తొలిరోజు ముగిసిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ బృందం తొలిరోజు సమావేశం ముగిసింది. ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే శాంతి భద్రతల సమస్యలపై బృందం చర్చించింది. ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో చర్చలు నిర్వహించారు. పోలీసు సిబ్బందిని ఎక్కడ ఎంతమందిని ఉంచాలి, ఆస్తుల పంపిణీ ఎలా అనే సమాచారాన్ని కేంద్ర హోం శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీ సేకరిస్తోంది. ఈ సమావేశంలో 17 మంది ప్రస్తుత, రిటైర్డ్ పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
పోలీసు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. టాస్క్ఫోర్స్ చీఫ్ విజయకుమార్ నేతృత్వంలో ఉన్న ఈ బృందం తిరిగి గురువారం మధ్యాహ్నం సమావేశం అవుతుంది. ఉమ్మడి రాజధానిలో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఈ సమావేశంలో వచ్చినట్లు తెలుస్తోంది. తమ సమావేశం బుధవారం కూడా కొనసాగుతుందని కమిటీ కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలు తగిన సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాల కూర్పుపై దృష్టి పెట్టినట్టు విజయ్‌కుమార్ తెలిపారు.