కొత్త జిల్లాల ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ కమిటీ భేటీ
కొత్త జిల్లాల ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ కమిటీ భేటీ
Published Sat, Sep 3 2016 4:48 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో శనివారం హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ కమిటీ భేటీయ్యింది.
కొత్తజిల్లాల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, వస్తు సామాగ్రి, వాహనాల విభజన చర్యలపై సీఎస్ ఈ సమావేశంలో సమీక్షించారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజీవ్ శర్మ సూచించారు.
Advertisement
Advertisement