సాక్షి, నెల్లూరు: కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన సమావేశంలో వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ హాజరయ్యారు. జిల్లాలో క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో అందిస్తున్న సేవలు, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
మంత్రి అనిల్‌కుమార్ తన సొంత నిధులతో 200 పిపిఈ కిట్‌లను మెడికల్ కళాశాల వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాలున్నాయని తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. పీపీఈ కిట్లకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment