వ్యాక్సిన్ డ్రై రన్‌: టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ | Task Force Committee Review On Covid Vaccine Dry Run | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్ డ్రై రన్‌: టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ

Published Mon, Dec 28 2020 4:31 PM | Last Updated on Mon, Dec 28 2020 4:36 PM

Task Force Committee Review On Covid Vaccine Dry Run - Sakshi

సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌లో ఎదురైన సమస్యలు, సవాళ్లపై సమీక్షించారు. పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ కమిటీకి జిల్లా కమిటీ పంపనుంది. (చదవండి: కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’)

కాగా, కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్‌‌ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని‌ కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు.(చదవండి: రెండు డోసులతోనే పూర్తి రక్షణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement