హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్ రాజీవ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా రెగ్యులరైజ్ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇంతవరకు ఉద్యోగుల వివరాలు తేల్చని డిపార్ట్మెంట్లు వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మరోసారి సమావేశం కానున్నారు.