సీఎస్తో కేంద్ర టాస్క్ఫోర్స్ బృందం సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో కేంద్ర హోంశాఖ టాస్క్ఫోర్స్ బృందం గురువారం సచివాలయంలో సమావేశమైంది. విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలపై టాస్క్‌పోర్స్ బృందం సీఎస్‌తో చర్చించింది. శాంతి భద్రతలు, నక్సల్స్, వివిధ సంస్థలపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని హోంశాఖ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు.
శాంతి భద్రతలు పరిరక్షించటంలో ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రెండు, మూడు రోజుల్లో నివేదిక అందచేస్తామని తెలిపారు. మరోవైపు ఐటీ అధికార ప్రతినిధులతో కూడా కేంద్ర హోంశాఖ టాస్క్ఫోర్స్ బృందం సమావేశం అయ్యింది.
కాగా ఇప్పటికే నదీజలాలు, విద్యుత్, సహజవనరులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీల విషయమై ఆయా శాఖల రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న టాస్క్ ఫోర్స్ బృందం ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల వివరాలను సేకరించింది.