుగుదల వివరాలను సమర్పించా లని బ్యాంకర్లను కోరారు. ప్రీపెయిడ్ కార్డుల జారీపై కూడా కమిటీ చర్చించి వీటి వినియోగాన్ని పెంచాలని అభిప్రాయపడింది. ఎస్బీఐ జనరల్ మేనేజర్ గిరిధర్, ఆంధ్రా బ్యాంక్ డీజీఎం రమణయ్య, ఆర్బీఐ ఏజీఎం సుబ్రమణ్యం, ఎస్ఎల్బీసీ సీజీఎం జేబీ సుబ్రమణ్యం, చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ బి చంద్రశేఖర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వివిధ విభాగాల అధికారులు, బ్యాంకర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర స్థారుులో ఈ కమిటీని నియమించినట్లుగా పేర్కొంటూ ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఆర్బీఐ ప్రతినిధి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ జోనల్ హెడ్లు సభ్యులుగా ఉంటారు. -
కార్డు చెల్లింపులపై జీరో చార్జీలు
• ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసులు • లావాదేవీల చార్జీలను శాఖలే భరించాలి • స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పేదలకు రూ.1000 సబ్సిడీ ఇవ్వాలి • పాలు, రేషన్ దుకాణాల్లో మొబైల్ పేమెంట్లను ప్రోత్సహించాలి సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌లైన్స్ సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రైవేటు వ్యాపార సంస్థల తరహాలోనే డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీలను ప్రభుత్వ శాఖలే భరించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళవారాల్లో సమావేశాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి పలు కీలక సిఫారసులు చేసింది. కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై జీహెచ్ఎంసీ, డిస్కంలు, జల మండలి సంస్థలు పౌరుల నుంచి 0.80 నుంచి 0.90 శాతం వరకు ట్రాన్సాక్షన్ చార్జీలను వసూలు చేస్తున్నారుు. అరుుతే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీల భారాన్ని తప్పించాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. అలాగే ప్రభుత్వ శాఖలపై లావాదేవీల చార్జీల భారం ఉండని నెట్ బ్యాంకింగ్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పౌరులకు రారుుతీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. నగదు రహిత లావాదేవీల అమలుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచలను ఆహ్వానించింది. వాటిని డిసెంబర్ 10లోగా ఛ్చిటజ్ఛిటట.టఠట్ఛటజిఃజఝ్చజీ.ఛిౌఝకు పంపాలని కోరింది. ఇతర ముఖ్య ప్రతిపాదనలు ఇవీ.. ⇔ ప్రభుత్వానికి ఆదాయార్జన తెచ్చి పెట్టే శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖల తరహాలో జరిగే భారీ లావాదేవీలు నెట్‌బ్యాంకింగ్/ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ల ద్వారా జరిగేలా చూడాలి వినియోగదారుల నుంచి కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు వ్యాట్ డీలర్లందరికీ స్వైపింగ్ యంత్రాలను అందించాలి రూ.20వేలకు మించిన లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలి ⇔ మార్కెట్‌యార్డులు, సహకార సొసైటీలు రైతుల ఖాతాలకు ఆన్లైన్ చెల్లింపులు జరపాలి నగదు రహిత చెల్లింపులపై సహకార సొసైటీలు రైతులకు సరుకులు విక్రరుుంచాలి అన్ని రేషన్ దుకాణదారులు, పాల సమాఖ్యలోని పాల విక్రయదారులు, ఇతరులు తమ వినియోగదారులకు బడ్డీ/పాకెట్స్/పేటీఎం తదితర యాప్‌ల సాయంతో మొబైల్ పేమెంట్లు జరిపేందుకు అవకాశం కల్పించాలి పాల వ్యాపారులు, రేషన్ డీలర్ల నుంచి చెల్లింపులను నెట్ బ్యాంకింగ్/ఎన్ఈఎఫ్టీ/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పాల సమాఖ్యలు, పౌర సరఫరాల సంస్థ స్వీకరించాలి రైతు బజార్లలో మొబైల్ పేమెంట్లు లేదా కూపన్లతో చెల్లింపులు జరిపే వ్యవస్థను తేవాలి ఎల్పీజీ బుకింగ్ కోసం ఆన్లైన్లోనే చెల్లింపులు స్వీకరించాలి ⇔ కూరగాయలు, కిరాణ వస్తువుల వంటి తక్కువ ధర లావాదేవీల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక పారుుంట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలు, యాప్‌లను ప్రవేశపెట్టాలి నగదు రహిత చెల్లింపులపై పురోగతిని సమీక్షించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్య ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులతో రాష్ట్ర, జిల్లా స్థారుుల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి ⇔ ప్రతి మండలంలో బ్యాంకు అధికారులు, బ్యాంకు మిత్రలతో నగదు రహిత సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయాలి ⇔ పేద కుటుంబాలు ఆన్లైన్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు 25 శాతం సబ్సిడీని రూ.1000కు మించకుండా ప్రభుత్వం చెల్లించాలి ఆన్లైన్ లావాదేవీలకు అవసరమైనంత మేరకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం లేదు. ప్రచార కార్యక్రమాల ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకు అధికారులు నగదు రహిత, కార్డు, ఆన్లైన్, మొబైల్ పేమెంట్ల ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాలి జిల్లాల్లో పౌరుల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు జిల్లా స్థారుులో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలి -
‘మిగులు’పై తేలుస్తారా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయని గోదావరిలో మిగులు జలాల లభ్యతపై ఉన్న సందిగ్ధతపై చర్చించేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ నెల 9న మరోమారు ఢిల్లీలో భేటీ కానుంది. మిగులు జలాలపై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ), రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన భిన్న గణాంకాల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవమో కమిటీ చర్చిం చనుంది. ఈ సమావేశంలో గోదావరి మిగు లు జలాల అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేర్చింది. దీంతో పాటు మహానది మిగులు జలాలపైనా చర్చిస్తారు. నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా మహానది, గోదావరిలో మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలో ఇచ్ఛంపల్లి(గోదావరి)- నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్ఛంపల్లి- పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని గతంలో ప్రణాళిక వేసిన విషయం తెలిసిందే. అయితే గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో ప్రస్తుత, రాబోయే అన్ని ప్రాజెక్టులతో కలిపి మొత్తంగా 628.64 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటోందని, మిగతావన్నీ మిగులు జలాలేనని ఎన్‌డబ్ల్యూడీఏ తేల్చిచెబుతోంది. ఈ లెక్కలు తప్పని రాష్ట్రం వాదిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులతో మొత్తంగా 433.04 టీఎంసీల వినియోగం జరుగుతోందని, నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో మొత్తంగా 475.79 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేనున్నామని తెలిపింది. ఇక మరో 45.38 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయని, ఈ లెక్కల ఆధారంగా గోదావరిలో మిగులు ఏమీ లేదని చెబుతోంది. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ
హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీయ్యింది. కొత్తజిల్లాల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, వస్తు సామాగ్రి, వాహనాల విభజన చర్యలపై సీఎస్ ఈ సమావేశంలో సమీక్షించారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజీవ్ శర్మ సూచించారు. -
టాస్క్‌ఫోర్స్ కమిటీలో కలెక్టర్‌కు స్థానం
జిల్లాల విభజన కమిటీలో సభ్యురాలిగా నియామకం హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు సభ్యురాలిగా స్థానం లభించింది. ఈ కమిటీలో భూపరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు వరంగల్æ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించారు. కొత్త జిల్లాల కోసం ప్రభుత్వ ముసాయిదా ప్రకటించిన నేపథ్యంలో వివిద జిల్లాలు, రెడిన్యూ డివిజన్లు, మండలాలకు సంబందంచిన అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. -
మాది పంచసూత్ర ప్రణాళిక
- టాస్క్‌ఫోర్స్‌కు సర్కారు నివేదిక - సాగుకు రూ.22,333 కోట్లు అవసరమని అంచనా - నాలుగేళ్లలో సుస్థిర అభివృద్ధికి ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లలో సుస్థిర వ్యవసాయ వృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం రూ. 22,333.22 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో వ్యవసాయశాఖపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి సమర్పించింది. భూముల సమర్థ వినియోగం, సాగునీటి వసతి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పంట రుణాలు-పంటల బీమా, మార్కెటింగ్.. ఈ ఐదు అంశాలే తెలంగాణలో వ్యవసాయ సుస్థిర వృద్ధికి అనుసరించే పంచ సూత్రాలని అభివర్ణించింది. 2015-16 నుంచి 2018-19 వరకు నాలుగేళ్ల వ్యవసాయ సాగు ప్రణాళికలు, చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రభుత్వం ఈ నివేదికలో పొందుపరిచింది. దీంతోపాటు ఉద్యానవన శాఖ, పశువుల పెంపకం, మత్స్య అభివృద్ధి, మార్కెటింగ్ వసతులు, రైతుల రుణాలకు సంబంధించి సహకార శాఖ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను, అనుసరించాల్సిన భవిష్యత్ ప్రణాళికలను ప్రస్తావించింది. ఆయా రంగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే నిధుల అంచనాలను పొందుపరిచింది. నివేదికలో పేర్కొన్న అంశాలు తెలంగాణ జనాభాలో 55.7 శాతం రైతులు, వ్యవసాయ కూలీలున్నారు. 2006-07 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.2 శాతమున్న వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా.. గతేడాది 13.86 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 56.90 లక్షల హెక్టార్లు. ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 3 లక్షల హెక్టార్ల మేర, పప్పు ధాన్యాల విస్తీర్ణం లక్షన్నర హెక్టార్లు, నూనె గింజల సాగు 2 లక్షల హెక్టార్లకు పైగా పెరుగుతాయి. ప్రస్తుతం 16.50 లక్షల హెక్టార్లలో వరి సాగు, 15.38 లక్షల హెక్టార్లలో ఉన్న పత్తి సాగు విస్తీర్ణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండదు. ఏటేటా మొక్కజొన్న, సోయాబీన్ పంటల విస్తీర్ణం పెరుగుతుంది. రాష్ట్రంలో విత్తనాల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణంతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్, ఐసీఏఆర్ తదితర పరిశోధన సంస్థలుండటం కలిసొచ్చే పరిణామం. అందుకే విత్తన తయారీ, సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బయోటెక్ లేబొరేటరీతో పాటు విత్తనాల నిల్వ, సీడ్ బ్యాంక్ నిర్వహణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంది. పసుపు సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పళ్ల సాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో, ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది. కూరగాయల సాగు విస్తీర్ణంలో 11వ స్థానంలో, ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌తో పోలిస్తే కూరగాయల ఉత్పత్తి కేవలం 20 శాతమే ఉంది. సరిపడా కోల్డ్ స్టోరేజీలు, రెపైనింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంది. దీంతోపాటు నీటి సమర్థ వినియోగానికి పాలిహౌస్‌లు, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు విస్తరించాలి. హైబ్రిడ్ కూరగాయల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు అనువైన కొత్త పద్ధతులు అవలంబించాల్సి ఉంది. రైతులకు తగిన శిక్షణ, సాంకేతిక సహకారం అందించాలి. వ్యవసాయానికి దీటుగా కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకంపై దృష్టి సారించాల్సి ఉంది. పాడి పశువుల పెంపకం, డెయిరీ డెవలప్మెంట్ను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వాలి. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు, పశు ఆరోగ్య కేంద్రాలను విస్తరించాల్సి ఉంది. డెయిరీ ప్లాంట్లను అధునాతన పరికరాలున్న యూనిట్లుగా మార్చాలి. గొడ్డు మాంసం ఎగుమతికి ఇప్పుడున్న పాలసీని సడలించాలి. రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ఐదేళ్లలో 4.05 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి అవసరమయ్యే గోదాములు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, రెపైనింగ్ చాంబర్లు దశల వారీగా నిర్మించాలి. ఆన్లైన్ ట్రేడింగ్‌కు వీలుగా మార్కెట్ యార్డులను కంప్యూటరీకరించాలి. మార్కెటింగ్ మెలకువలు, ధరల హెచ్చుతగ్గుల సరళిని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసే వ్యవస్థలను నెలకొల్పాలి. చెరువులు, కుంటలన్నింటా చేపలను పెంచాలి. రాష్ట్రంలో 19.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. 78 రిజర్వాయర్లతో పాటు 35,031 చెరువులు, 474 కుంటలున్నాయి. ఇవన్నీ 781 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటితో పాటు 5,573 కిలోమీటర్ల పొడవునా నదులు, కాలువలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు చేపల పెంపక కేంద్రాలను అభివృద్ధి చేయడం, రాష్ట్రస్థాయిలో ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్రీడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం, కొత్తగా 110 మార్కెట్లను నెలకొల్పడంతో పాటు 5,000 మొబైల్ ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. వ్యవసాయానికి సరిపడా రుణాలిచ్చి రైతులను ప్రోత్సహించాలి. రైతులకు పంట రుణాల పరిమితి పెంచాలి. వ్యవసాయ విస్తరణ, శిక్షణ, మార్కెటింగ్‌కు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను నోడల్ ఏజెన్సీగా మార్చాలి. పీఏసీఎస్‌లలో చౌక ధరల దుకాణ కేంద్రా లు నెలకొల్పాలి. సొసైటీలను మల్టీ పర్పస్ సర్వీస్ సెంట ర్లుగా తీర్చిదిద్దాలి. భూసార పరీక్షలు మొదలు పంట ఉత్పత్తుల అమ్మకాల వరకు రైతులకు అవసరమైన సేవలన్నీ అక్కడ అందుబాటులో ఉంచాలి. నాలుగేళ్ల ప్రణాళికకు అవసరమయ్యే నిధులు (రూ.కోట్లలో) వ్యవసాయం 9,798.36 జయశంకర్ విశ్వవిద్యాలయం 45.35 ఉద్యానవన శాఖ 4,151.70 హార్టికల్చర్ విశ్వవిద్యాలయం 1,561.02 పశు సంవర్థక శాఖ 1,768.73 పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ 223 మత్స్యశాఖ 393.11 సెరికల్చర్ 152.06 సహకార శాఖ 2,569.89 వ్యవసాయ మార్కెటింగ్ 1,670 మొత్తం 22,333.22