సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. 1990 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. నిబంధనలను గాలికొదిలేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(ఏసీటీవో) నుంచి డిప్యూటీ సీటీవోగా పదోన్నతి కల్పించే విషయంలో సర్వీస్‌రూల్స్ అమలు చేయడంలేదని మండిపడుతున్నారు. ఈ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి పదోన్నతులతో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగాలు నిర్వహిస్తున్నవారు గత మూడు దశాబ్దాలుగా ఏసీటీవోలుగానే పదవీ విరమణ చేసే పరిస్థితి నెలకొంది.
ప్రమోటీ ఏసీటీవోలను విస్మరించి డెరైక్ట్ రిక్రూట్ ఏసీటీవోలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోటీ ఏసీటీవోలు సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పది డీసీటీవో ఖాళీలను భర్తీ చేయాల్సి వస్తే వరుసక్రమంలో 1 నుంచి 10 మందిలో నలుగురు డెరైక్టు రిక్రూటీలకు, ఆరుగురు ప్రమోటీలకు పదోన్నతి కల్పిం చాలి. కానీ ఇదేం అమలుకావడంలేదని కొందరు ఉద్యోగులు 2009-10 ప్రమోషన్లపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో 2011 జూన్ 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది 30:70 నిష్పత్తిలో పదిమంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలంటే అందులో నలుగురు డెరైక్టు రిక్రూటీలు, మిగతావారు ప్రమోటీలుగా ఏయే సంఖ్యలో ఉండాలో పేర్కొంది. ఈ మేరకు గత జూన్ 29న వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కమిషనర్ అనిల్‌కుమార్ అభ్యం తరం వ్యక్తం చేస్తూ మెమోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఆగస్టు 7న ఉత్తర్వును విత్‌డ్రా చేసుకుంది. దీంతో పదోన్నతుల రగడ మళ్లీ మొదటికొచ్చింది.
పన్నుల శాఖలో పదోన్నతుల వివాదం
Published Mon, Dec 14 2015 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement