CS Rajiv Sharma
-
రాజీవ్‌శర్మ ఎనలేని సేవలందించారు
-
పాత నోట్ల చెల్లుబాటు గడువు పెంచండి
కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్రం చిన్న నోట్లు కేటాయించండి వ్యవసాయ లావాదేవీలకు పాత నోట్లు అనుమతివ్వండి.. నోట్ల రద్దుతో 3 వేల కోట్ల నష్టం సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ. 1,000 నోట్లు చెల్లుబాటయ్యే గడువును మరి కొంత కాలం పొడిగించాలని కేంద్ర బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వ్యవ సాయ రంగంలో పాత నోట్ల వినియోగానికి అనుమతివ్వాలని.. విత్తనాల కొనుగోలుకు ఇచ్చినట్లే ఎరువులకూ వెసులుబాటు కల్పించాలని కోరింది. రైతులకు సేవలందించే సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, పాత నోట్ల జమకు అనుమతివ్వాలని విన్నవిం చింది. నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం, కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనామికసింగ్ తదితరులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆ బృందం భేటీ అయింది. నగదు కొరతతో ప్రజలు పడుతున్న అవస్థలను, రంగాల వారీగా నోట్ల రద్దు ప్రభావాన్ని ఈ సందర్భంగా సీఎస్ రాజీవ్‌శర్మ వివరించారు. నోట్ల రద్దు పరిణామాల కారణంగా చాలా మంది పేదలు ఉపాధి కోల్పోయారని... నిర్మాణ రంగ కార్మికులు, సన్న, చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నోట్లు సరఫరా చేయాలని, పోస్టాఫీ సుల ద్వారా నోట్ల డిపాజిట్, మార్పిడి సదు పాయాన్ని కొనసాగించాలని సూచించారు. రూ.3 వేల కోట్లకుపైగా గండి నోట్ల రద్దుతో ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.3 వేల కోట్లకు పైగా తగ్గే అవకాశముందని కేంద్రం బృందానికి సీఎస్ వివరించారు. అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాలని, సీఎస్టీ బకారుులు వెంటనే విడుదల చేయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక నోట్ల రద్దుతో భూముల కొనుగోలు, అమ్మకాలపై భారీగా ప్రభావం పడిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర వివరించారు. ఎక్సైజ్ ఆదాయం ప్రతి నెలా రూ.50 కోట్లు తగ్గుతుం దని, వచ్చే నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.250 కోట్లు తగ్గుతుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలిపారు. రవాణా రంగంలో నెలకు రూ.90 కోట్ల మేరకు ఆదా యం పడిపోతుందని ముఖ్య కార్యదర్శి సునీ ల్‌శర్మ వివరించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శులు పార్థసారథి, నవీన్ మిట్టల్‌తో పాటు ఆర్బీఐ, ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, నాబార్డ్ ,కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు తదిత రులు పాల్గొన్నారు. బ్యాంకర్ల ఆందోళన సరిపడా డబ్బు లేకపోవడంతో బ్యాంకులు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రాష్ట్రంలోని బ్యాంకర్లు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. ఖాతాదారులకు సరిపడేంత డబ్బు ఆర్బీఐ నుంచి తమకు అందటం లేదని ఫిర్యాదు చేశారు. కేంద్రానికి నివేదిస్తాం నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను తెలుసుకునేందుకు, ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించేందుకు తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్య దర్శి రెడ్డి సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం లో అందుబాటులో ఉన్న కరెన్సీ, సరఫరా జరుగు తున్న తీరు, బ్యాంకుల వద్ద రద్దీ, నియంత్రణ, బ్యాంకు సేవలు, చిరు వ్యాపారు లు, రైతుల ఇబ్బందులన్నీ పరిశీలించి.. ఎలాంటి సహాయక చర్యలు అవసరమో కేంద్రానికి నివే దిస్తామన్నారు. అనంతరం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటనకు కేంద్ర బృందం బయలుదేరి వెళ్లింది. -
'కొత్త నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలి'
హైదరాబాద్ : కొత్త రూ.500 నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర బృందాన్ని కోరారు. నోట్ల రద్దుతో తలెత్తిన పరిణామాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశానికి సీఎస్‌తో పాటు ఆర్బీఐ, పలు బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. నోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి వివరించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుదలపై శాఖలవారీగా నివేదికలు సమర్పించారు. వ్యవసాయ అవసరాలతో పాటు ప్రభుత్వ చెల్లింపులకు పాత నోట్లను అనుమతించాలని రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. -
సామాన్యుడికే కష్టకాలం
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సలో మంత్రి ఈటల - నగదు మార్పిడి పరిమితిని రూ.10 వేలకు పెంచండి - వారానికి రూ.2 లక్షల విత్‌డ్రాయల్‌కు అనుమతించండి - బ్యాంకర్లకు ఆర్థిక మంత్రి ఈటల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనమున్న వాళ్ల కంటే సామాన్యులే ఎక్కువ బాధలు పడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, నోట్ల మార్పిడికి కేంద్రం విధించిన ఆంక్షల ప్రభావంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ఈటల నిర్వహించారు. బ్యాంకుల ఇన్చార్జిలతో పాటు ఆర్బీఐ ఇన్చార్జిలు, లీడ్ బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, నోట్లు మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనే ప్రధానంగా చర్చించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లను ఈటల కోరారు. ‘‘నోట్లు ప్రజల దైనందిన జీవితాలతో సంబంధం ఉన్న అంశం. బ్యాంకింగ్ కార్యక లాపాలతో వారికి సంబంధాలు తక్కువగా ఉంటారుు. అందుకే ఆటోలు, టాక్సీలు, వ్యాన్లలో ప్రయాణాలకు, చిన్న షాపుల్లో కొనుగోళ్లకు పాత నోట్లను అనుమతించే అంశాన్ని బ్యాంకర్లు పరిశీలించాలి. అడ్డాల మీద పని చేసే కార్మికుల జీవన భృతికి ఇబ్బందులు రాకుండా వేతన చెల్లింపులు జరిగేలా చూడాలి. పెళ్లిళ్ల సీజన్లో ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోండి. సోషల్ మీడియాలో పుకార్ల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించేలా ప్రచారం నిర్వహిం చండి. జిల్లాల్లో కరెన్సీ కొరత లేకుండా చిన్న నోట్లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చేలా చూడండి’’ అని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సరిపడేన్ని కొత్త నోట్లు, చిన్న నోట్లు సిద్ధం చేసుకున్నాకే కేంద్రం ఈ కసరత్తు చేస్తే సమస్య వచ్చేది కాదని కాన్ఫరెన్స అనంతరం మీడియాతో అభిప్రాయపడ్డారు. ‘‘నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట క్యూ లైన్లలో నిలబడి ప్రజలు ఉపాధి కోల్పోయారు. అన్ని వ్యాపారాలూ నష్టం చవిచూశారుు. పాత నోట్లు చెల్లక, కొత్తగా విడుదల చేసిన రూ.2,000 నోటుకు చిల్లర దొరక్క జనం నానా కష్టాలు పడుతున్నారు. పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో పాత నోట్లు చెల్లుతాయని చెప్పినా అక్కడా చిల్లర తిరిగివ్వక పోవడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. నగదు మార్పిడి పరిమితిని రూ.4500 నుంచి రూ.10 వేలకు పెంచాలి. ఖాతాదారులు తమ ఖాతా నుంచి (వారానికి) రూ.24 వేలకు బదులు రూ.2 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి’’ అని డిమాండ్ చేశారు. ఖాతాల్లో రూ.2.5 లక్షలకు మించి నగదు జమ చేసుకోవద్దనేలా ఉన్న నిబంధన ప్రజలను మరింత భయభ్రాంతులను చేస్తోందన్నారు. ‘‘పిల్లల పెళ్లిళ్లకు, పై చదువులకు, శుభకార్యాలకు జీవితాంతం కష్టపడి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా కూడబెట్టిన రైతులు, కూలీలు, సామాన్యులున్నారు. అదంతా నల్లధనం కాదు. దీన్ని గుర్తించి కేంద్రం కొన్ని సడలింపులు చేయాలి. తన నిర్ణయాలను సమీక్షించుకోవాలి. తెలం గాణలోని గ్రామీణ బ్యాంకులకు సైతం నగదు మార్పిడి, సంబంధిత లావాదేవీలకు అవకాశం కల్పించాలి. బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడే వారికి కనీస సదుపాయాలు కల్పించాలి. సరిపడేన్ని కొత్త కౌంటర్లు ఏర్పాటు చేయాలి. పనివేళలను పెంచాలి’’ అని బ్యాంకర్లను మంత్రి కోరారు. సహకార బ్యాంకులకు అనుమతివ్వాలి: సీఎస్ రాజీవ్‌శర్మ నోట్ల రద్దు పరిణామాలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన్నారు. ‘‘రాష్ట్రంలో ఖరీఫ్ కొనుగోళ్లు మొదలయ్యారుు. కానీ సహకార బ్యాంకులకు కేవలం రూ.36 కోట్లివ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 12 లక్షల మంది రైతు ఖాతాదారులున్నారు. రబీ పెట్టుబడులకు నోట్ల కొరత లేకుండా చూడండి’’ అని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కోరారు. సహకార బ్యాంకులలో పాతనోట్లు జమ చేసుకునేందుకు అనుమతించాలన్నారు.‘‘గ్రామాల్లో పోస్టాఫీసుల పనితీరును సమీక్షించండి. ఉపాధి కార్మికులకు వేతనాలందేలా చూడండి’’ అని కోరారు. జిల్లాల్లో నగదు కొరత లేకుండా బ్యాంకు అధికారులు పర్యవేక్షించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని నవీన్ మిట్టల్ కోరారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఆర్బీఐ జీఎం కరెన్సీ కొరత తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఆర్బీఐ జీఎం మేఘనాథ్ చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన పని లేదన్నారు. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది వారిని చైతన్యపరచాలన్నారు. మహిళలు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం అందించాలని ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ సూచించారు. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ-పాస్ మిషన్లు, ఈ-వాలెట్లు, రూపే కార్డులు వాడాలని కోరారు. -
ఆర్థిక పరిస్థితిపై అప్రమత్తం
శాఖలవారీగా జమా ఖర్చుల నివేదిక స్పెషల్ సీఎస్‌లకు బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతమున్న వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు అప్పగించింది. ఒక్కో స్పెషల్ సీఎస్‌కు మూడు నాలుగు శాఖల బాధ్యతలను కట్టబెట్టింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆదా య స్థితిగతులపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలపై కేబినెట్లో చర్చ జరిగింది. ఆదాయ వృద్ధి గణనీయంగా ఉన్నా బకాయిలెందుకు పేరుకుపోయాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శాఖల వారీగా వాస్తవ ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. నెల రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలపై సమాచారాన్ని రూపొందించి నివేదిక తయారు చేయాలని స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, శాఖల ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులపై సమీక్షించారు. ప్రతి స్పెషల్ సీఎస్ మూడు నాలుగు శాఖలను అధ్యయనం చేయాలని రాజీవ్ శర్మ సూచించారు. వివిధ పథకాలపై ఆయా శాఖల ఖర్చు, ఆదాయం తదితర వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చాలని చెప్పారు. వివిధ శాఖలకు రావాల్సిన ఆదాయానికి సంబంధించి కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే ఆదాయం, కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు, రెవెన్యూ లీకేజీలు, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చు, పెండింగ్ బిల్లులు, అవసరమైన నిధులన్నీ ఈ నివేదికలో చేర్చాలని సూచించారు. -
సచివాలయం తరలింపు పనులు షురూ..
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం తరలింపు పనులు వేగవంతమయ్యాయి. ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవనాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వివిధ శాఖలకు అనువైన భవనాలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా కొత్త సచివాలయ పనులను ప్రారంభించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భవనాలను పరిశీలించిన వారిలో సీఎస్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మాతృ జిల్లాల్లోనే రికార్డులు
కొత్త జిల్లాలకు స్కానింగ్ కాపీలు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా మాతృ జిల్లాల్లో ఉన్న ఒరిజనల్ రికార్డులను ఆయా జిల్లాల్లోనే భద్రపరిచి, కొత్త జిల్లాలకు అవసరమైన రికార్డులను స్కానింగ్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో నూతన జిల్లాల ఏర్పాటుపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన రోజు నుంచే ప్రతి శాఖ తమ కార్యాలయాలు ప్రారంభించి, కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లలో నూతన పోస్టుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. -
‘కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయాల్లేవు’
నల్లగొండ: ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కోసం ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభించిందని రాజీవ్ శర్మ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి వస్తున్న సూచనలు, సలహాలు, అభ్యంతరాలను బట్టి ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందన్నారు. నిర్ణీత సమయంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. కార్యాలయాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. శాఖల అవసరాలను అనుగుణంగా ఉద్యోగుల విభజన చేస్తునట్లు ఆయన తెలిపారు. శాశ్వత కలెక్టరేట్ ఇతర భవనాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించామని రాజీవ్ శర్మ చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. -
ఎంపీడీవోలకు బదులు ఓఎస్డీలు
• కొత్త మండలాల్లో నియమించనున్న సర్కారు • జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడే మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)కు బదులుగా.. ప్రత్యేక అభివృద్ధి అధికారుల (ఓఎస్డీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లో ప్రస్తుతం మండల పరిషత్‌లు లేనందున వారిని ఓఎస్డీ (డెవలప్మెంట్)లుగా నియమించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. ఇందుకు అవసరమైన అధికారులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిం చాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. ఇక కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను అన్ని శాఖల అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్నద్ధంగా ఉండండి కొత్తగా ఏర్పడే మండలాలు, డివిజన్లన్నింటిలో అక్టోబర్ 11న దసరా నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను రాజీవ్‌శర్మ ఆదేశించారు. ముఖ్యం గా తొలి రోజున అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కొలువు దీరుతాయి. దీంతో ఈ ఐదు శాఖలు వెంటనే తమ సిబ్బంది ప్రతిపాదనలు రూపొందించాలని, ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాధాన్యతలకునుగుణంగా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించే ఏ ర్పాట్లు చేయాల స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి ఆయా శాఖలకు సరిపడే సిబ్బంది నియామకం జరగాలన్నారు. అన్ని వివరాలతో.. ప్రతి శాఖ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది వివరాలు, సిబ్బంది నమూనా, కార్యాలయాల గుర్తింపు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సర్దుబాటు తదితర వివరాలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా అవసరమయ్యే పోస్టుల వివరాలను పంపడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను స్పష్టంగా అప్లోడ్ చేయాలని.. ఉద్యోగుల ఆధార్ నంబర్లను సైతం అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని ఉద్యోగులు కొత్తగా కార్డు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శులు బి.పి.ఆచార్య, రామకృష్ణారావు, సోమేష్‌కుమార్, అదర్ సిన్హా, సునీల్‌శర్మ, రాజీవ్ త్రివేదీ, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల ఎస్పీ కార్యాలయాలు సిద్ధం చేయండి
హోం శాఖకు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహక చర్యలను సత్వరం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు, ఫర్నిచర్, వాహనాల సర్దుబాటు తదితర పనులు పూర్తి చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించడానికి ముసాయిదా సిద్ధం చేయాల న్నారు. జిల్లాల్లో సిబ్బందిని సర్దుబాటు చేయాలన్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన పోలీసు సిబ్బంది నియామకాల కోసం ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి అనుమతిస్తామని హోం శాఖ అధికారులకు సూచించారు. కొత్త జిల్లాల్లో సిబ్బంది సర్దుబాట్లపై శనివారం సచివాలయంలో హోం, కార్మికశాఖ అధికారులతో ఆయన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ శర్మ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలని కోరారు. కొత్త జిల్లాలకు ప్రస్తుత సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు శాఖ ఫైల్స్, రికార్డులను ఫొటోకాపీలు చేయడంతో పాటు అనుసూచికలు రూపొందించాలన్నారు. పోలీసు శాఖ ఆర్గానోగ్రామ్ రూపొందించాలన్నారు. పోలీసు శాఖ కార్యాలయాల ఏర్పాటుకు తక్షణ, దీర్ఘకాల చర్యలు రూపొందించాలన్నారు. సాధారణ పరిపాలన శాఖ, సీజీజీలతో సమన్వయం కోసం పోలీసు శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించాల న్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. జిల్లాల్లో అవసరమైన సిబ్బంది నియామకం గురించి వివరించారు. పోలీసు శాఖలో నూతన నియామకాలకు అనుమతివ్వాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్యకార్యదర్శులు బీపీ ఆచార్య, అధర్ సిన్హా, శాంతికుమారి, రామకృష్ణారావు, రాజీవ్ త్రివేది పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ
హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీయ్యింది. కొత్తజిల్లాల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, వస్తు సామాగ్రి, వాహనాల విభజన చర్యలపై సీఎస్ ఈ సమావేశంలో సమీక్షించారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజీవ్ శర్మ సూచించారు. -
త్వరగా పరిష్కరించండి
- ‘ఉద్యోగుల పంపిణీ’పై హైకోర్టును కోరాలని ఏపీ, తెలంగాణ నిర్ణయం - కమలనాథన్ కమిటీ భేటీలో ఇరు రాష్ట్రాలు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ కేసులు.. ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలంటూ ఉమ్మడి హైకోర్టును అభ్యర్థించాలని తెలంగాణ, ఏపీ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీలు)కు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు లేఖలు రాయనున్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కమలనాథన్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో పాటు రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్ల తాత్కాలిక పంపిణీపై గతంలో ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. అయితే స్టే సంగతి తెలియని కమలనాథన్ కమిటీ.. రెండు రాష్ట్రాలకు డిప్యూటీ కలెక్టర్లను తాత్కాలికంగా పంపిణీ చేసింది. పంపిణీ తర్వాత స్టే సంగతి తెలియడంతో.. నోటిఫై చేయకుండా నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీకి స్టే అడ్డంకిగా ఉన్నందున.. త్వరగా కేసును పరిష్కరించాలని ఇరు రాష్ట్రాలు ఏజీల ద్వారా ఉమ్మడి హైకోర్టుకు విజ్ఞప్తి చేయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీల తుది పంపిణీపై స్టేను కూడా త్వ రగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఆ లోగా అభ్యంతరాలు లేని డీఎస్పీలను రిలీవ్ చేసేందుకు ఆస్కారం ఉం టుందేమో న్యాయ పరిశీలన చేయాలని ఇరు రాష్ట్రాల ఏజీలకు సీఎస్‌లు సూచించారు. ఇప్పటికే ఏపీలో తెలంగాణకు చెందిన 41 మంది ఎస్వోలుండటంతో.. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన వారిని చేర్చుకోవడానికి ఏపీలో పోస్టులు లేవు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను త్వరగా పరిష్కరించి తుది కేటాయింపులు పూర్తి చేయాలని కోరుతూ కేంద్రానికి ఫైలు పంపించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా కమలనాథన్ కమిటీ గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. -
పచ్చదనమే నా లక్ష్యం: సీఎం
* తెలంగాణను భూతలస్వర్గం చేద్దాం * అందుకు ఏ చర్యకైనా వెనుకాడను * హరితహారంపై సమీక్షలో సీఎం * నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘‘పచ్చదనానికి నేను గాఢమైన ప్రేమికుడిని. రేపు మనం లేకపోయినా భావితరం ఉంటుంది. వారి కోసం మనం నాటే మొక్కలుంటాయి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఏ చర్యలకైనా వెనుకాడబోను. అంతిమంగా తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడమే నా లక్ష్యం’’ అని పునరుద్ధాటించారు. ‘‘తెలంగాణ ఒకప్పుడు అడవులు, పచ్చదనం, వనసంపదతో తులతూగేది. పర్యావరణ సమతుల్యతతో భూతల స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గాన్ని మళ్లీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాలు, పట్టణాల్లో వాతావరణాన్ని చల్లబరి చేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేం దుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలి. జనావాసాల్లో మొక్కల పెంపకంతో సామాజిక అడవులను అభివృద్ధి చేయాలి. అటవీ ప్రాంతంలో మళ్లీ దట్టమైన చెట్లు పెరిగేలా చూడాలి. వనసంపదను రక్షించడంతో పాటు కనుమరుగైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలి’’ అని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వానాకాలంలోనే కాకుండా ఏడాదిలో పది నెలలూ మొక్కలు నాటవచ్చన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగాల న్నారు. పట్టణ ప్రాంత ఫారెస్టు బ్లాకులు, ఖాళీ జాగాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ‘‘రాష్ట్రంలో 45 శాతం ప్రజలు నగరాలు, పట్టణాల్లో నివసిస్తుండటంతో జనసాంద్రత పెరిగిపోతోంది. సరిపడా పచ్చదనం లేకుంటే విపరిణామాలు తప్పవు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. దాని అమలుకు గ్రీన్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెల్‌కు కార్పొరేషన్లలో ఐఎఫ్ఎస్లను, మున్సిపాలిటీల్లో అటవీ శాఖ అధికారులను ఇన్చార్జిలుగా నియమించండి. మొక్కలు నాటడం, రక్షించడం, వచ్చే ఏడాదికి మొక్కల కోసం నర్సరీలు సిద్ధం చేయడం గ్రీన్ సెల్ ఆధ్వర్యంలో జరగాలి. మొక్కలు నాటిన వారికే ఇళ్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేసే విధానం తేవాలి’’ అని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఇలా... హైదరాబాద్ శివార్లలో హరిణ వనస్థలి, నారపల్లి, గుర్రంగూడ, బొంగులూరు, మంగల్‌పల్లి, తుర్కయాంజాల్, రావిర్యాల, మాదన్నగూడ, నాగారం, మైసారం, నందుపల్లి, మజీ ద్గడ్డ, పల్లెగడ్డ, సిరిగార్పూర్, తిమ్మలూరు, శ్రీనగర్ తదితర అటవీ బ్లాక్‌లను దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచిం చా రు. ఔటర్ రింగ్‌రోడ్డు వెంట అందమైన పూల మొక్కలు నాటాలి. ఇందుకు నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయాలి’’ అని సీఎం అన్నారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు ‘అడవులను నరికేవారిపై, కలప స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించండని సీఎం అన్నారు. కలప స్మగ్లింగ్‌కు ఆస్కారమున్న చోట్ల నిఘా పెట్టాలని, అవసరమైన సిబ్బంది నిస్తామన్నా రు. ఐఎఫ్ఎస్ అధికారులు, అటవీ సబ్బందిని అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలన్నారు. ఈ విషయంలో రాజకీయ జోక్యముండదని, రిటైర్డ్ అటవీ సిబ్బంది సేవలనూ వినియోగించుకోండని సీఎం అన్నారు. నివేదిక సమర్పించండి పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, వర్సిటీలు తదితర చోట్ల ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బతికాయి, చెట్ల పెంపకానికి ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారు వంటి వివరాలతో నివేదిక సమర్పించాలని సీఎస్ రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు, అటవీ మంత్రి జోగు రామన్న, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, పీసీసీఎఫ్ పీకే ఝా, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.680 కోట్లతో పుష్కరాల పనులు
నెలాఖరు కల్లా పూర్తికావాలి: సీఎస్ రాజీవ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల్లో సౌకర్యాల కల్పనకు రూ.680 కోట్లతో 668 పనులు మంజూరు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. మంజూరైన పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేయాలని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన ఇతర ఉన్నతాధికారులతో కలిసి పుష్కర పనులపై రెండు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారులు, భవనాల శాఖకు సంబంధించి రూ. 366 కోట్లతో 63 పనులు చేపట్టగా వాటిలో 37, పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి రూ.134 కోట్లతో చేపట్టిన 131లో 42 పనులు పూర్తయినట్లు సీఎస్ చెప్పారు. రూ.137 కోట్లతో 81 పుష్కర ఘాట్లలో చేపట్టిన పనుల్లో 63 శాతం పూర్తయ్యాయన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా భక్తులకు అన్నదానం జరిగేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సూచించారు. సమాచార శాఖ క మిషనర్ నవీన్ మిట్టల్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సునీల్‌శర్మ, కార్యదర్శులు బి.వెంకటేశం, శివశంకర్, వికాస్‌రాజ్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్‌తో కలెక్టర్ల భేటీ
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ భేటీయ్యారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కలెక్టర్లతో ఆయన చర్చ జరపనున్నారు. ప్రస్తుతమున్న జిల్లాలన్నీ రెండు లేదా మూడు జిల్లాలుగా పునర్విభజించే ఆలోచనలో ప్రభుత్వముంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలు, డివిజన్లు, కొత్త మండలాలపై నివేదికలు, వాటి భౌగోళిక స్వరూపం, నమూనా మ్యాపులను కలెక్టర్లు రూపొందించారు. ఈ ప్రక్రియకు నిర్దేశించిన రోడ్ మ్యాప్‌పై జిల్లా కలెక్టర్లతో రాజీవ్ శర్మ ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై కలెక్టర్లకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. -
20న కొత్త జిల్లాలపై కలెక్టర్ల సదస్సు
- సీఎస్ ఆధ్వర్యంలో భేటీ.. ప్రతిపాదనల స్వీకరణ - ఉద్యోగుల ప్రణాళిక తయారీకి సీసీఎల్ఏ ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనుంది. సీఎస్ రాజీవ్‌శర్మ, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా ఆధ్వర్యంలో సచివాలయంలోని సీ బ్లాక్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన రెండు రోజుల కలెక్టర్ల వర్క్‌షాపులో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూలులో భాగంగా జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో కొత్త జిల్లాలు, మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలను 20లోగా సీసీఎల్ఏకు సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే సీఎస్ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలు, మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలు, నమూనాలు, జనాభా, విస్తీర్ణం, మ్యాప్‌లను తీసుకొని ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని జిల్లా కలెక్టర్లకు శుక్రవారం సమాచారం అందించారు. మరోవైపు కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పంపించాలని రేమండ్ పీటర్ అన్ని జిల్లా కలెక్టర్లను కోరారు. టెంటటీవ్ డిస్ట్రిక్స్ అలకేటివ్ ప్లాన్(కొత్త జిల్లాలకు ఉద్యోగుల ప్రణాళిక)ను తయారు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ప్రతి విభాగం పరిధిలో ఉద్యోగుల(స్టాఫ్ పాటర్న్)ను పంపించాలని కోరారు. జిల్లా స్థాయి ఉద్యోగులు ఎందరు అవసరం.. డివిజన్ స్థాయి అవసరమెంత.. మండల స్థాయి సిబ్బంది ఎంతమంది కావాలి..? అనే వివరాలన్నీ నిర్దేశించిన నమూనాలో పంపించాలని సూచించారు. ఒక్కో విభాగం వారీగా కేడర్‌ను బట్టి ఆ జిల్లాలకు మంజూరీ చేసిన ఉద్యోగుల సంఖ్య ఎంత..? ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులెందరు..? కొత్తగా ఏర్పడే జిల్లాలో ప్రతిపాదించే ఉద్యోగుల సంఖ్య ఎంత..? అదనంగా మొత్తం ఎంత మంది అవసరం..? ఈ వివరాలను పొందుపరిచేలా పట్టికను సీసీఎల్ఏ నమూనాగా అన్ని జిల్లాలకు పంపించింది. ఈ వివరాలన్నింటినీ, సంబంధిత రిమార్కులతో 18వ తేదీలోగా పంపించాలని ఆదేశించింది. -
'వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ'
హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్ రాజీవ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా రెగ్యులరైజ్ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇంతవరకు ఉద్యోగుల వివరాలు తేల్చని డిపార్ట్మెంట్లు వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మరోసారి సమావేశం కానున్నారు. -
ఆంధ్రాలో ఉన్న ఉద్యోగులను రప్పించండి
* సీఎస్ రాజీవ్‌శర్మకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి వచ్చే విధంగా చూడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎస్ రాజీవ్‌శర్మకు గురువారం వినతిపత్రం సమర్పిం చారు. అలాగే తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను వెంటనే వారి రాష్ట్రానికే పంపించాలని, స్టేట్ కేడర్‌లోని పోలీసు అధికారులలో తెలంగాణ వారిని ఇక్కడే ఉంచి, ఆంధ్రా వారిని అక్కడికే పంపాలని కోరారు. సీఎస్‌ను కలిసిన వారిలో ఆ సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, సంఘం నేతలు సత్యనారాయణ, మధుసూదన్‌గౌడ్, కృష్ణ యాదవ్, జి.వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్ ఉన్నారు. -
ఆ రెండూ అటే..
జిల్లా విభజనలో కొంత స్పష్టత 60 కిలోమీటర్ల నిబంధనతో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు ఔట్ యాదాద్రి జిల్లా కూడా ఖాయమైనట్టే... ఆలేరు-జనగాంకు మధ్యలో జిల్లా కేంద్రం! సూర్యాపేట కలెక్టరేట్ ఎక్కడన్న దానిపై వివరాలు గోప్యం జిల్లా విభజన బాధ్యతలు జగదీశ్‌రెడ్డి, కిశోర్లపైనే.. ఐఏఎస్‌ల కేటాయింపు, పునర్విభజన కమిటీలతో ప్రక్రియ మరింత వేగిరం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తాజా పరిణామాలతో జిల్లా విభజనలో కొంత స్పష్టత వచ్చింది. జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మూడు అంశాలను పరిశీలించింది. అందులో ఒకటి జిల్లా కేంద్రానికి, ఇతర నియోజకవర్గ కేంద్రాలకు ఉన్న దూరాన్ని బట్టి జిల్లాలు విభజించాలి. రెండోది పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలి. మూడోది జనాభా ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటు చేయాలి. అయితే, ఈ మూడింటిలో మొదటి ప్రతిపాదనే ఓకే అయిందని, అందులో కూడా జిల్లా కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రాలకు 50 నుంచి 60 కిలో మీటర్లు ఉండేలా విభజన జరగాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా సమాచారం అడిగారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే భువనగిరి నుంచి నల్లగొండకు 70 కిలోమీటర్ల దూరం కాగా, ఆలేరుకు 92 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ పరిస్థితుల్లో దూరం ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తే ఆ రెండు నియోజకవర్గాలు వెళ్లిపోయినట్టే. అయితే, వరంగల్ జిల్లా జనగాం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న జిల్లాలో స్వల్ప మార్పులు చేసి యాదాద్రి పేరిట ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఆలేరు - జనగాం మధ్యలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ‘పేట’ పరిస్థితి ఏంటి? ఇక, తొలిదశలోనే కొత్త జిల్లాగా ఏర్పాటవుతుందని భావిస్తున్న సూర్యాపేటలో పరిపాలన భవనాలను ఎక్కడ నిర్మించాలన్న దానిపై అటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇటు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సూర్యాపేటలో గతంలో ఓ స్థలాన్ని అనుకున్నా... దానిని సీఎం కేసీఆరే స్వయంగా తిరస్కరించారని, అన్ని భవనాలు ఒకే చోట ఉండేలా వీలైనంత ఎక్కువ స్థలం చూడాలని అధికారులను ఆదేశించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ కోసం స్థలం ఎక్కడ చూడాలన్న దానిపై రెండు, మూడు ప్రతిపాదనలున్నా ఎక్కడ చూస్తున్నారనే దానిపై అటు అధికారులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ నోరు మెదపడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకునే వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జిల్లాల పునర్విభజన కమిటీల ఏర్పాటులో భాగంగా నల్లగొండ జిల్లా విభజన బాధ్యతలు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు అప్పగించడం గమనార్హం. జిల్లా విభజన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వీరి బాధ్యతగా తెలుస్తోంది. పెరగనున్న రాజకీయ పదవులు జిల్లా విభజన జరిగితే ఔత్సాహిక రాజకీయ నేతలకు మంచి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా జడ్పీచైర్మన్తో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు, వాటి పాలకవర్గాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి లాంటి నామినేటెడ్ పోస్టులు అదనంగా రానున్నాయి. వీటికితోడు మండలాలు పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎంపీపీలు, జడ్పీటీసీల పదవులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. దీంతో రాజకీయ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న రాజకీయ నాయకులకు జిల్లాల పునర్విభజన మేలు చేకూర్చనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర నిధులు, పాలనా వికేంద్రీకరణ కోసమే.. ‘జిల్లాల పునర్విభజన అంశం తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయి. జిల్లాల ప్రాతిపదికగా కేంద్రం నిధులిస్తుంది కనుక మన రాష్ట్రంలో జిల్లాలు పెరిగితే ఆ మేరకు నిధులు కూడా పెరుగుతాయి. అదే విధంగా జిల్లాల విభజన వల్ల పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. అంటే ప్రజలకు పాలన దగ్గరవుతుంది. తెలంగాణ రాష్ట్రం కోరింది కూడా అదే నినాదంతో. ప్రాంతాలు విడిపోతాయి... కానీ ప్రజలు విడిపోరు అనే తెలంగాణ ఉద్యమ నినాదమే జిల్లాల పునర్విభజనకు స్ఫూర్తి. నల్లగొండ జిల్లా విభజనపై కసరత్తు జరుగుతుంది కానీ, మరి కొన్ని సమావేశాలు, చర్చలు జరిగితే కానీ పూర్తిస్థాయిలో స్పష్టత రాదు. -గాదరి కిశోర్, జిల్లా పునర్విభజన కమిటీ సభ్యుడు నల్లగొండ జిల్లా కేంద్రానికి, వివిధ నియోజకవర్గాలకు దూరం నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాకు, నల్లగొండకు దూరం: 33 కిలోమీటర్లు దేవరకొండ - నల్లగొండ మధ్య దూరం: 60 కిలోమీటర్లు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చండూరుకు, నల్లగొండకు దూరం: 33 కిలోమీటర్లు నకిరేకల్ నుంచి నల్లగొండకు దూరం: 27 కిలోమీటర్లు (వయా కట్టంగూరు), 22 కిలోమీటర్లు (వయా తాటికల్) సూర్యాపేట జిల్లా కేంద్రానికి, వివిధ నియోజకవర్గాలకు దూరం కోదాడకు సూర్యాపేటకు దూరం: 40 కిలోమీటర్లు హుజూర్నగర్ నుంచి సూర్యాపేటకు: 56 కిలోమీటర్లు తుంగతుర్తి - సూర్యాపేట మధ్య దూరం: 36 కిలోమీటర్లు మిర్యాలగూడ - సూర్యాపేట మధ్య దూరం: 45 కిలోమీటర్లు (వయా భీమారం), 55 కిలోమీటర్లు (వయా నేరేడుచర్ల). ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి జనగాంకు దూరం: 16 కిలోమీటర్లు... జిల్లా కేంద్రాన్ని ఆలేరు-జనగాం మధ్యలో ఏర్పాటు చేస్తే ఈ దూరం మరింత తగ్గనుంది. ఆలేరు నుంచి సిద్దిపేట 65 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో చేర్చే అవకాశం లేదు. భువనగిరిని హైదరాబాద్ ఈస్ట్ జిల్లాలో చేర్చి జిల్లా కేంద్రం చేయని పక్షంలో ఉప్పల్ లేదా ఎల్బీనగర్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి ఉప్పల్‌కు 40 కిలోమీటర్లు, ఎల్బీనగర్కు 54 కిలోమీటర్ల దూరం ఉంటుంది. -
నాబార్డు ‘సూక్ష్మ’ రుణం రూ.వెయ్యి కోట్లు
ఉద్యానశాఖపై సీఎస్ రాజీవ్‌శర్మ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉద్యానశాఖ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా ఇప్పటికే పాలీహౌస్, సూక్ష్మసేద్యం అమలు చేస్తోంది. త్వరలో ఉద్యాన కార్పొరేషన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కీలకమైన బిందుసేద్యానికి నాబార్డు నుంచి రూ.1,000 కోట్లు రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యానశాఖపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్‌శర్మ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూక్ష్మ, బిందు సేద్యం పరికరాల కోసం రైతులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని, నిర్దేశించిన కోటాకు మించి దరఖాస్తులు రావడంతో అవి వేలసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. డిమాండ్‌కు తగినవిధంగా స్పందించేందుకుగాను నాబార్డు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు వ్యవసాయశాఖకు ఉన్నట్లుగానే ప్రతి మండలానికి ఒక ఉద్యాన విస్తరణాధికారి(హెచ్‌ఈవో)ని నియమించాలని సీఎస్ ఆదేశించారు. అయితే ఎన్ని మండలాల్లో విస్తరణాధికారుల అవసరం ఏ మేరకు ఉందో చర్చించి నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించినట్లు తెలిసింది. పైస్థాయి కేడర్ పోస్టుల సంఖ్యపైనా కసరత్తు చేస్తున్నారు. గతంలో వెయ్యి ఉద్యాన పోస్టులకు ప్రతిపాదనలు పంపిన ఉద్యానశాఖ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా 500 పోస్టులకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని పోస్టులను కూడా రెండు దశలుగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. -
సాగుకు పూర్వ వైభవం తేవాలి
* బడ్జెట్లో ఈ రంగానికి సరిపోయేలా నిధులు: సీఎం కేసీఆర్ * డిమాండ్‌కు తగ్గ పంటలు వేసేలా చూడండి * 46 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలి * సాగుపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి సూచన సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది రైతులు ఆధారపడి బతికే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. రైతులకు మేలు చేసే విధానాలు అనుసరించాలన్నారు. వ్యవసాయ శాఖకు చాలినన్ని నిధులివ్వాలని స్పష్టంచేశారు. బడ్జెట్‌పై చేస్తున్న శాఖల వారీ సమీక్షలో భాగంగా గురువారం సీఎం వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శాస్త్రీయ పద్ధతిలో రైతులకు మేలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అధిక వర్షాలున్నప్పుడు ఒక రకంగా వర్షాలు లేనప్పుడు మరో రకంగా వ్యూహం ఉండాలని వివరించారు. పత్తి వద్దు.. మక్క, సోయాబీన్ మేలు డిమాండ్‌కు తగినట్లు పంటలను సాగు చేసేలా రైతులను సన్నద్ధపరచాలని అధికారులకు సీఎం సూచించారు. ‘‘పత్తి ఎగుమతులపై విధించే సుంకం కారణంగా భవిష్యత్‌లో ఆ పంటకు మంచి ధర రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించాలి. తక్కువ పెట్టుబడి, గ్యారంటీ మార్కెట్ ఉన్న మొక్కజొన్నను ప్రోత్సహించాలి. డిమాండ్ ఉన్న సోయాబీన్ పంట సాగు దిశగా చైతన్యపరచాలి. సోయాబీన్ రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉంచాలి’’ అని చెప్పారు. మిర్చి, పసుపు, అల్లం వంటివి పండించడానికి అనువైన భూములను గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు. యార్డుల్లో సరుకు తడవకుండా మార్కెటింగ్ శాఖతో కలసి పనిచేయాలన్నారు. కేంద్ర నిధులు వచ్చేలా ప్రణాళికలు కేంద్ర నిధులు అధిక మొత్తంలో పొందేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రానికి అవసరమయ్యే కూరగాయలన్నీ ఇక్కడే పండించాలని, ఎన్ని విత్తనాలు కావాలో అన్నీ ఇక్కడే ఉత్పత్తి చేయాలన్నారు. ఇందుకు తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో సమన్వయం కుదుర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటికీ పాలు ఇక్కడే ఉత్పత్తి కావాలని చెప్పారు. మాంసం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా గొర్రెలు, మేకల పెంపకం పెరగాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించే 46 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలని అన్నారు. యూనివర్సిటీతో అనుసంధానం వ్యవసాయ వర్సిటీని బలోపేతం చేయాలని, విత్తనాలు ఉత్పత్తి చేయాలని, కొత్త వంగడాలు సృష్టించాలని, పరిశోధనలు విసృ్తతంగా జరగాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఐప్యాడ్లు కొనివ్వాలని ఆదేశించారు. పంటలకు వచ్చే చీడ పీడలను గుర్తించి, ఫొటోలు తీసి ఫోన్లు, ఐప్యాడ్ల ద్వారా పంపాలని, ఆగ్రానమిస్ట్లు విరుగుడు చర్యలు సూచించాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి దిక్సూచిలా ఉండాలి
♦ బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం ♦ అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు జరగాలి ♦ నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం వద్దు సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర వనరులకు అనుగుణంగా బడ్జెట్లో శాఖలకు నిధుల కేటాయింపు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. బడ్జెట్ అంటే కేవలం జమా పద్దులా కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిక్సూచిగా ఉండాలని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి బుధవారం శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించారు. న్యాక్‌లో జరిగిన మొదటి రోజు సమీక్షలో ఆర్అండ్బీ, రవాణా, ఆర్టీసీ, పోలీస్, జైళ్ల శాఖలపై సమీక్ష జరిపారు. అధికార ప్రక్రియలో, నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం తొలగిపోవాలని, సరళీకృత పద్ధతులు కావాలని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కూడా మారాలని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ తనకున్న ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మంచి విధానం ఉన్నా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కేటాయించిన నిధులెన్ని.. ఖర్చయినవి ఎన్ని? గత బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులెన్ని..? అందులో ఖర్చయినవి ఎన్ని..? నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు కాకపోవడానికి కారణాలేంటీ..? ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి? తదితర అంశాలపై సీఎం ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. రాష్ట్రం యూనిట్‌గా కాకుండా జిల్లా యూనిట్‌గా అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా ప్రజల అవసరాలేంటీ? శాఖలవారీగా ఎన్ని నిధులు అవసరం? గత బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు? తదితర అంశాలతో జిల్లా అభివృద్ధి కార్డులు తయారు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీస్ శాఖలకు అవసరమైన మేర నిధులు కేటాయించేందుకు, భవనాలు కట్టేందుకు, వాహనాలు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయ భవనాలు నిర్మించాలని, అందుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. కొత్త రహదారులు ఎక్కడ కావాలి.. వంతెనలు ఎన్ని కావాలి.. మరమ్మతులు చేయాలంటే ఎంత కావాలో అంచనా వేసి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలను తయారు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అవసరమైన వ్యూహం అనుసరించాలని కేసీఆర్ రవాణా, ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా రూట్లను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీస్ శాఖ సమన్వయంతో రద్దీ తగ్గించడానికి, ప్రమాదాలు నివారించడానికి, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. అదనపు పోలీస్ స్టేషన్ల ఏర్పాటు పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు. పోలీస్ శాఖలోని వివిధ అధికారుల సర్వీసు అంశాల్లో వివాదాలున్నాయని, వాటిని తొలగించాలని సూచించారు. అదనపు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. -
గ్రేటర్‌కు రూ.52 వేల కోట్లు
బ్రిక్స్ బ్యాంక్‌కు రుణ ప్రతిపాదనలు ♦ కౌంటర్ మాగ్నెట్ సిటీలుగా 11 పట్టణాలు ♦ మూసీపై 42 కి.మీ. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ ♦ ప్రతిపాదనలు సిద్ధం చేయండి: సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ నదిపై ఈస్ట్ టు వెస్ట్ కారిడార్, నగరం చుట్టూరా ఉన్న 11 పట్టణాలను కౌంటర్ మాగ్నెట్ సిటీలుగా అభివృద్ధి చేసే వినూత్న ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటితోపాటు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, 40 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాగునీటి జలాశయాలకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. బహుళ ప్రయోజనకరంగా ఉండే ఈ ప్రాజెక్టులకు బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ. 52 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రుణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. వరల్డ్ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కొత్తగా నెలకొల్పిన న్యూ డెవలప్మెంట్ బ్రిక్స్ బ్యాంక్ ఏప్రిల్ నుంచి రుణ పంపిణీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ముందుగా అందిన ప్రతిపాదనలకు రుణాల్లో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. అందుకే ప్రభుత్వం ముందు వరుసలో ఉండేందుకు సన్నద్ధమైంది. నెల రోజుల్లో ప్రతిపాదలను బ్యాంక్‌కు పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బ్రిక్స్ రుణం మొత్తం సిటీకే.. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ.25 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం తొలుత అంచనాలు వేసింది. కానీ నగర పరిధిలో ప్రతిపాదనలో ఉన్న కొత్త ప్రాజెక్టులు, వాటికయ్యే అంచనా వ్యయాలను పరిశీలించి రూ.52 వేల కోట్ల సాయం కోరాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని రహదారులు, ఫ్లైఓ వర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు, మూసీ నదీ సుందరీకరణ కు రూ.10 వేల కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు, తాగునీటి సమస్యకు పరిష్కారంగా శివార్లలో 40 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన రిజర్వాయర్లు, పైపులైన్లకు రూ.10 వేల కోట్లు కావాలని అధికారులు నివేదికలు సమర్పించారు. వీటిపై 3 వారాల్లో నివేదికలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. బ్రిక్స్ నుంచి ఆశిస్తు న్న రుణాన్ని మొత్తం గ్రేటర్ ప్రాజెక్టులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రం లోని మిగతా కార్పొరేషన్లకు రూ.8 వేల కోట్లు రుణం కోరాలనే ప్రతిపాదనను విరమించుకుంది. అధునాతనంగా ప్రాజెక్టులు హైదరాబాద్‌ను విశ్వనగరాలకు పోటీగా నిలబెట్టేందుకు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగర పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, నగరం చుట్టూ ఉన్న 11 పట్టణాలను ‘కౌంటర్ మాగ్నెట్ సిటీ డెవలప్మెంట్’ కిందకు తెచ్చే ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నగరం చుట్టూ ఉన్న సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, నాచారం, శంకర్పల్లి, మహేశ్వరం, షాద్‌నగర్, వికారాబాద్ పట్టణాలను ఇందులో చేర్చారు. ఈ పట్టణాలకు హైదరాబాద్‌కు మధ్య రాకపోకల సమయాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తే, సిటీలో పనిచేస్తున్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు ఈ పట్టణాల్లోనూ నివాసమేర్పరుచుకునే అవకాశాలు మెరుగుపడుతాయి. దీంతో గ్రేటర్ చుట్టూరా ఉన్న పట్టణాలు సైతం సిటీని తలదన్నేలా వృద్ధి చెందుతాయనేది ప్రభుత్వ వ్యూహం. అందుకే అధునాతన రహదారులు నిర్మిస్తారు. మరోవైపు మూసీ నదికి ఇరువైపులా ఆరు లేన్ల రహదారి నిర్మించాలని, మూసీ ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ పేరుతో కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. నార్సింగి నుంచి ఉప్పల్ వరకు దాదాపు 42 కి.మీ. రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోంది. -
పన్నుల శాఖలో పదోన్నతుల వివాదం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. 1990 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. నిబంధనలను గాలికొదిలేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(ఏసీటీవో) నుంచి డిప్యూటీ సీటీవోగా పదోన్నతి కల్పించే విషయంలో సర్వీస్‌రూల్స్ అమలు చేయడంలేదని మండిపడుతున్నారు. ఈ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి పదోన్నతులతో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగాలు నిర్వహిస్తున్నవారు గత మూడు దశాబ్దాలుగా ఏసీటీవోలుగానే పదవీ విరమణ చేసే పరిస్థితి నెలకొంది. ప్రమోటీ ఏసీటీవోలను విస్మరించి డెరైక్ట్ రిక్రూట్ ఏసీటీవోలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోటీ ఏసీటీవోలు సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పది డీసీటీవో ఖాళీలను భర్తీ చేయాల్సి వస్తే వరుసక్రమంలో 1 నుంచి 10 మందిలో నలుగురు డెరైక్టు రిక్రూటీలకు, ఆరుగురు ప్రమోటీలకు పదోన్నతి కల్పిం చాలి. కానీ ఇదేం అమలుకావడంలేదని కొందరు ఉద్యోగులు 2009-10 ప్రమోషన్లపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో 2011 జూన్ 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది 30:70 నిష్పత్తిలో పదిమంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలంటే అందులో నలుగురు డెరైక్టు రిక్రూటీలు, మిగతావారు ప్రమోటీలుగా ఏయే సంఖ్యలో ఉండాలో పేర్కొంది. ఈ మేరకు గత జూన్ 29న వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కమిషనర్ అనిల్‌కుమార్ అభ్యం తరం వ్యక్తం చేస్తూ మెమోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఆగస్టు 7న ఉత్తర్వును విత్‌డ్రా చేసుకుంది. దీంతో పదోన్నతుల రగడ మళ్లీ మొదటికొచ్చింది. -
కొత్త జిల్లాలపై కమిటీ
♦ సీఎస్ రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ఐదుగురితో ఏర్పాటు ♦ రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపైనా పరిశీలన ♦ జూన్ 2 నాటికి ప్రక్రియ పూర్తికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణపై కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ సారథ్యంలో రెవెన్యూ, మున్సిపల్-పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. భూపరిపాలనా విభాగం ముఖ్య కమిషనర్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, ప్రణాళిక శాఖ, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పర్యావరణ అటవీశాఖ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పునర్వ్యవస్థీకరణ చేపడతామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్2 వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పెరగనున్న డివిజన్లు, మండలాలు ప్రస్తుతం రాష్ట్రంలోని పదిజిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 464 మండలాలు ఉన్నాయి. దేశంలో సగటున 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. రాష్ట్రంలో 35 లక్షల జనాభాకో జిల్లా ఉంది. దీంతో ఇప్పుడున్న జిల్లాల సంఖ్యను రెండింతలకు పైగా పెంచే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య కూడా పెరగనుంది. జనాభాతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు ఆ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండాలి. రవాణా సదుపాయాలతో పాటు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు మౌలిక వసతులున్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు. నేతలకు గుబులు.. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ రాజకీయంగా తమ భవితవ్యానికి ఇబ్బంది కలిగించే ప్రమాదముందని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పునర్వ్యవస్థీకరణతో ఇప్పుడున్న పార్లమెంటు నియోజకవర్గాలు కుదుపులకు గురవడం ఖాయం. కొన్ని సెగ్మెంట్లు రెండు, మూడు జిల్లాలకు విస్తరించే పరిస్థితులున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం ఏదో ఒక జిల్లాలోనే ఉంచాలని భావిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కోణంలోనూ కమిటీ అధ్యయనం చేయనుంది. తెరపైకి కొత్త డిమాండ్లు కొత్తజిల్లాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జనగాం, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లను జిల్లాలుగా మార్చాలని పట్టుబడుతున్నారు. -
'ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా చూడండి'
హైదరాబాద్ : జిల్లాల్లో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఆదేశించారు. స్పీకర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో సీఎస్ సోమవారం భేటీ అయ్యారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తమకు ఫిర్యాదులు రావొద్దని వీరిద్దరూ సీఎస్‌కు సూచించారని సమాచారం. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనాల్సిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గొడవకు దిగారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే సమస్య ఉత్పన్నమైంది. ప్రధానంగా విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తమకు ఆహ్వానాలు ఉండడం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, భవిష్యత్తులో జిల్లాల్లో ఎలాంటి ప్రోటోకాల్ వివాదాలు జరగకుండా చూడాలని వీరు సూచించారని తెలిసింది. దీంతో పాటు సెప్టెంబరు రెండో వారంలో శాసన సభా సమావేశాలు జరగనున్నాయి. సభ్యులు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి తయారు చేయించాల్సిన ఈ జవాబులపైనా వీరి భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. అసెంబ్లీ సిబ్బందికి కంటి పరీక్షలు : అసెంబ్లీ సిబ్బందికి సోమవారం కంటి పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని క్యాంటీన్లో ఈ మేరకు ఉచిత పరీక్ష క్యాంప్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఎస్. మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు కూడా ఈ క్యాంప్‌లో కంటి పరీక్ష చేయించుకున్నారు. -
భూ సేకరణపై అధ్యయనం చేయండి
⇒ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశం ⇒ నిబంధనల సరళీకరణకు చర్యలు తీసుకోండి ⇒ చెరుకు సాగు విస్తీర్ణం పెంపుపై అధ్యయనం చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణలోని సమస్యలు అధ్యయనం చేసి, పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ, 18 అనుబంధ విభాగాలు, సంస్థల అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. భూ సేకరణలో జీవో 571 అడ్డుగా ఉందని అధికారులు తెలిపారు. నిబంధనల సరళీకరణకు చొరవ తీసుకోవాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మైనింగ్ శాఖ అధికారులకు సూచించారు. చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర అంశాలపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ విభజనపై!: రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజనలో ఏపీ తీరును ఎదుర్కోవాలని, జీడిమెట్లలోని సంస్థ ఆస్తులపై ఏపీ ప్రభుత్వం మడత పేచీపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆప్కో నుంచి చేనేత కార్మికులకు అందాల్సిన బకాయిలు, నూతన మైనింగ్ పాలసీకి తుది మెరుగులు, టీఎస్ఐపాస్, పారిశ్రామిక వాడల్లో సమస్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యద ర్శి అరవింద్‌కుమార్, ఉప కార్యదర్శి వి.సైదాతో పాటు రెవెన్యూ కార్యదర్శి మీనా, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మైనింగ్ డెరైక్టర్ మంగీరాం, ఎండీ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానికత ఆధారంగానే విభజన
ఉద్యోగుల పంపిణీలో మరో విధానం వద్దని కేంద్రానికి స్పష్టం చేశాం: సీఎస్ రాజీవ్ శర్మ సాక్షి, న్యూఢిల్లీ: స్థానికతను ఆధారంగా చేసుకునే ఉద్యోగుల విభజన జరగాలని కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు. దీనికి మరో పద్ధతేదీ పెట్టుకోవద్దని కోరామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ ఉద్యోగుల ఇరు ప్రభుత్వాల వైఖరులను తెలియచేశారు. అనంతరం రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడారు. 9వ షెడ్యూల్లోని ఉద్యోగుల విభజనతో పాటు ప్రత్యేకంగా విద్యుత్ ఉద్యోగుల అంశంపై చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేయాలి. వేరే పద్ధతి పెట్టుకోవద్దని చెప్పాం. ఇక విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు కూడా చేశాం. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోం..’’ అని వెల్లడించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ సూచించారని చెప్పారు. కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున కమిటీ ఏర్పాటు సహా మరే ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పామన్నారు. కాగా సమావేశంలో ఏపీ తరఫున ఏం చెప్పారనే దానిపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ప్రశ్నించగా...వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. -
నాసిరకం మందులపై సీరియస్
* విచారణకు ఆదేశించిన సీఎస్ రాజీవ్ శర్మ * త్వరలో టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీనియామకం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్న తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎంఎస్ఐడీసీ) అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ విచారణకు ఆదేశించారు. ఈ నెల 15న ‘నాసిరకం మందులకు రాజముద్ర’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎస్.. తక్షణమే మందుల కొనుగోలుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన మందులపై పరీక్షలు నిర్వహించారా..? లేదా..? నిర్వహిస్తే వాటి నివేదికలు కూడా సమర్పించాలని సూచించారు. కాగా, తమ బండారం బయటపడకుండా నివేదికలు తారుమారు చేసేందుకు టీఎస్ ఎంఎస్ఐడీసీ అనాలసిస్ విభాగంలోని కొందరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే ప్రస్తుతం టీఎస్ ఎంఎస్‌ఐడీసీకి ఎండీగా.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ బాధ్యతలు అదనంగా ఉండటంతో రోజువారీ పర్యవేక్షణ కొరవడుతోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో తక్షణమే పూర్తిస్థాయి ఎండీని నియమించాలని సర్కారు యోచిస్తోంది. యాంటీబయాటిక్స్‌లో వసూళ్ల పర్వం.. తెలంగాణలో యాంటీబయాటిక్స్ మందులు సరఫరా చేసే వారి నుంచి సంబంధిత విభాగాల అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. యాంటీబయాటిక్స్ సేకరణ (ప్రొక్యూర్మెంట్) చూసే ఓ ఫార్మసిస్ట్ 2 శాతం కమీషన్ ఇస్తేనే ఆర్డరు ఇస్తామని నిక్కచ్చిగా చెబుతున్నారు. అలాగే, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లుగా విధులు నిర్వహించాల్సిన కొందరు టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ఉన్నతాధికారుల అండతో సదరు ఫార్మసిస్టులు లాభసాటిగా ఉంటోందని టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. వీళ్లపై వైద్యవిధానపరిషత్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీనిపైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. -
ఇక పరుగులే..!
♦ ‘మెట్రో’కు తొలగిన వారసత్వ చిక్కులు ♦ బేగంపేట్‌లో లైన్ క్లియర్ ♦ అల్లావుద్దీన్, జబ్బార్ బిల్డింగ్‌ల కూల్చివేత ♦ ట్రాఫిక్ కష్టాలు తొలగించాలని సీఎస్ ఆదేశం బేగంపేట్ వైపు మెట్రో రైలు దూసుకుపోయేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక పనులు ఊపందుకోనున్నాయి. ప్రధాన రహదారిపై మెట్రో ప్రాజెక్టుకు అవరోధంగా మారిన వారసత్వ కట్టడాల చిక్కులు ఎట్టకేలకు తొలగిపోయాయి. పాత ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్, షాపర్స్టాప్ వద్ద మెట్రో పనులకు తాజాగా లైన్ క్లియరైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు భవంతుల కూల్చివేత కార్యక్రమాన్ని మంగళవారం జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ ప్రాంతాల్లోని అల్లాఉద్దీన్ బిల్డింగ్, జబ్బా ర్ బిల్డింగ్‌లను వారసత్వ కట్టడాలుగా పేర్కొంటూ గత 30 ఏళ్లుగా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో గతంలో రహదారి విస్తరణలో వీటిని తొలగించడం సాధ్యం కాలేదు. హైకోర్టు తాజా ఆదేశాలతో అల్లావుద్దీన్ భవనంలో 666 చదరపు అడుగులు, జబ్బార్ బిల్డింగ్‌లో 635 అడుగుల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పరిహారాన్ని అందజేసిన తర్వాతే భవనాలను కూల్చివేసినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రహదారిని మరో 40 అడుగుల మేర విస్తరించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆస్తుల సేకరణ వేగవంతం చేయడ ంతో సీఎస్ రాజీవ్ శర్మ జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించండి:సీఎస్ మెట్రో పనులు జరుగుతున్న ప్రధాన రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధాన మెట్రో కారిడార్లలో అధికారులు పర్యటించి ప్రజలకు పరిష్కారం చూపాలని సూచించారు. మంగళవారం మెట్రో పనులపై జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు. ఇటీవల పనులను వేగవంతం చేసేందుకు వీలుగా నగరంలో 22 ఆస్తులను తొలగించామని, మరో 204 ఆస్తులను సేకరించాల్సి ఉందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి సీఎస్‌కు వివరించారు. పిల్లర్ల నిర్మాణానికి వీలుగా పంజాగుట్ట-నిరంకారీ భవన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్-అమీర్‌పేట్ జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అనుమతులు లభించాయన్నారు.పిలర్లు పూర్తయిన వెంటనే బారికేడ్లను తొలగించాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి బీ.ఆర్మీనా తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
కేంద్ర హోంశాఖ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం వాదన విభజన చట్టంలోని నిబంధనను ఎత్తిచూపిన సీఎస్ రాజీవ్ శర్మ పదో షెడ్యూల్లోని సంస్థలను ఉమ్మడిగా ఉంచాలన్న ఏపీ సీఎస్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని విజ్ఞప్తి అన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిన విభజన అంశాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఎవరికీ కేటాయించని సంస్థలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి నిర్వహణ కింద ఉండాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించగా.. రాష్ర్ట ప్రభుత్వం అందుకు విబేధించింది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలను ఆ ప్రాంతానికే కేటాయించాలని సీఎస్ రాజీవ్ శర్మ తన వాదన వినిపించారు. ఆయా సంస్థల పేర్లలో ‘ఏపీ’ పదం ఉన్నంత మాత్రాన.. వాటి నియంత్రణ, నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతిలోనే ఉంటుందని భావించరాదని స్పష్టం చేశారు. భౌగోళికంగా అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే కేటాయించాలని విభజన చట్టమే చెబుతోందని ప్రస్తావించారు. చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున ఉమ్మడి నిర్వహణ అన్నదే ఉత్పన్నం కాదని తోసిపుచ్చారు. చట్టంలో లేని ఏ విషయంలోనూ టీ సర్కారు హక్కులు కోరడం లేదని గుర్తు చేశారు. షెడ్యూలు తొమ్మిదిలోని సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే అక్కడున్న ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ ఆస్తులుగా పరిగణించడం సరికాదన్నారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలను ఉమ్మడి నిర్వహణలోనే ఉంచాలని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్థలకు సమకూరిన నిధులను న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉద్యోగుల విభజనను రెండు ప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో చేయాలని, సమస్యల పరిష్కారానికి వీలుగా తటస్థ అథారిటీ ఏర్పాటుకు సెక్షన్ 8 కింద నిబంధనలు రూపొందించాలని కోరింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కూడా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్ 7లోని సంస్థలకు సంబంధించిన నిధులపై కూడా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల వాదనలను విన్న కేంద్ర హోంశాఖ బృందం.. ఈ వివరాలన్నీ కేంద్ర న్యాయ శాఖకు తెలియజేసి న్యాయసలహా తీసుకుంటామని చెప్పింది. సీఎస్ల మధ్య వాగ్యుద్ధం విభజన వివాదాల పరిష్కారంపై జరి గిన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికృష్ణారావు, తెలంగాణ సీఎస్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సమక్షంలో ఇరువురు సీఎస్‌లూ వాడివేడిగా వాదించుకున్నారు. ఎవరు ఏమన్నారంటే.. ఏపీ సీఎస్ కృష్ణారావు 1. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించండి. ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వివక్ష గురిచేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకుగాను శాంతి భద్రతలను గవర్నర్‌కే అప్పగించాలి. 2. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను టీ సర్కార్ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. అధికారులను నియమించుకుంది. 3. కాలుష్య నియంత్రణ మండలి, న్యాక్లను తెలంగాణ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. 4. పదో షెడ్యూల్లో సంస్థల నిర్వహణ, పరిశీలన ఉభయ రాష్ట్రాల యాజమాన్యంతో ఉండాలి. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ 1. ఏపీ ఉద్యోగులకు ఎలాంటి వేధింపులూ లేవు. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించడంపై అభ్యంతరం. 2. అలా చేయలేదు. అభ్యంతరం చెబుతున్నాం. 3. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. 4. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. -
నేడు ఢిల్లీకి రాజీవ్‌శర్మ
ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయనున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రం దృష్టికి నిధులు, విద్యుత్ సహా పలు అంశాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య పలు అంశాల్లో వివాదం మళ్లీ ఢిల్లీకి చేరనుంది. ఇటీవలే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగానికి సంబంధించి కేంద్ర మంత్రులు ఉమా భారతి, పీయూష్ గోయల్‌కు మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రాష్ట్ర విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కేంద్రానికి సీఎస్ ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న పలు సంఘటనలతో పాటు విద్యుత్, శ్రీశైలం జల వినియోగం తదితర అంశాలను కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురానున్నారు. ప్రధానంగా విభజన చట్టం తొమ్మిదో, పదో షెడ్యూళ్లలోని వివిధ సంస్థలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో సమస్యలు వస్తున్నాయని స్పష్టం చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న నిధులను ప్రస్తుతం ఏపీ అధికారులు తెలంగాణకు సమాచారం ఇవ్వకుండా కొత్త ఖాతాల్లోకి మార్చేస్తున్నారని... దీంతో తెలంగాణకు అందాల్సిన వాటా రాని పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించనున్నారు. ఇంతకుముందు కూడా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన నిధులను ఆ రాష్ట్ర అధికారులు ఏపీలోని బ్యాంకులకు తరలించడంపై ఆధారాలతో కేంద్రం దృష్టికి తీసుకుని రానున్నారు. ఇక పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల్లోని నిధులను.. ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లాగేయడంతోపాటు, పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు సృష్టిస్తోందని రాజీవ్‌శర్మ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కృష్ణపట్నం, సీలేరు ప్రాజెక్టుల విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా వివరించనున్నారు. ఐఏఎస్‌ల విభజనకు సంబంధించి కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని.. శాఖాధిపతులు లేక పాలనపై ప్రభావం పడుతోందని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని రాజీవ్‌శర్మ కోరనున్నారు. -
కేసీఆర్‌తో సీఎస్, మెట్రో ఎండీ భేటీ, వివరణ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ సీఎస్ కూడా సమావేశం అయ్యారు. మెట్రో ప్రాజెక్ట్‌పై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన ఈ సందర్భంగా కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా అంతకు ముందు మెట్రో ఎండీ, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. మరోవైపు కేసీఆర్ తీరు వల్లే మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటామంటోందని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మెట్రో ఎండీ వివరణ ఇస్తూ మెట్రో ప్రాజెక్ట్ పనులు ఆగిపోలేదని, కొనసాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. -
కొత్త కలెక్టర్ ఎన్.శ్రీధర్
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తా. జిల్లాను పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మలుస్తా. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతా. జిల్లాను హార్టికల్చర్ హాబ్‌గా మార్చడం, విద్యాప్రమాణాలు పెంపొందించడం నా ముందున్న ప్రథమ ప్రాధాన్యాలు. - కలెక్టర్ ఎన్.శ్రీధర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పాలనలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త కలెక్టర్‌గా నియమితులైన నడిమట్ల శ్రీధర్ తనకు ఉత్తర్వులు అందిన అరగంట వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇటువంటి కీలక పోస్టులో చేరే అధికారులు ఒకట్రెండు రోజులు సమయం తీసుకోవడం ఆనవాయితీ. రెవెన్యూపరంగా ముఖ్యమైన జిల్లా కావడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్నదే తడువు ఎన్ .శ్రీధర్ కలెక్టర్ సీట్లో వాలిపోయారు. కాగా, బదిలీ అయిన బి.శ్రీధర్‌కు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను ఏపీ రాష్ట్ర కేడర్‌కు పంపే అవకాశముంది. రాష్ట్ర విభజన అనంతరం శ్రీధర్ బదిలీ అనివార్యమని తెలిసినప్పటికీ, అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుపై కేంద్రం ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు స్థానచలనం కల్పించకూడదని ఇరురాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే, ఐఏఎస్ వర్గాలు హాట్‌సీటుగా భావించే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సమర్థుడు, సీనియర్ అధికారిగా పేరున్న ఎన్.శ్రీధర్ ైవె పు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ రాజీవ్‌శర్మ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. దీంతో వడివడిగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు బాధ్యతలు అప్పగించిన బి.శ్రీధర్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత ఏడాది జూలై 2న జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థవంతంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహా సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ప్రశంసలందుకున్నారు.