reviwmeeting
-
వ్యాక్సిన్ డ్రై రన్: టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్లో ఎదురైన సమస్యలు, సవాళ్లపై సమీక్షించారు. పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ కమిటీకి జిల్లా కమిటీ పంపనుంది. (చదవండి: కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’) కాగా, కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు.(చదవండి: రెండు డోసులతోనే పూర్తి రక్షణ) -
సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బిఆర్ కెఆర్ భవన్లో గురువారం ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శాసన మండలి, శాసన సభలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు. సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్‌ను అధికారులు సిద్ధం చేసుకుని ఉండాలని సీఎస్ సోమేష్‌కుమార్ సూచించారు. -
ఆ పనులు చరిత్రాత్మకం కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. నాడు – నేడు కింద చేపట్టే పనులు ఇప్పటివారికే కాదని.. భవిష్యత్తు తరాలకూ సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని.. అందుకే నాడు-నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పనులు చరిత్రాత్మకం కావాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించడం లేదని.. రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (పురోహితులను ఆదుకోండి) -
మేడిగడ్డ పంపుహౌజ్‌కు భూములివ్వం
అధికారుల వైఖరిపై రైతుల ఆగ్రహం రసాభాసగా సమీక్ష సమావేశం పనుల అడ్డగింత రామగుండం : మేడిగడ్డ పంప్‌హౌజ్ నిర్మాణానికి భూములివ్వబోమని రామగుండం మండలం గోలివాడ రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. మంగళవారం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన రెండో దశ సమావేశం రసాభాసగా మారింది. సర్పంచ్ దబ్బెట రమ్య, ఎంపీటీసీ ధర్ని హైమావతి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ బి.విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, ఏఈ మురళికృష్ణ, ఆర్ఐ ఖాజామొహినొద్దీన్ తదితరులు పాల్గొన్న సమావేశంలో.. పంప్‌హౌస్‌లో భూములు కోల్పోతున్న రైతులు, భూముల్లోని ఇతర ఆస్తుల వివరాలు సర్వే నెంబర్ల ఆధారంగా తహసీల్దార్ శ్రీనివాసరావు సమావేశంలో వెల్లడించారు. సర్వేపై రైతుల అభ్యంతరం, సమావేశం బహిష్కరణ సర్వే అంతా తప్పుల తడకగా ఉందని పలువురు రైతులు ఆరోపించారు. తన భూమిలో ఉన్న బోర్వెల్ వివరాలు జాబితాలో రాలేదని ఒకరు, విస్తీర్ణాన్ని తగ్గించి చూపారని మరోరైతు ఆరోపించారు. స్పందించిన ఆర్డీవో సర్వేయర్‌తో మాట్లాడించారు. సాంకేతిక సమస్యలతో కొన్ని సర్వేనెంబర్లలో దొర్లిన తప్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి మళ్లీ నివేదికలు రూపొందిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి వ్యవసాయభూమిని కోల్పోయానని, పంపుహౌజ్‌లో ఇప్పుడు గుంట భూమికూడా మిగలకుండా కోల్పోతున్నానంటూ ఓ రైతు సహనం కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ అసభ్యకరంగా మాట్లాడొద్దని, నష్టం వివరాలను తమదృష్టికి తెస్తే న్యాయం చేస్తామని అన్నారు. శృతిమించి మాట్లాడితే సుంకరులతో గెంటేయించాల్సి వస్తుందని హెచ్చరించడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం తహసీల్దార్ రైతులను చిన్నచూపు చూస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించారు. పంపుహౌజ్ ప్రదేశంలో కొనసాగుతున్న సైటాఫీస్ పనులను అడ్డుకున్నారు. పంపుహౌజ్ కోసం గోదావరి ఒడ్డున సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి మరో సర్వే చేపడుతున్నారని, భూసేకరణ, నిర్మించాల్సిన ప్రదేశాలపై అధికారులు స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సమావేశంలో రైతులు కోరారు. స్పందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుందిళ్ళలో నిర్మించే బ్యారేజితో సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు బ్యాక్ వాటర్ నిలిచి ఉంటుందని, గ్రామ రక్షణ కోసం రెండువైపులా కరకట్ట నిర్మాణానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమావేశం వాయిదాకే కొందరు రైతుల ప్రయత్నం – అశోక్‌కుమార్, పెద్దపల్లి ఆర్డీవో సమావేశాన్ని వాయిదా వేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా ధరపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశాం. అసభ్యకరమైన వ్యాఖ్యలతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తంచేశారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదు. శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తాం. 2013 చట్టం ప్రకారం, లేదా జీవో 123 ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.