హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్లు లేదా జాయింట్ కలెక్టర్లు, ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం ప్రతినిధులు, బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు.
టీఎస్‌ఐఐసీ వైస్‌ఛైర్మన్ కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ప్రతీ నెలా లేదా అవసరమైన సందర్భాల్లో ఈ కమిటీ సమావేశం అవుతుంది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ప్రాజెక్టును చేపట్టింది.
ఫార్మాసిటీ అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్ కమిటీ
Published Thu, Jun 11 2015 9:57 PM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement