Department of Commercial Taxes
-
నాలుగేళ్లలో సంపద సృష్టి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో గత నాలుగేళ్లలో కొత్త వనరులతో పాటు సంపద సృష్టి జరిగిందని, జీఎస్టీ గణాంకాలే ఇందుకు నిదర్శనమని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. 2021–22లో రూ.23,386 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు (పరిహారం లేకుండా) 2022–23లో 25 శాతం వృద్ధితో రూ.28,103 కోట్లకు చేరాయన్నారు. కేంద్ర జీఎస్టీ కంటే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నాలుగు శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా ఉండే కర్ణాటక, మహారాష్ట్రల్లో సైతం ఇది కేవలం ఒక్క శాతానికి మాత్రమై పరిమితమైందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఆదాయం, సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం విజయవాడలో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని (ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ) ప్రారంభించిన అనంతరం మంత్రి బుగ్గన విలేకరులతో మాట్లాడారు. 2014–19 మధ్య టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెండేళ్లు కరోనా ఇబ్బందులు ఎదురైనా అధిక సంపద, వనరులను సృష్టించామని చెప్పారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి యనమలతో బహిరంగ చర్చకు సిద్ధమని బుగ్గన ప్రకటించారు. ఆదాయం తగ్గిందని యనమల విమర్శిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పెరిగిందంటూ పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే గత నాలుగేళ్లలో పన్ను వసూళ్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. డీలర్ ఫ్రెండ్లీ విధానం వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చినట్లు బుగ్గన పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమది డీలర్ల ఫ్రెండ్లీ విధానమని వివరించారు. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, కమిషనర్ రవిశంకర్, అడిషనల్ కమిషనర్ ఎస్ఈ కృష్ణమోహన్‌రెడ్డి, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: గాడినపడ్డ ఆదాయం
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాష్ట్ర సొంత ఆదాయం గాడిన పడుతోందని, నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను చేరుకుంటున్నట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదించారు. దేశ సగటుతో పాటు పలు ధనిక రాష్ట్రాల కంటే అధికంగా జీఎస్టీ స్థూల (గ్రాస్) వసూళ్ల వృద్ధి నమోదవుతున్నట్లు వివరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ స్థూల వసూళ్లలో దేశ సగటు వృద్ధి రేటు 24.8 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 26.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వృద్ధి రేటు పలు ధనిక రాష్ట్రాల కంటే అధికమని, తెలంగాణ (17.3%), తమిళనాడు (24.9%), గుజరాత్ (20.2 %) కంటే మెరుగైన వసూళ్లు నమోదవుతున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయనేందుకు నిదర్శనమన్నారు. ఆదాయార్జన శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, అధికారులు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు గతేడాది జనవరి నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.26,360.28 కోట్లు కాగా ఈ ఏడాది జనవరి నాటికి రూ.28,181.86 కోట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ టాక్స్లతో కలిపి రూ.46,231 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా 94 శాతం అంటే రూ.43,206.03 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. గతంలో సూచించిన విధంగా పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తెచ్చామని, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విధానాలను సరళీకరించడం, డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నట్లు వివరించారు. సిబ్బంది సమర్థత పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడంతోపాటు పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందించే విధంగా టాక్స్ అసెస్మెంట్ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మనకన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వాటి అమలు అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. 100 శాతం లక్ష్యం చేరుకున్న గనుల శాఖ గనులు, ఖనిజ శాఖ ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6వతేదీ వరకు రూ.3,649 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి గనుల శాఖ ఆదాయం రూ.2,220 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5 వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని చెప్పారు. నిర్వహణలో లేని గనుల్లో కార్యకలాపాలు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రవాణా శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి రూ.3,852.93 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.3,657.89 కోట్లను ఆర్జించినట్లు వెల్లడించారు. రవాణా రంగంలో కోవిడ్ సంక్షోభ పరిస్థితులు సమసిపోయి నెమ్మదిగా గాడిలో పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను మూడు దశల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయలు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, అటవీ అభివృద్ధి సంస్ధ సీజీఎం ఎం.రేవతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘తప్పు’ తేలితే తప్పదు శిక్ష
సాక్షి, అమరావతి: మోటారు సైకిల్ మీద పెద్ద మొత్తంలో ఇనుము తుక్కు తరలించడం సాధ్యమా అంటే.. కానేకాదని ఎవరైనా చెబుతారు. కానీ, విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఒక తుక్కు వ్యాపారి (స్క్రాప్ డీలర్) మోటార్ సైకిళ్లపై టన్నులకొద్దీ తుక్కు ఇనుమును ఇతర రాష్ట్రాలకు తరలించేశారట. ఆ సంస్థ లావాదేవీలు అసహజంగా ఉండటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు లోతుగా పరిశీలించి, ఈ వాహన్ ద్వారా ఆ వాహనాలను పరిశీలిస్తే.. అవన్నీ మోటారు సైకిళ్లని, వాటిపైనే ఏకంగా 20 టన్నుల తుక్కు ఇనుము తరలించినట్లు వే బిల్లులు తీసుకున్నారని వెల్లడైంది. ఆ బిల్లులన్నీ నకిలీవేనని తేలింది. అంతేకాదు ఒడిశా నుంచి విశాఖకు సరుకు తరలించినట్లుగా పేర్కొన్న లారీ నంబర్‌ను పరిశీలించగా.. బిల్లులో పేర్కొన్న సమయంలో ఆ లారీ కేరళలో ఉన్నట్టు తేలింది. ఇలా పలువురు వ్యాపారులు అసలు సరుకు రవాణా చేయకుండానే దొంగ వే బిల్లులు తీసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎదురు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ స్క్రాప్ వ్యాపారి దొంగ వే బిల్లులు సృష్టించినట్లు స్పష్టం కావడంతో కేసులు నమోదు చేశామని, ఆ లావాదేవీలపై పన్ను వసూలు చేయడంతో పాటు దానికి రెట్టింపు పెనాల్టీ విధించనున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. తప్పు చేసిన వారు దొరికిపోతారిలా.. గతంలో వాణిజ్య పన్నుల శాఖ అంటే వ్యాపారులు తమను వేధించే విభాగంగా చూసేవారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీలు చేయడం, చెక్ పోస్టు తనిఖీలు, మూకుమ్మడిగా వ్యాపారులపై తనిఖీల పేరుతో బెంబేలెత్తించేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ వాతావరణం కనిపించడంలేదు. దొంగ ఎక్కడున్నాడో గుర్తించి అక్కడే తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో అనేక మంది స్క్రాప్ డీలర్లు ఉండగా దొంగ వ్యాపారం చేస్తున్న ఆ డీలరు దగ్గరకే నేరుగా వెళ్లడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపారులపై వేధింపులు లేకుండా డేటా అనలిటిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న వ్యాపార లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఒక వ్యాపారి తీసుకుంటున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వే బిల్లులు, వస్తువుల కొనుగోళ్లు, విక్రయాలు, పన్ను చెల్లింపులు వంటి అనేక అంశాలను పరిశీలించి వాటి మధ్య భారీ తేడాలు ఉంటే డేటా అనలిటిక్స్ ద్వారా సులభంగా గుర్తిస్తోంది. దీని ద్వారా గతంలోలా ప్రతి వ్యాపారినీ తనిఖీ చేయాల్సిన అవసరం లేదని, తప్పు ఎవరు చేస్తున్నారో నిర్ధారించుకొని, పూర్తి సాక్ష్యాధారాలతో దాడులు చేస్తున్నట్లు గిరిజా శంకర్ తెలిపారు. ఈ విధంగా ఈ మధ్య కాలంలో జరిపిన తనిఖీల్లో విజయవాడలోని ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ షోరూం ఎటువంటి బిల్లులు లేకుండా 80 శాతం పైగా నగదు రూపంలో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒకడ్రై ఫ్రూట్ వ్యాపారి రూ.35 కోట్ల మేర నగదు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. కొంతమంది వ్యాపారులు సరుకు రవాణా అయిపోగానే కంప్యూటర్ నుంచి డేటా డిలీట్ చేయడం, వాట్సాప్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ అయిపోయిన వెంటనే వాటిని డీల్ట్ చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. డిలీట్ చేసిన డేటాను మొత్తం తిరిగి రిట్రీవ్ చేసి ఆధారాలతో కేసులు నమోదు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి అనవసరపు తనిఖీలు, దాడులు ఉండటంలేదు. ఈ విధానం పట్ల పలువరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు తగ్గించడమే లక్ష్యం రాష్ట్రంలో వ్యాపారులపై దాడులు లేకుండా చేయాలన్నదే మా ప్రభుత్వ విధానం. ఇందుకోసం పూర్తిస్థాయిలో డేటా అనలిటిక్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల తప్పుడు వ్యాపారం చేస్తున్న వారిని సులభంగా గుర్తించవచ్చు. చట్ట ప్రకారం వ్యాపారం చేస్తూ బాధ్యతగా పన్ను చెల్లించే వాతావరణం తీసుకువస్తాం. ఇందుకోసం వ్యాపారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకుంటాం. – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి -
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ట్యాంపరింగ్.. బీ'కామ్'గా మార్చేశాడు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ విద్యార్హత సర్టిఫికెట్తో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రికార్డులను ట్యాంపర్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్లోనూ ఆయన తప్పుడు విద్యార్హతను పేర్కొన్నారు. ఈయన విద్యార్హతపై అభ్యంతరాలు తెలుపుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం చివరికి ఫలించింది. గతంలో సాక్ష్యాధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. అంతేకాదు.. అశోక్‌బాబును ఎమ్మెల్సీగా చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం ఇచ్చింది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బి. మెహర్‌కుమార్ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఆయన బండారం బట్టబయలైంది. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై సెక్షన్–477ఎ, 465, 420 కింద సీఐడీ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. సర్వీసు రిజిస్టర్లో ట్యాంపర్ చేసింది ఇలా.. నిజానికి.. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్‌బాబు విద్యార్హత ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. లోకాయుక్తలో వేసిన కేసులోని వివరాల ప్రకారం.. అశోక్‌బాబు డి.కాం (డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేశారు. ఆ అర్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి సీనియర్ అసిస్టెంట్ అయ్యారు. అనంతరం ఆయన కమిషనర్ కార్యాలయంలో పోస్టింగ్‌పై కన్నేశారు. కానీ, అక్కడ పోస్టింగ్ పొందాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. దాంతో తన సర్వీసు రిజిస్టర్‌లోని విద్యార్హత కాలమ్‌లో ఉన్న డీ.కాం.ను ట్యాంపర్ చేసి బీ.కాం.గా దిద్ది బురిడీ కొట్టించారు. ఇంగ్లీష్ అక్షరం ‘డీ’ని ట్యాంపర్ చేసి ‘బీ’గా మార్చారు. ఆ విధంగా తప్పుడు సమాచారంతో ఆయన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేశారు. దీనిపై ఆ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కేసులు సుదీర్ఘకాలం పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న అశోక్‌బాబు సహచర ఉద్యోగుల ప్రయోజనాలకంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారన్నది బహిరంగ రహస్యం. 2013–14లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకుండా 2014 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ మద్ద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఇక అదే ఏడాదిలో నాటి సీఎం చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ, విద్యార్హత విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఫిర్యాదుకు సంబంధించిన కేసు అప్పటికే పెండింగ్‌లో ఉంది. దీనివల్ల స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం అనుమతించకూడదు. కానీ, అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ అఫిడవిట్లోనూ అసత్యాలే.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్లోనూ అశోక్‌బాబు అసత్య సమాచారాన్నే పేర్కొన్నారు. తన విద్యార్హత బి.కాం.గా పేర్కొన్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సమయంలో తనపై కేసులు పెండింగ్‌లో లేవన్న ఆయన.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు సమయంలో మాత్రం తనపై పెండింగ్‌లో ఉన్న కేసులను చెప్పడం గమనార్హం. దీంతో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆయన అఫిడవిట్ దాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లోకాయుక్త ఆదేశాలతో కదిలిన డొంక ఈ నేపథ్యంలో.. బి. మెహర్‌కుమార్ ఫిర్యాదుతో వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి లోకాయుక్త సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. సమగ్రంగా విచారించేందుకు ఈ కేసును సీఐడీకి అప్పగించాలని 2021 ఆగస్టులోనే ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలని కోరింది. లోకాయుక్త ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ శాఖ జాయింట్ కమిషనర్ గీతా మాధురి ఈ అంశంపై అధికారికంగా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. లోకాయుక్త తీర్పును అనుసరించి పూర్తి సాక్ష్యాధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడంతో ఈ కేసులో పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
అప్పుడు ఓకే.. ఇప్పుడు నాట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: బోధన్ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న మొత్తం 42 మంది అధికారులు, సిబ్బందిని తాము విచారించాలని చెబుతూ సీఐడీ అధికారులు ఇటీవల వాణిజ్య పన్నుల విభాగం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ లేఖకు ముందు ఆరోపణలెదుర్కొంటున్న అధికారుల పే రోల్స్‌కు సంబంధించిన వివరాలివ్వాలని సీఐడీ ఐదుసార్లు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కాగా 2017 నుంచి పురోగతి లేని కేసు మళ్లీ తెరమీదకు రావడంతో వారంతా ప్రభుత్వంలో తమకు వత్తాసు పలుకుతున్న కీలక ఉన్నతాధికారిని ఆశ్రయించారు. దీంతో ఆయన తాను చెప్పినా వినకుండా దర్యాప్తులో దూకుడు పెంచడం ఏంటని సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇకపై ఈ కేసులో ఎలాంటి విచారణలు,. అరెస్టులు అవసరం లేదని, ఇప్పటివరకు అరెస్టయిన వారిపై చార్జిషీట్ దాఖలు చేసుకోవాలంటూ సలహాలు ఇచ్చినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ అధికారి మొదట్లో దర్యాప్తుకు బాగా సహకరించారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని సీఐడీ అంటోంది. నిందితులు ఎంతటివారైనా అరెస్టు చేయాల్సిందేనని ప్రభుత్వం పదే పదే చెప్తుంటే.. సంబంధిత అధికారి దర్యాప్తును అడ్డుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్లు అప్పగించని అధికారులు ప్రతి మూడు నెలలకోసారి, ఆరునెలలకోసారి బోధన్ సర్కిల్ కార్యాలయంలో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు చెల్లించినట్టు సృష్టించిన నకిలీ చలాన్ల విషయమై సీఐడీ నివేదిక అందినట్టు తెలిసింది. మొత్తంగా 70 శాతం మేర నకిలీ చలాన్లు సృష్టించినట్టు రిపోర్ట్ రావడంతో, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల లాగిన్ వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, వ్యాపారుల పేర్లతో అప్లోడ్ చేసిన వారిని విచారించేందుకు వీలుగా సర్వర్లను తమకు అప్పగించాలని సీఐడీ కోరినా వాణిజ్య పన్నుల శాఖ స్పందించడం లేదని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇస్తే తాము కూడా దొరికిపోతామని సంబంధిత అధికారులు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కీలక సూత్రధారులుగా ఉన్న వారి డేటా డిలిట్ చేసే అవకాశం ఉందని, అదే జరిగితే కుంభకోణాన్ని బయటపెట్టేందుకు కీలకంగా ఉన్న సాంకేతిక ఆధారాలు సేకరించడం కష్టసాధ్యమవుతుందని దర్యాప్తు విభాగం కలవరపడుతోంది. ఇదీ కుంభకోణం.. నిందితులు రెండురకాల పద్ధతుల్లో కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు. బోధన్ సర్కిల్లోని వ్యాపారుల నుంచి పన్ను సంబంధిత సొమ్ము వసూలు చేసిన కన్సల్టెంట్ శివరాజు పన్ను చెల్లించిన వ్యాపారుల పేరిట సగం పన్నే జమ చేశాడు. మిగతా సొమ్ము నొక్కేశాడు. అయితే వ్యాపారులు మొత్తం పన్ను చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించి ఇచ్చాడు. అంతే మొత్తానికి అధికారులతో కుమ్మక్కై వ్యాట్ పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్టుగా సీఐడీ గుర్తించింది. మరోవైపు వ్యాపారులు చెల్లించాల్సిన పన్నులో సగం మాత్రమే వసూలు చేసి మొత్తం సొమ్ము చెల్లించినట్టుగా నకిలీ చలాన్లతో పోర్టల్‌లో అప్లోడ్ చేశాడు. వ్యాపారులు చెల్లించాల్సిన మిగతా పన్నులో ఎంతో కొంత వసూలు చేసుకుని తన జేబులతో పాటు అధికారుల జేబులు నింపాడు. ఇలా మొత్తంగా రూ.275 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు సీఐడీ అంచనా వేసింది. -
వేగంగా కోలుకుంటున్న ఆర్థిక రంగం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక రంగం వేగంగా కోలుకుంటోంది. గతేడాది కోవిడ్‌తో భారీగా పడిపోయిన పన్నుల ఆదాయం ఇప్పుడు తిరిగి కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభానికి ముందు 2019–20లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయం రూ.21,967.90 కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది ఇదే కాలానికి రూ.26,133.33 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.55,535 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్లో నిర్దేశించారు. 2019–20లో మొదటి ఆరు నెలల కాలానికి రూ.10,911.03 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది ఇదే కాలానికి రూ.14,661.10 కోట్లకు చేరింది. ఇందులో ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పాత సంవత్సరాలకు సంబంధించిన అడహాక్ చెల్లింపులు, జీఎస్టీ పరిహారం, రుణాల రూపంలో ఇవ్వడంతో రూ.3,337 కోట్ల అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతో.. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టింది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతో ఆర్థిక కార్యకలాపాలు కోవిడ్ పూర్వ స్థితికి వేగంగా చేరుకోవడానికి దోహదపడ్డాయని అధికారులు తెలిపారు. దీనికితోడు తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్ కూడా సత్ఫలితాలను ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.1,772 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈ ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తగ్గిన లిక్కర్ ఆదాయం వాణిజ్య పన్నుల ఆదాయంలో జీఎస్టీ, పెట్రోలియం, వృత్తి పన్ను వంటి అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైనా లిక్కర్ ఆదాయంలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు 2019–20 మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,735.48 కోట్లుగా ఉన్న లిక్కర్‌పై వ్యాట్ ఆదాయం ఈ ఏడాది రూ.4,104.26 కోట్లకు పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా మద్యం షాపుల సంఖ్య తగ్గించడం, ఎక్సైజ్ సుంకాలను పెంచడంతో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. లిక్కర్‌పై వ్యాట్ ఆదాయం తగ్గడానికి ఇదే కారణమన్నారు. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం రూ.5,215.14 కోట్ల నుంచి రూ.7,245.93 కోట్లకు, వృత్తి పన్నుల ఆదాయం రూ.106.24 కోట్ల నుంచి రూ.122.03 కోట్లకు చేరుకుంది. -
జీఎస్టీ ఆదాయంపై కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ రాబడిపై కోవిడ్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ కాలంతో పోలిస్తే రాబడి భారీగా పెరిగినట్టు కనిపిస్తున్నా.. ముందు నెలలతో పోలిస్తే మాత్రం రాబడి క్రమేపీ క్షీణిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,826 కోట్ల (అడహక్ చెల్లింపులు కాకుండా) రాబడి మాత్రమే సమకూరింది. వాస్తవంగా రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా ఆగస్టు నెలలో కేంద్రానికి రూ.2,591 కోట్ల రాబడి వచ్చినప్పటికీ.. ఐజీఎస్టీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ఖాతాలోకి రూ.1,826 కోట్లు మాత్రమే వచ్చినట్టు స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రవిశంకర్ నారాయణ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో గతేడాది ఆగస్టులో జీఎస్టీ ద్వారా రూ.1,516 కోట్ల రాబడి వచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే జీఎస్టీ రాబడి రూ.710 కోట్లు (అడ్‌హక్ చెల్లింపులతో కలుపుకుని) పెరిగింది. అయితే, ఈ ఏడాది జూలై నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు రూ.411 కోట్ల మేర తగ్గాయి. ఈ ఏడాది జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు (రుణం, అడహక్ చెల్లింపులు లేకుండా) రూ.2,237 కోట్లుగా ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా జీఎస్టీ చెల్లింపులకు జూలై వరకు కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడంతో రాబడి పెరగడానికి కారణంగా అధికారులు వివరించారు. ఇతర వ్యాట్, వృత్తి పన్ను అన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఆగస్టులో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.4,204 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.2,494 కోట్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూపంలో ఆదాయం రూ.868 కోట్ల నుంచి రూ.1,258 కోట్లకు చేరింది. ఐదు నెలల్లో రూ.21,157 కోట్ల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.55,535 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. ప్రస్తుత 5 నెలల కాలానికి (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు) రూ.21,157 కోట్ల ఆదాయం సమకూరినట్టు వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమికంగా లెక్క తేల్చింది. జీఎస్టీ ద్వారా రూ.11,805 కోట్ల ఆదాయం సమకూరగా.. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.5,952 కోట్లు, మద్యంపై వ్యాట్ ద్వారా రూ.3,300 కోట్లు, వృత్తి పన్ను ద్వారా రూ.100 కోట్లు సమకూరింది. బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రతినెలా సగటున రూ.4,627 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఐదు నెలల ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున రూ.4,231 కోట్లు మాత్రమే వస్తోంది. జీఎస్టీ ఎగవేతదారులు, తక్కువ పన్ను చెల్లించిన వారిని గుర్తించి పన్ను వసూలు చేయడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది ప్రత్యేక డ్రైవ్ ద్వారా కనీసం రూ.1,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 5 నెలల కాలానికి రూ.592 కోట్లు వసూలు చేశారు. చెల్లించాల్సిన దానికంటే తక్కువ పన్ను చెల్లించినట్టు గుర్తించిన సంస్థల ఖాతాలను ప్రత్యేకంగా ఆడిటింగ్ నిర్వహించే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది. -
పద్దు రద్దు.. జీఎస్టీకి చెల్లు!
సాక్షి, అమరావతి: జీఎస్టీ విధానాన్ని సరళతరం చేస్తూ తీసుకొచ్చిన నిబంధనలను రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఎంచక్కా వ్యాపారం చేస్తూ.. వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నా, ఎక్కడా కాగితాల్లో చూపించకుండా దర్జాగా వందల కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొడుతున్నారు. ఇలా 2017 నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా 1.64 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్ల రద్దుతో కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు భారీగా గండి కొట్టారు. సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త తనిఖీల్లో ఈ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఇదీ వారి దారి.. ► రాష్ట్రంలో ఓ వ్యాపార సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టింది. ప్రతి నెల జీఎస్టీ రిటర్ను దాఖలు చేయాలి. వరుసగా ఆరు నెలల పాటు రిటర్నులు దాఖలు చేయకపోవడంతో నిబంధనల ప్రకారం అధికారులు రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. కానీ ఆ వ్యాపార సంస్థ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఈ ఆరు నెలల్లో చేసిన వ్యాపార టర్నోవర్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దానిపై పన్ను చెల్లించరు. అంతటితో వ్యాపారం నిలిపివేస్తారా అంటే అదీ లేదు. ► దేశంలో ఒక రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలోని వ్యాపార సంస్థ మరే రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి అయినా సరే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన మూడు రోజుల్లో అధికారులు రిజిస్ట్రేషన్ చేయకపోతే.. ఆటోమేటిగ్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. (డీమ్డ్ టుబీ రిజిస్టర్డ్). కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు అయిన వ్యాపార సంస్థ ఈసారి మరో రాష్ట్రం నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యాపారం సాగిస్తుంది. ► ఆ రాష్ట్రంలో కూడా ఆరు నెలలపాటు రిటర్నులు దాఖలు చేయరు. దాంతో రిజిస్ట్రేషన్ రద్దు అయితే చేస్తారు. కానీ ఈ కాలంలో జరిగిన టర్నోవర్‌కు ఎక్కడా లెక్క ఉండదు. పన్నులు ఉండవు. ఈసారి మరో రాష్ట్రం నుంచి నమోదు.. ఈ దందా నిరంతర ప్రక్రియగా సాగుతోంది. ఈ వ్యవహారంపై సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్పెషల్ కమిషనర్ ఎస్.నారాయణ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ పియూష్ కుమార్‌లు దృష్టి సారించి ప్రత్యేక విచారణ చేపట్టారు. జీఎస్టీ ఎగవేత కట్టడికి పటిష్ట చర్యలు ► 2017 నుంచి రాష్ట్రంలో సాగుతున్న జీఎస్టీ ఎగవేత దందాకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కార్యాచరణకు ఉపక్రమించాయి. ► జీఎస్టీ అంశాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించేందుకు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ప్రత్యేకంగా ఆడిట్ విభాగాన్ని నెలకొల్పారు. మూడు స్థాయిల్లో అధికారులు పర్యవేక్షిస్తూ.. విస్తృత తనిఖీల కోసం వంద బృందాలను నియమించారు. ► ప్రత్యేకంగా డాటా అనలిటిక్స్ వింగ్‌ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం భారీ పన్ను ఎగవేసే అవకాశం ఉన్న సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. జీఎస్టీ ఎగవేతలను కట్టడి చేసే అంశంపై చర్చించేందుకు జాయింట్ కమిషనర్లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. విచారణ సాగుతోందిలా.. ► ప్రత్యేక అధికారుల బృందాలను నియమించి వాటిలో ర్యాండమ్‌గా 3,570 రద్దు పద్దులను పరిశీలించారు. సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులు, సరుకు అమ్మినట్టు చెప్పే జీఎస్టీర్ 1 రిటర్నులు, ప్రతి నెల దాఖలు చేయాల్సిన జీఎస్టీర్ 3బి రిటర్నులు పరిశీలిస్తే వాటి మధ్య భారీ వ్యత్యాసం ఉందని స్పష్టమైంది. ► సరుకు వెళ్లినట్టు వే బిల్లుల్లో ఉంటుంది. కానీ ఆ సరుకు అమ్మినట్టుగానీ, అందుకు సంబంధించి నెలవారీ రిటర్ను దాఖలు చేసినట్టుగానీ లేదని వెల్లడైంది. ఆ విధంగా గుట్టుచప్పుడు కాకుండా టర్నోవర్‌ను దాచిపెట్టి, జీఎస్టీని ఎగ్గొట్టారు. ► ప్రాథమిక పరిశీలనలో.. రద్దు అయిన 3,570 రిజిస్ట్రేషన్లలో సెంట్రల్ జీఎస్టీకి చెందినవి 1,513 ఉండగా, రాష్ట్ర జీఎస్టీకి చెందినవి 2,057 ఉన్నాయి. ఇందువల్ల ఏకంగా రూ.4,400.83 కోట్ల టర్నోవర్‌ను అధికారికంగా చూపించలేదు. ఇందులో కేంద్ర జీఎస్టీ వాటా రూ.1,491.84 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ వాటా రూ.2,908.97 కోట్లు. ► వివిధ కేటగిరీల కింద 5 శాతం నుంచి 18 శాతం వరకు జీఎస్టీ చెల్లించాలి. ఈ లెక్కన వందల కోట్ల రూపాయల జీఎస్టీని ఎగవేశారు. మొత్తం మీద రద్దు అయిన 1.64 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. ఎన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ను లెక్కల్లో చూపించ లేదో.. తద్వారా ఎన్ని వేల కోట్ల జీఎస్టీని ఎగవేశారో అంతుచిక్కడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర జీఎస్టీకి సంబంధించిన అంశాలపై అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. -
జీఎస్టీ ఎగవేతదారులను పట్టేద్దాం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు దృష్టిసారించారు. సమాచార మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, ఆదాయ నష్టానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ(వాణిజ్యం, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నేతృత్వంలోని రాష్ట్ర అధికారులు, విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నరేష్ నేతృత్వంలోని కేంద్ర అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు తరుచూ సమావేశమవుతూ సమాచారం మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు రజత్‌భార్గవ చెప్పారు. ఇరు విభాగాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా జీఎస్టీ ఆదాయానికి నకిలీ ఇన్వాయిస్లతో భారీగా గండి కొడుతున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లయిమ్‌లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డీజీజీఐ, ఏపీఎస్డీఆర్ఐ వంటి వాటి సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని విశ్లేషించనున్నారు. సమావేశంలో రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, వైజాగ్ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్ పాల్గొన్నారు. -
బంగారం..స్మగ్లర్ల సింగారం
బంగారం.. ఈ పేరు వింటే చాలు మహిళల కళ్లు జిగేల్మంటాయి.. ఉన్నోళ్లు, పెద్దగా లేనోళ్లు.. ఎవరైనా సరే ఉన్నంతలో పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లకు నగలు ధరించడం అంటే అత్యంత ప్రీతిపాత్రం.. అమ్మాయిల పెళ్లిళ్ల కోసం ఏళ్లతరబడి కూడబెట్టిన సొమ్ముతో పలువురు నగలు కొంటుంటారు.. మరికొందరు ఏటా కొద్ది మొత్తంలో బంగారం కొని, దాచుకుంటుంటారు.. ఇది నగదుకు ప్రత్యామ్నాయం.. అందువల్లే ఎప్పుడైనా, ఎక్కడైనా సరే బంగారానికి యమా గిరాకీ. ఈ గిరాకీనే వ్యాపారుల పాలిట ‘బంగారం’గా మారింది. లాభాల కోసం ‘అడ్డ దారి’ రాజ మార్గం అయింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బంగారం ధర దేశ దేశాలకూ మారుతుంది. రాష్ట్రంలోనూ ఒక్కో ఊళ్లో ఒక్కో ధర ఉంటుంది. ఇదే అదనుగా చెన్నైలోని బంగారం (గోల్డ్) స్మగ్లింగ్ ముఠా పేట్రేగి పోతోంది. ఎయిర్‌పోర్టు, షిప్పింగ్ పోర్టులను అడ్డాలగా మార్చుకుని విదేశీ బంగారాన్ని తక్కువ ధరకు అనధికారికంగా దిగుమతి చేసుకుంటోంది. తర్వాత ఆభరణాలుగా తయారు చేసి అధిక ధరకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు నగరానికి.. నెల్లూరు నుంచి లైన్ బిజినెస్ పేరుతో విశాఖపట్నం వరకు అన్ని ప్రాంతాలకు బంగారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అతికొద్ది షాపులు మినహా ఎక్కడా పన్నులు చెల్లించిన దాఖలాలు లేవు. చెన్నై నగరం నుంచి కస్టమ్ డ్యూటీ, జీఎçస్టీ చెల్లించకుండా రోజూ నెల్లూరుతోపాటు రాష్ట్రమంతా వంద కిలోలకు పైగానే బంగారం బిస్కెట్లు, ఆభరణాలు సరఫరా అవుతున్నాయి. నెల్లూరు నగరంలోని బంగారం విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (ఫైల్) , గత డిసెంబర్లో చెన్నై నుంచి బస్సులో అక్రమంగా తరలిస్తున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును పట్టుకున్న అధికారులు (ఫైల్) ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా.. నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారం మారిన క్రమంలో ధరలు నింగినంటుతున్నాయి. ప్రధానంగా శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్, ఇతర అరబ్ దేశాల నుంచి ప్రతి రోజూ రాష్ట్ర సరిహద్దులోని చెన్నై నగరానికి కిలోల కొద్దీ బంగారం దిగుమతి అవుతోంది. బంగారానికి గతంలో 12.5 శాతం కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి తగ్గించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు కలిపి 3 శాతం ఉంది. అంటే మొత్తంగా దిగుమతి అయి కొనుగోలు చేసే బంగారానికి 10.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ అవేవీ చెల్లించకుండానే వందల కిలోల బంగారం వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రత్యేక కొరియర్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం బంగారం వ్యాపారాలపై తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం. ఫిర్యాదుల వస్తే తప్పకుండా తనిఖీలు చేపట్టి, ఫెనాల్టీతో పన్ను వసూలు చేస్తాం. రెండేళ్లలో 25 కేసులు నమోదు చేశాం. వారి నుంచి రూ.1.5 కోట్లకు పైగా పన్నుతో పాటు ఫెనాల్టీ విధించాం. – కల్పన, జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు బంగారం వ్యాపారులు జీఎస్టీ ఎగవేతపై పక్కా సమాచారంతో ఇటీవల నెల్లూరు కేంద్రంలో మూడు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. క్రయ, విక్రయాలు, జీఎస్టీకి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం. – కె.రాజేశ్వరరెడ్డి, రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, నెల్లూరు స్మగ్లర్లకు ఆదాయం ఇలా.. ► 24 క్యారెట్ల బంగారం కిలో ధర మద్రాసు బులియన్ మార్కెట్లో రూ.47.88 లక్షలు ఉండగా, హైదరాబాద్‌లో రూ.47.78 లక్షలుగా ఉంది. అదే దుబాయ్‌లో మన కరెన్సీ ప్రకారం రూ.42.59 లక్షలు, శ్రీలంకలో రూ.40.16 లక్షలు ఉంది. ► ఉదాహరణకు.. శ్రీలంక నుంచి కొనుగోలు చేస్తే, అక్కడి ధరకు 10.5 శాతం అంటే సుమారు రూ.4.20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా చేయకుండా కస్టమ్స్ కళ్లుగప్పి.. లేదా వారితో ఒప్పందం కుదుర్చుకుని, తెచ్చిన బంగారాన్ని మద్రాసు ధర ప్రకారం కిలో రూ.47.88 లక్షలకు విక్రయిస్తారు. ► ఈ లెక్కన కేజీకి రూ.7 లక్షలు, పన్నుల రూపంలో మరో రూ.4 లక్షలు మొత్తంగా రూ.11 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇందులో సగటున 20 శాతం వరకు వివిధ శాఖలకు మామూళ్లు చెల్లించి వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నెల్లూరు కేంద్రంగా భారీగా వ్యాపారం ► రాష్ట్రంలో బంగారు ఆభరణాల తయారీకి, ప్రత్యేకంగా స్టోన్ వర్క్ ఆభరణాల తయారీకి నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ ధరలు తక్కువ. డిజైన్లు ఎక్కువ. రోజూ సగటున వంద కేజీల బంగారం నెల్లూరు జిల్లా వ్యాపారులే కొంటున్నట్లు అంచనా. ► వీటిలో సగం బిస్కెట్ల రూపంలో, మిగిలిన సగం ఆభరణాల రూపంలో రైళ్లలో తీసుకొస్తారు. రాష్ట్రంలోకి 70 శాతం బంగారం చెన్నై ద్వారానే వస్తుంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోనూ ఇదే తరహాలో వ్యాపారం సాగుతోంది. -
సహజ వాయువుపై పన్ను పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ముడి చమురు పై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.(చదవండి: పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన భార్య) కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 2020 నెలకు 4480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
జీఎస్టీ ఆదాయంలో వృద్ధి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం క్షీణించినా రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో జీఎస్టీ ఆదాయం గతేడాది కంటే రూ.35.35 కోట్లు పెరిగి రూ.1,998.12 కోట్లకు చేరుకుంది. ► గతేడాది ఇదే కాలానికి జీఎస్టీ ఆదాయం రూ.1,962.77 కోట్లుగా ఉంది. ► దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో జీఎస్టీ ఆదాయం 14.36 శాతం క్షీణించి రూ.1,02,082 కోట్ల నుంచి రూ.87,422 కోట్లకు పడిపోయింది. ► రాష్ట్రంలో ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో జీఎస్టీ ఆదాయం పెరిగిందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ తెలిపారు. ► లాక్డౌన్ సమయంలో 75 శాతం ఆదాయం కోల్పోయినా ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలు గు నెలల్లో ఆ నష్టం 25 శాతానికి తగ్గిందన్నారు. ► ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.5,508.49 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి రూ.7,345.69 కోట్లుగా ఉంది. ► రీస్టార్ట్ తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. ► జూలైలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.852.97 కోట్లు వస్తే గతేడాది ఇదే కాలానికి రూ.859 కోట్లుగా ఉంది. ► కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రూ.2,713 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.3,521 కోట్లుగా ఉంది. -
జీఎస్టీ ఆదాయానికి గండి
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుండటంతో ఆ ప్రభావం మన రాష్ట్ర జీఎస్టీ ఆదాయంపై కూడా పడింది. గత నాలుగు నెలల్లో రెండు నెలలు కనీస నెలవారీ రక్షిత ఆదాయాన్ని రాష్ట్రం పొందలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) ప్రతి నెలా కనీస నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని రూ.1,892.99 కోట్లుగా నిర్ణయించారు. దీని కంటే ఎంత తక్కువ వస్తే అంత నష్టాన్ని కేంద్ర ప్రభుత్వంభర్తీ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో ఆదాయ వృద్ధి బాగున్నా మరుసటి నెలల్లో ఆదాయం తగ్గింది. మే, జూన్ నెలలు నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని అందుకోకపోవడంతో ఈ రెండు నెలలకు కలిపి రూ.516.6 కోట్ల నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి కోరినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. 2018–19లో ఏప్రిల్, మే, జూన్, జూలైల్లో రూ.6,896.56 కోట్ల ఆదాయం వస్తే అది ఈ ఏడాది కేవలం 6.51 శాతం వృద్ధితో రూ.7,345.69 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఆటోమొబైల్ అమ్మకాలు భారీగా క్షీణించడం, ఉక్కు రేట్లు 10 నుంచి 15 శాతం తగ్గడం, సిమెంట్ బస్తాకు రూ.20 వరకు తగ్గడంతో ఆదాయం తగ్గిందని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఎరువుల అమ్మకాలు కూడా పడిపోయాయి. జూలైలో ఆదాయం నిర్దేశిత లక్ష్యానికి మించి రూ.1,962.77 కోట్లు వచ్చినా ఆగస్టుకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్న గణాంకాలు అంత ఆశాజనకంగా లేవంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఆదాయంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కూడా కష్టమేనంటున్నారు. నిర్దేశిత రక్షిత ఆదాయం ప్రకారం చూసుకున్నా ఈ ఏడాది కనీసం రూ.22,715.88 కోట్లు రావాల్సి ఉందని, కానీ ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే ఈ మొత్తాన్ని దాటడం సాధ్యం కాకపోవచ్చుంటున్నారు. -
జీరో దందా జోరు
♦ నెలకు రూ.300 కోట్లు ♦ రాష్ట్ర సరిహద్దుల ద్వారా దర్జాగా అక్రమ రవాణా ♦ ఏపీ సరిహద్దుల్లో ఇప్పటికీ ఏర్పాటు కాని చెక్‌పోస్టులు ♦ అతీగతీ లేని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: జీరో దందా జోరుగా సాగుతోంది. పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటూ అక్రమార్కులు సరుకులు తరలిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. ప్రతిరోజు కోట్ల రూపాయల విలువైన వస్తు సామగ్రి అక్రమంగా రాష్ట్రానికి తరలివస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 19 నెలలు గడుస్తున్నా ఏపీ సరిహద్దుల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఏడు చెక్‌పోస్టుల్లో ఒక్కదానికీ మోక్షం లభించలేదు. దీంతో ప్రతినెలా సుమారు రూ.300 కోట్ల విలువైన వస్తు సామగ్రి అక్రమంగా రాష్ట్రానికి తరలివస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలియజేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గత ఆరునెలల్లో జరిపిన దాడుల్లోనే రూ.1,300 కోట్లకుపైగా విలువైన జీరో వ్యాపారాన్ని కనుగొన్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఈ సరుకుకు సంబంధించి రూ.100 కోట్ల మేర వాణిజ్యపన్నుల శాఖ అపరాధరుసుము, పన్నుల కింద నోటీసులు పంపించడమేగాక, అందులో రూ. 45 కోట్ల మేర ఇప్పటికే వసూలు చేసింది. కట్టుదిట్టమైన నిఘా ఉంటే అధికారికంగానే నెలకు రూ.30 కోట్ల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి సమకూరుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులే అంగీకరించడం గమనార్హం. హైదరాబాద్‌లోని బేగంబజార్, ఫీల్‌ఖానా, సిద్దిఅంబర్‌బజార్, అబిడ్స్‌తోపాటు సికింద్రాబాద్‌ల నుంచే ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో 80 శాతం ట్రక్కులు అక్రమ రవాణాకే వినియోగిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల నకిలీ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లతో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, జైపూర్‌ల నుంచి అక్రమ రవాణా సాగుతుండగా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ట్రాన్సిట్ పాస్‌లతో కేరళ, కర్ణాటకల నుంచి సరుకు రవాణా జరుపుతున్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులే పరిష్కారం తెలంగాణ, ఏపీల మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన 7 చెక్‌పోస్టులతోపాటు ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహదుల్లో ఉన్న మరో 7 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్(సకల హంగులతో గల చెక్‌పోస్టులు)గా మార్చాలని వాణిజ్య పన్నుల శాఖ కోరుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీసీ కెమెరాలతోపాటు, స్కానర్లు, జీపీఎస్ విధానం, ఇతర అధునాతన హంగులన్నీ ఉండే ఈ చెక్‌పోస్టుల వద్దకు లారీ వస్తే అందులో ఉన్న సరుకు ఏంటో, ఏ రాష్ట్రం నుంచి వస్తోందో కనుగొనే వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం సీఎం కేసీఆర్‌కు వాణిజ్యపన్నుల శాఖ ప్రతిపాదనలను వివరించారు. రూ.400 కోట్లు ఖర్చు చేస్తే 14 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్‌గా మార్చవచ్చని, అదనంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన వివరించారు. వచ్చే బడ్జెట్లో ఈ మొత్తాన్ని కేటాయించాలని కోరారు. -
పన్నుల శాఖలో పదోన్నతుల వివాదం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. 1990 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. నిబంధనలను గాలికొదిలేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(ఏసీటీవో) నుంచి డిప్యూటీ సీటీవోగా పదోన్నతి కల్పించే విషయంలో సర్వీస్‌రూల్స్ అమలు చేయడంలేదని మండిపడుతున్నారు. ఈ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి పదోన్నతులతో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగాలు నిర్వహిస్తున్నవారు గత మూడు దశాబ్దాలుగా ఏసీటీవోలుగానే పదవీ విరమణ చేసే పరిస్థితి నెలకొంది. ప్రమోటీ ఏసీటీవోలను విస్మరించి డెరైక్ట్ రిక్రూట్ ఏసీటీవోలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోటీ ఏసీటీవోలు సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పది డీసీటీవో ఖాళీలను భర్తీ చేయాల్సి వస్తే వరుసక్రమంలో 1 నుంచి 10 మందిలో నలుగురు డెరైక్టు రిక్రూటీలకు, ఆరుగురు ప్రమోటీలకు పదోన్నతి కల్పిం చాలి. కానీ ఇదేం అమలుకావడంలేదని కొందరు ఉద్యోగులు 2009-10 ప్రమోషన్లపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో 2011 జూన్ 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది 30:70 నిష్పత్తిలో పదిమంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలంటే అందులో నలుగురు డెరైక్టు రిక్రూటీలు, మిగతావారు ప్రమోటీలుగా ఏయే సంఖ్యలో ఉండాలో పేర్కొంది. ఈ మేరకు గత జూన్ 29న వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కమిషనర్ అనిల్‌కుమార్ అభ్యం తరం వ్యక్తం చేస్తూ మెమోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఆగస్టు 7న ఉత్తర్వును విత్‌డ్రా చేసుకుంది. దీంతో పదోన్నతుల రగడ మళ్లీ మొదటికొచ్చింది. -
ఖజానాకు లిక్కర్ కిక్కు!
8 నెలల్లో రూ.7,793 కోట్ల రెవెన్యూ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు మద్యం ఫుల్లుగా కిక్కు ఇస్తోంది. ఈ ఏడాదికిగాను నవంబర్ నెలాఖరు వరకు (8 నెలల్లో) మద్యం అమ్మకాలు, ఇతర మార్గాల ద్వారా ఎక్సైజ్ శాఖ రూ.7,793 కోట్ల రెవెన్యూ సమకూర్చుకుంది. అంచనాల ప్రకారం రూ. 8,075 కోట్లు రావాల్సి ఉండగా... రూ. 300 కోట్లు మాత్రమే తక్కువగా ఉంది. మరోవైపు ఇదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖకు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం భారీగా తగ్గిపోయింది. పన్నుల వసూళ్లు పెంచుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితాలను ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు, గుట్కాపై నిషేధం వంటి కారణాలతోనూ ఆదాయానికి కోత పడుతోంది. ఇక 12 వాణిజ్య పన్నుల శాఖ డివిజన్లలో సగానికి కూడా లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం లేదు. మొత్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 36,000 కోట్ల ఆదాయ లక్ష్యం పెట్టుకోగా... నవంబర్ నెలాఖరు వరకు వచ్చింది రూ. 20,902 కోట్లు మాత్రమే. ‘మద్యం’ లక్ష్యం రూ. 12,207 కోట్లు 2015-16లో మద్యం అమ్మకాలు, లెసైన్సుల ద్వారా రూ. 12,207 కోట్లు సమకూర్చుకోవాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో ఎక్సైజ్ శాఖకు రూ. 7,793 కోట్లు ఆదాయం రాగా, అందులో వ్యాట్ కింద రూ. 5,194 కోట్లు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా సర్కారు ఖజానాకు చేరింది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో సింహభాగం ఇదే కావడం గమనార్హం. -
కోట్లలో పందాలు.. లక్షల్లో లెక్కలు
♦ గుర్రపు పందాలలో రూ.కోట్లు పన్ను ఎగ్గొడుతున్న బుకీలు ♦ వందల కోట్ల వ్యాపారం చేస్తూ నెల నెలా లక్షల్లో లెక్కలు ♦ పన్ను రూపేణా నెలకు రేస్‌క్లబ్ చెల్లిస్తున్నది రూ. 5 కోట్లు ♦ ఎగ్గొడుతున్న మొత్తం అంతకు పదింతలకుపైనే! ♦ స్టింగ్ ఆపరేషన్ చేసి గుట్టు రట్టు చేసిన వాణిజ్యపన్నుల శాఖ ♦ నిజాం నాటి ‘రేస్‌కోర్స్’ చట్టంలో మార్పులకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న గుర్రపు పందాలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.. టికెట్లను పేరుకే రూ.50 నుంచి రూ.500 వరకు అమ్ముతూ వేలు, లక్షల రూపాయల్లో పందాలు కాస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగ్గొడుతున్నారు. ఇదంతా ప్రత్యేక లెసైన్సుతో పందాలు నిర్వహిస్తున్న 23 మంది బుకీల మాయాజాలం. రేస్‌క్లబ్ ద్వారా టికెట్లు కొని కాసే పందాలు సక్రమంగానే సాగుతుండగా... బుకీల ద్వారా జరిగే పందాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. వారు ప్రత్యేకంగా నెలకు కోట్ల రూపాయల్లో పందాలు కాస్తూ రేస్కోర్సుకు లక్షల్లో లెక్కలు చూపుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాన్ని గుర్తించింది. ‘బడా వ్యక్తులు’ బుకీల ద్వారా రూ.కోట్లలో గుర్రపు పందాలు ఆడుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నిజాం కాలం నాటి ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్-1939’లో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైంది. మూడు రకాల పన్నులు..కోట్లల్లో లావాదేవీలు మలక్‌పేటలోని రేస్‌క్లబ్‌లో గుర్రాలు పరుగెడుతుంటే వాటిని చూస్తూ పందాలు కాయడం ఒక రకం బెట్టింగ్. దేశంలోని ఇతర ఏడు నగరాల్లో రేస్‌లు జరుగుతుంటే వాటిని ‘లైవ్ టెలికాస్ట్’ ద్వారా చూస్తూ కాసే ‘ఇంటర్వీన్ బెట్టింగ్’ రెండోది. ఇవి కాక ‘ఏపీ గేమింగ్ యాక్ట్ 1974’ కింద హైదరాబాద్‌లో చలికాలం, వర్షాకాలంలలో జరిగే రేసులకు జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ పందాలపై మూడు రకాల పన్నులు వసూలవుతాయి. రూ.10, రూ.100 విలువైన ప్రవేశ టికెట్ల మీద 30 శాతం పన్ను ఉంటుంది. రూ.500 వరకు లభించే పందె ం టికెట్లపై 10 శాతం పన్ను లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే రేస్కోర్స్లపై జరిగే ఇంటర్వీన్ బెట్టింగ్ మీద 12 శాతం పన్ను వస్తుంది. హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా జరిగే ఈ ప్రక్రియలోనే సర్కారుకు నెలకు రూ.5 కోట్ల మేర పన్ను లభిస్తుంది. అయితే ఈ బెట్టింగ్లలోనే నల్లధనం చెలామణి అయ్యే మరో కోణమే బుకీలతో సాగే పందాలు. గుట్టు రట్టయిందిలా! వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్ రేవతి రోహిణిల పర్యవేక్షణలో 70 మంది అధికారులు సెప్టెంబర్ 4న పందెం రాయుళ్లుగా రేస్కోర్సుకు వెళ్లారు. ప్రభుత్వ అనుమతితో సర్కారు సొమ్ము సుమారు రూ.2లక్షలు వెచ్చించి బుకీల వద్ద పందె ం టికెట్లు కొని రేసు ఆడారు. అధికారులు రూ.500 టికెట్ కొంటే రూ.50 విలువతో ఉన్న టికెట్ ఇచ్చారు. పందెం ముగిసిన తరువాత అధికారులు 23 మంది బుకీలను లెక్కలు అడిగితే రూ.7 లక్షలు చూపించారు. వారి కౌంటర్లపై దాడులు జరపగా రూ.50 లక్షల పైచిలుకు సొమ్ము లభించింది. బుకీలు ఇలా దొంగ లెక్కలతో 2014-15లో ప్రభుత్వానికి చెల్లించింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే. వీరి వాస్తవ లావాదేవీల ప్రకారం నెలకు రూ. 5 కోట్లపైనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ రేస్‌కోర్స్, బెట్టింగ్ యాక్ట్‌ను సమూలంగా మార్చాలని నిర్ణయించింది. బుకీలపై వాణిజ్యపన్నుల శాఖకు పూర్తిస్థాయి అజమాయిషీ ఉండేలా చట్టం రూపొందిస్తోంది. రేస్కోర్సుతో సంబంధం లేకుండా బుకీలు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్, ట్యాక్సేషన్ జరిపేలా మార్పులు చేసింది. బుకీల ఆర్థిక లావాదేవీలపై నిఘా, రిటర్న్స్ ఫైలింగ్ ఉండేలా సవరణలు చేసింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడుతోంది. బుకీల మాయాజాలం మలక్‌పేట రేస్‌క్లబ్ నిర్వహించే గుర్రపు పందాలలో 40 ఏళ్ల క్రితమే ప్రైవేటు బుకీలు ప్రవేశించారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి కొన్నేళ్లుగా ప్రభుత్వం 23 మంది బుకీలకు పందాల నిర్వహ ణ లెసైన్సులు జారీ చేసింది. ఈ బుకీలే ఏటా లెసైన్సులను రెన్యూవల్ చేయించుకుంటున్నారు. వీరికి రేస్క్లబ్లోనే ప్రత్యేకంగా కౌంటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమైతే వీరి వద్ద టికెట్లు కొని గుర్రాలపై పందెం కాసినా.. రేస్‌కోర్సు లెక్కలోకే వెళుతుంది. వీరికి కమీషన్ మాత్రం వస్తుంది. కానీ బుకీలు ఆడే ఆటకు, రేస్కోర్సుకు చూపించే ‘లెక్క’లకు కోట్లలో తేడా ఉంటుంది. రూ.500 పందెం కాస్తే రికార్డుల్లో రూ. 50గా ఉంటుంది. రూ.500కు మించి అధికారికంగా పందాలు కాయడానికి వీలు లేకపోవ డంతో దాన్ని ఆసరాగా చేసుకొని బుకీలు లావాదేవీలు సాగిస్తారు. పందెం లెక్కలు బుకీలకు, కాసిన వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఇక్కడే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
ఇక అక్రమ రవాణాకు ‘చెక్’
- చిరాగ్‌పల్లిలో అధునాతన చెక్‌పోస్టు - మహారాష్ట్ర ఉమర్గా తరహాలో నిర్మాణం - 9 ఎకరాల భూ సేకరణ... ప్రక్రియ వేగవంతం జహీరాబాద్: రాష్ట్రంలోకి ఎంట్రీ ఒకటే... కానీ చెక్‌పోస్టులు రెండు. కళ్లముందు నుంచి వెళుతున్న వాహనం తనిఖీ చేశారో లేదో తెలియని అయోమయం. దీన్ని అవకాశంగా తీసుకొని కళ్లుగప్పి జారుకుంటున్న సరుకు రవాణా వాహనదారులు. వాణిజ్య పన్నుల శాఖ అవస్థలు అన్నీఇన్నీ కావు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై వీటన్నింటికీ ‘చెక్’పెట్టేందుకు రంగం సిద్ధమయింది. తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల సరి హద్దులో అధునాతన సౌకార్యలతో జహీరాబాద్ సమీపంలోని చిరాగ్పల్లి వద్ద ‘సమీకృత చెక్‌పోస్ట్’ ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. జహీరాబాద్ సమీపంలోని చిరాగ్పల్లి వద్ద ఈ చెక్‌పోస్టును నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకు సర్వే నెం.87/2లో 9 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ కేటాయించింది. ప్రస్తుతం 65వ జాతీయ రహదారిని ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నందున... గుర్తించిన ప్రాం తంలో రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తి కాగానే చెక్‌పోస్టుల నిర్వహణ కోసం అవసరమైన భవనాలను నిర్మిం చేందుకు వాణిజ్య పన్నులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనిఖీల్లో ఇబ్బందులు... రెండున్నరేళ్ల కిందట ఈ చెక్‌పోస్ట్ నిర్మాణానికి వాణిజ్యపన్నుల శాఖ రూ.10 కోట్లతో ప్రతిపాదించింది. రాష్ట్ర సరిహద్దు గుండా రాకపోకలు సాగించే వాహనాల తనిఖీకి ఒకే చెక్‌పోస్టును వాణిజ్యపన్నుల శాఖ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 65వ జాతీయ రహదారిపై తగిన సౌకర్యాల లేకపోవడంతో సరిహద్దు దాటే వాహనాల తనిఖీ కోసం జహీరాబాద్ సమీపంలోని బీదర్ క్రాస్‌రోడ్డు వద్ద... రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాల తనిఖీ కోసం చిరాగ్పల్లి వద్ద వేరువేరుగా చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో గూడ్సు వాహనాల డ్రైవర్లు... సిబ్బంది కళ్లుగప్పి జారుకుంటున్నారు. వాటిని వెంబడిం చి తనిఖీ చేయలేని పరిస్థితి. దీనికి తోడు చెక్‌పోస్టుల వద్ద గోదాములు లేకపోవడంతో పన్ను చెల్లించని వాహనాలను సీజ్ చేసిన పక్షంలో, వాటిలో సరుకు ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌పల్లిలో సమీకృత చెక్‌పోస్ట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ పడింది. అన్నీ ఇక్కడే... ఈ సమీకృత చెక్‌పోస్టులో ఆరు శాఖలకు సంబంధించిన చెక్‌పోస్టులుంటాయి. వాణిజ్యపన్నులు, రోడ్డు రవాణా, ఎక్సైజ్, మార్కెటింగ్, అటవీ, పోలీసు శాఖలకు సంబంధించిన చెక్‌పోస్టులు ఒకేచోట ఏర్పాటు చేస్తారు. వచ్చి పోయే గూడ్స్ వాహనాలను సంబంధిత శాఖల అధికారులు తనిఖీ చేస్తారు. ఇందు కోసం వాహనాల్లోని సరుకును తూచేందుకు రెండు వేబ్రిడ్జిలను సైతం నిర్మిస్తారు. వాహనాల్లోని సరుకు తనిఖీ చేసేందుకు అధునాతన స్కానింగ్ యంత్రాలు సమకూరుస్తారు. సీజ్ చేసిన వాహనాల్లోని సరుకును నిల్వ చేసేందుకు రెండు పెద్ద గోదాములను నిర్మిస్తారు. మూడు విడతలుగా పనిచేసే చెక్‌పోస్టు సిబ్బంది కావల్సింది 20 ఎకరాలు... కోసం విశ్రాంతి గదులు కూడా కడతారు. వాస్తవానికి సమీకృత చెక్‌పోస్టుకు సుమారు 20 ఎకరాల భూమి అవసరం ఉండగా... ప్రస్తుతం 9 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన భూమి కూడా సమకూర్చే పనిలో అధికారులున్నారు. అక్కడలానే ఇక్కడా... మహారాష్ట్ర సరిహద్దు ఉమర్గా వద్ద ఉన్న చెక్పోస్టులానే ఇక్కడ కూడా నిర్మించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ ఉన్నతాధికారులు అక్కడి చెక్‌పోస్టును పరిశీలించి వచ్చారు. మంత్రులు కూడా వెళ్లి పరిశీలిస్తారని సమాచారం. చెక్‌పోస్టు వద్ద 12 లైన్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉంది. దీనివల్ల వాహనాల చెకింగ్లు సులువుగా సాగుతాయన్నది అధికారుల ఆలోచన. -
ఇదేం తీరు ?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు అధికారులను విస్మయపరుస్తోంది. తమ విధులు తమను చేసుకోనివ్వకుండా రాజకీయ లబ్ధికోసం అడ్డుపడటంపై అంతర్మధనం మొదలైంది. పలాస జీడివ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్న అధికారులను సాక్షాత్తూ అధికారపార్టీ నాయకులే అడ్డుపడటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలో ఓట్లేసినవారు ఎన్ని అక్రమాలకు పాల్పడినా వారిని రక్షించేస్తారా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అసలేం జరిగింది? వాణిజ్యపన్నులశాఖ విజయనగరం డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొన్నాళ్లనుంచి పలాసాలో జీడిపప్పు పరిశ్రమలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఓ అకౌంటెంట్ ఇంట్లో వ్యాపారులకు సంబంధించి సుమారు 100రికార్డుల్ని కూడా సీజ్ చేశారు. వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొడు తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు భావించిన ఆ శాఖ అధికారులు దాడుల్ని మరింత ఉథృతం చేయాలని ఆరు బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న వ్యాపారులు పలాస మునిసిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు సహా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషను ఆశ్రయించగా, ఆమె జిల్లా మంత్రితో మాట్లాడించి విజయనగరం అధికారులతో చర్చించి, అధికారులు వెనుదిరిగిపోయేలా చేశారు. అక్రమాలు అరికట్టమంటే... అక్రమాలు అరికట్టాలని... ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా చర్యలు చేపట్టాలని ఒకవైపు మంత్రులు చెబుతుంటే ఇక్కడి నేతలు ఇలా తమను అడ్డుకోవడంపై మనసులోనే కుమిలిపోతున్నారు. అంతేగాదు ఇతర వ్యాపారులు సైతం తమపైనా అధికారులు దాడు లు చేస్తే వాటినీ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైస్‌మిల్లుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని కొంతమంది వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌తో పాటు విజ యనగరం డీసీకి ఆకాశరామన్న లేఖ పంపించారు. ఇలా అక్రమాలు జరుగుతున్నాయని ఉప్పందుతుంటే వాటిని అరికట్టేందుకు అధికారులు ముందుకు ఉరికినా నేతల ఒత్తిళ్లు ఎదురవుతాయేమోనన్న సందిగ్ధం నెల కొంటోంది. ఈ నేపథ్యంలో జీడిపప్పు పరిశ్రమల కష్టాలు-అధికారుల దాడులకు సంబంధించి తాను చర్చిస్తానని, ఈ నెల 10వ తేదీన తనను కలవాలని జిల్లా కలెక్టర్..విజయనగరం డీసీని ఆదేశించడంపై కూడా చర్చ జరుగుతోంది. నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతే తాము ఉద్యోగం చేయలేమని కిందిస్థాయి సిబ్బంది కూడా అధికారుల దృష్టికి తెస్తున్నారు. శుక్రవారం జరిగిన సంఘటనపై డీసీ శ్రీనివాసరావు వద్ద సాక్షి ప్రస్తావించగా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, వ్యాపారుల అక్రమాల్ని అడ్డుకుంటామని చెప్పారు. -
అక్రమాస్తులపై ఏసీబీ కొరడా..
నల్లగొండలో వాణిజ్యపన్నులశాఖ డీసీ సాయికిషోర్ అరెస్ట్ హైదరాబాద్‌కు తరలింపు నల్లగొండ క్రైం : పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హల్చల్ సృష్టించారు. లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుపై నల్లగొండ-మహబూబ్‌నగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ నల్ల సాయికిషోర్‌ను గురువారం తెల్లవారుజామున పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని అద్దె ఇంట్లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సాయికుమార్ అక్రమాస్తుల కేసుపై అన్వేషణలో ఉన్న అధికారులు తెల్లవారుజామున ఒక్కసారిగా సాయికిషోర్ ఉంటున్న ఇంటిపై సోదాలను నిర్వహించారు. పలుడాక్యుమెంట్లను, విలువైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ముందు కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.60వేల నగదుతో పాటు ఇతర విలువైన పత్రాలను చేజిక్కించుకున్నారు. అక్రమాస్తులను లోతుగా తొవ్వి నిగ్గుతేల్చేందుకు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. సాయికిషోర్ సొంత జిల్లా అయిన కృష్ణాజిల్లాలోని తిరుపురంలో కూడా సోదాలు జరిగాయి. హైదరాబాదులోని గచ్చిబౌలి, లోయర్‌ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రెండు ఇళ్లు, సొంత జిల్లాలో చాపల చెరువులు, బినామీ ఆస్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. గతంలో పనిచేసిన గుంతకల్లు, గుంటూరు, మలక్‌పేటలోని ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటిలోని బ్యాలెన్స్‌లు తెలుసుకునేందుకు బ్యాంక్ అధికారులను సంప్రదించే పనిలో పడ్డారు. బంధువుల పేరున బ్యాంక్ బినామీ ఆస్తులున్నాయన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రాంతాల వారీగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. రాత్రి వరకు రూ. 3కోట్ల ఆస్తులున్నట్లు తెలుసుకుని దొరికిన ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని సాయికిషోర్ నివాసంలో వి చారణ కొనసాగుతుందని ఏసీబీ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
గ్రేటర్‌లోని ప్లైవుడ్ డీలర్లే సూత్రధారులు
రూ. 100 కోట్ల విలువైన ప్లైవుడ్ అక్రమ రవాణా ♦ కేరళ నుంచి హైదరాబాద్‌కు వందలాది లారీల్లో సాగిన దందా ♦ కంపెనీ రిజిస్ట్రేషన్ మొదలు సి-ఫారం, వేబిల్లులన్నీ నకిలీవే! ♦ గుర్తించిన వాణిజ్యపన్నుల శాఖ సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్లో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించి దొంగ సి-ఫారాలు, వే బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన ప్లైవుడ్‌ను దర్జాగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు ఇటీవలే రట్టయింది. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ రేవతి రోహిణిల పర్యవేక్షణలో 15 రోజుల పాటు నిఘా నిర్వహించి ఎట్టకేలకు అక్రమ ప్లైవుడ్ రవాణా దందా సూత్రధారులను కనుగొన్నారు. హైదరాబాద్‌లో పేరు మోసిన ప్లై వుడ్ డీలర్లే కొంతమంది పేర్లతో బోగస్ రిజిస్టర్డ్ డీలర్‌ను సృష్టించి, కేరళ నుంచి ఈ డీలర్‌కు వచ్చే ప్లైవుడ్‌ను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లుగా నకిలీ పత్రాలు తయారు చేసి, తమ దుకాణాల ద్వారా హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పన్నుల్లో భారీ కోత: త్రివేండ్రం, కొచ్చి తదితర నగరాల నుంచి హైదరాబాద్‌కు ప్లైవుడ్ రవాణా అవుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్లై వుడ్ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం చేసే వారు కేరళ నుంచి నేరుగా దిగుమతి చేయించుకుంటే 14.5 శాతం వ్యాట్ చెల్లించాలి. అదే కేరళలోని ప్లైవుడ్ కంపెనీతో సి- ఫారం ఉన్న రిజిస్టర్ డీలర్ లావాదేవీలు జరిపితే 2 శాతం పన్ను చెల్లిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు వాణిజ్యపన్నుల శాఖ రిజిస్ట్రేషన్లు, సి- ఫారాల జారీ, వేబిల్లులను సరళీం చేసేందుకు రూపొందించిన సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్(సీఆర్‌యూ)ను వినియోగించుకొన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా ‘ఫలానా ఎంటర్ప్రైజెస్’ అంటూ ఓ కంపెనీని రిజిస్టర్ చేయించి దొంగ సీ- ఫారాలు, వే బిల్లులు రూపొందించి కేరళలోని ప్లైవుడ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ బోగస్ డీలర్ పేర్లతో రోజూ కోట్ల విలువైన ప్లైవుడ్ కేరళ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లకు పంపుతున్నట్లు బిల్లులు రూపొందించి ఇతర జిల్లాలతో వ్యాపారం చేసేవారు. గుట్టు రట్టైంది ఇలా: కొన్నాళ్లుగా హైదరాబాద్‌కు ప్లైవుడ్ పెద్ద ఎత్తున రవాణా కావడం, పన్ను మాత్రం 2 శాతమే ఉండటంతో ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణి నిఘా విభాగాన్ని అప్రమత్తం చేశారు. కేరళ నుంచి ప్లైవుడ్‌ను దిగుమతి చేసుకుంటున్న డీలర్ వివరాలు ఆరా తీస్తే పేరు, ఫోన్ నంబర్, పాన్ నంబర్, టిన్, అడ్రస్ మొదలుకొని జరిగే వ్యాపారం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి అంతా మోసంగా తేలింది. దీంతో కేరళ నుంచి వస్తున్న లారీలపై నిఘా పెట్టి ఆన్లైన్ ద్వారా ఆపరేట్ చేస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్లో వివరాలను గుర్తించారు. దీంతో బండారం బయటపడింది. రూ. 100 కోట్ల విలువైన ప్లైవుడ్ 2 శాతం పన్నుతో కొంతకాలంగా రాష్ట్రానికి దిగుమతి అయినట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు గుర్తించారు. దిగుమతి అయిన ప్లైవుడ్‌పై వాణిజ్యపన్నుల శాఖ విధించిన పన్ను రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. -
బకాయిల బండ
వాణిజ్య పన్నుల శాఖలో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఒక్క నందిగామ డివిజన్‌లోనే రూ. 50 కోట్ల పన్నులు వసూలు కావాల్సిఉంది. విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతున్నాయి. పన్నుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. బకాయిలతో పాటు ప్రతి నెలా జమ పడాల్సిన పన్నులను వసూలుచేసే నాథుడే కనిపించడంలేదు. నెలవారీ మామూళ్లు దండిగా వసూలు చేసుకుంటున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ 1వ డివిజన్ పరిధిలో ఉన్న నందిగామ సర్కిల్లో భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్ల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల నుంచి మూడేళ్లుగా దాదాపు రూ.50 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమకాలేదు. నందిగామ సర్కిల్లో మెత్తం నాలుగు వేల మంది వ్యాట్ డీలర్లు, 2,500 మంది టర్నోవర్ టాక్స్ డీలర్లు ఉన్నారు. వ్యాట్ డీలర్లు ప్రతి నెలా తమ లావాదేవీలకు సంబంధించి రిటర్న్‌లు ఫైల్ చేయాలి. టర్నోవర్ టాక్స్ డీలర్లు మూడు నెలలకోసారి ఫైల్ చేస్తారు. డీసీటీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డీలర్లు సరిగా రిటర్న్‌లు ఫైల్ చేయడం లేదని సమాచారం. నందిగామ సర్కిల్ ప్రతి నెలా రూ.12 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమ కావాలి. అయితే అధికారులు ఏ నెలకు ఆ నెల వసూలు చేయకుండా బకాయిలను మరుగున పడేయడంతో అవి పేరుకుపోతున్నాయి. ఇటీవల నందిగామ సర్కిల్ పరిధిలో వెయ్యి మంది డీలర్లు రిటర్న్‌లు ఫైలు చేయకుండా రూ.12 కోట్ల మొత్తానికి ఎగనామం పెట్టి అదృశ్యమయ్యారు. ఇదిలా ఉండగా రిటర్న్‌లు దాఖలు చేసిన డీలర్లు కూడా సక్రమంగా పన్నులు చెల్లించక పోయినా సంబంధిత యూనిట్ల అధికారులకు చీమకూడా కుట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్లలో రూ.36 కోట్ల రిటర్న్‌లు ఫైల్ చేసిన డీలర్లు ప్రభుత్వానికి టాక్స్ బకాయి పడ్డారు. పాతబకాయిలు, రన్నింగ్ బకాయిలు కలిపి తడిసి మోపెడయ్యాయి. భవానీపురం యూనిట్లో ఫైళ్లు గల్లంతు భవానీపురం యూనిట్లో పాత బకాయిలకు సంబంధించి ఫైళ్లు గల్లంతయ్యాయని సమాచారం. దశాబ్దకాలంగా భవానీపురం యూనిట్లో బినామీ వ్యాపారాలు నకిలీ సంస్థలను స్థాపించి కోట్ల రూపాయల పన్నులు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు కనీసం ఫైళ్లు కూడా దొరకడం లేదని చెపుతున్నారు. ఇటీవల పాత ఇనుము అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి నందిగామ సర్కిల్ పరిధిలోని అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విజయవాడ భవానీపురం ఏరియాలో పాత ఇనుము వ్యాపారి గంగాధర్ ప్రభుత్వానికి రూ.25 కోట్ల పన్ను ఎగనామం పెట్టిన విషయం విదితమే. ఈ కేసులో నందిగామ సర్కిల్ పరిధిలో ముగ్గురు వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా నందిగామ సర్కిల్ పరిధిలో పేరుకుపోయిన బకాయిలపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో బకాయిల వ్యవహారం బట్టబయలైంది. -
దొరికితే దొంగలు.. లేకుంటే దొరలు..
కానూరు అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో తనిఖీలు పాపం పండి పట్టుబడిన గుడివాడ సీటీవో నగరంలోనూ కొందరు అధికారుల చేతివాటం విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో కొంద రు అధికారులు తమను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. జిల్లా లోనూ, నగరంలో కూడా వాణిజ్య పన్నుల శాఖలో అక్రమ వసూళ్ల దందాలు ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు చెపుతున్నారు. గుడివాడలో సీటీవో వి.వి.ఎస్.ఎల్. ప్రసాద్ ఓ రైస్‌మిల్లుకు వ్యాట్ లెసైన్స్ రద్దు కోసం దాని యజ మాని నుంచి రూ. 25వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ అధికారి అక్రమ వసూళ్లలో సిద్ధహస్తుడని డీలర్లు ఆరోపిస్తున్నారు. గత నాలుగేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఆయన తమను నానా అగచాట్లకు గురిచేసి డబ్బు వసూలు చేశారని చెపుతున్నారు. చివరకు పాపం పండి పట్టుబ డ్డా డంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు ఇలా అక్రమ వసూళ్లు చేస్తున్నారని పలు ప్రాంతాల డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీటీవోలే నేరుగా బేరాలు కుదుర్చుకు ని సొమ్ము వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో కొందరు సీటీవోలు డీలర్లను బెదిరించి డబ్బు దండుకుంటున్నట్లు ఆరోపణ లు వస్తున్నాయి. ఆడిట్లు, వాహనాల తనిఖీల్లోనూ దోపిడీ ప్రధానంగా విజయవాడలో ఆడిట్ల పేరుతో వేధింపులు పెచ్చు పెరిగాయంటున్నారు. ఆడిట్లో స్టాక్ వెరిఫికేషన్‌లో వ్యత్యాసం, అనామ తు స్లిప్పులు దొరికితే డిపార్టుమెంటులో పైనుంచి కింద వరకు అధికారులు రకరకాలుగా డబ్బు గుంజుకుని జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అధికారులు తమకు డబ్బు ఇవ్వని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. వి.టి.సి. (వెహికల్ ట్రాఫిక్ చెకింగ్)లో అక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. జీరో వ్యాపారులతో పలువురు సీటీవోలు, ఏసీటీవోలు చేతులు కలిపి వాహనా ల తనిఖీలను తూతూ మంత్రంగా చేస్తున్నట్లు సమాచారం. పప్పుధాన్యాలు, పంచదారను ఇతర రాష్ట్రాల వేబిల్లులతో విజయవాడలో రోజుకు వందల టన్నులు సరుకుని దింపి జీరో వ్యాపారం ముమ్మరంగా చేస్తున్నారు. అందుకు గాను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పచ్చజెండా ఊపి జీరో వ్యాపారుల నుంచి ఆరునె లలకు, ఏడాదికి ఇంతని ఒప్పందం కుదుర్చుకుని లక్షల్లో సొమ్ము తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక వేబిల్లుల జారీలో కూడా సీటీవోల చేతివాటం పెచ్చుమీరిందని డీలర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయం ద్వారా రోజు దేశంలోని వివిధ పట్టణాల నుంచి రకరకాల వస్తువులు అనామతుగా తరలి వస్తున్నా వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్యపన్నుల శాఖలో అధికారులు, ఉన్నతాధికారులు సైతం కొందరు అటెండర్లను ఏజెంట్లుగా పెట్టుకుని డబ్బు వసూళ్లు దండిగా చేయిస్తున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. పెనమలూరు : గుడివాడలో ఏసీబీ వలలో చిక్కిన కమర్షియల్‌టాక్స్ అధికారి(సీటీవో)ప్రసాద్‌బాబుకు మండలంలోని కానూరులో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐ కె.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ సీటీవో ప్రసాద్‌బాబు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు కానూరులో సీటీవో ప్రసాద్‌బాబు ఉంటున్న మనీష్ అపార్టుమెంట్ 401 ఫ్లాట్‌లో ఆ శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉండటాన్ని గుర్తించారు. ఎల్ఈడీ టీవీలు, బెడ్రూముల్లో విలువైన డబుల్‌కాట్ మంచాలు, లక్షలాది రూపాయ లు విలువచేసే సోఫాసెట్లు ఇలా అనేకం గుర్తించారు. పది బ్యాంక్ పాస్‌బుక్‌లు, రూ 65. వేల నగదు, 18 తులాల బంగారు ఆభరణాలు, తెనాలిలో ఎకరంన్నర పొలానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అపార్టుమెంట్, అందులో వస్తువుల విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఏసీటీవో భార్య వరలక్ష్మి సమక్షంలో పంచనామా చేసి వివరాలు నమోదు చేశారు. ప్రసాద్‌బాబు ఇద్దరు కుమారులు ఉన్నత చదువులు చదువుతున్నారు. పెద్దకుమారుడు ఈ ప్రాంతంలోనే ఎంబీబీఎస్, రెండో కుమారుడు కానూరులోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఇక ‘జీరో’యే!
దిగుమతులపై వాణిజ్య పన్నుల శాఖ ఆరా పన్నులు చెల్లించని వారిపై కొరడా తనిఖీలకు అధికారులు సిద్ధం సిటీబ్యూరో: ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ... గ్రేటర్ హైదరాబాద్‌లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ‘జీరో’ వ్యాపారంపై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు పన్ను చెల్లించకుండా... గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ గ్రేటర్ పరిధిలోని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 12 డివిజన్లకు గాను ఏడు గ్రేటర్‌లోనే విస్తరించి ఉండటంతో అత్యధిక రాబడి సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్, స్టీల్, ప్లాస్టిక్ ముడిసరుకులతో పాటు ఫుడ్ గ్రెయిన్స్ తదితర వస్తువులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి జీరో టాక్స్‌తో అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు. రాష్ర ్టసరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్, రైళ్లు, విమానాల ద్వారా వచ్చే వస్తువులను అడ్డుకునే ప్రత్యేక విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ వ్యాపారంతోనూ వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం తగ్గుతోందని భావిస్తున్నారు. ఇటీవల దిగుమతి అవుతున్న వస్తువుల మొత్తం విలువలో ఒక శాతం, 5 శాతం వ్యాట్ ఉన్న వాటికి ఇతర రాష్ట్రాల్లో వేస్తున్న పన్నుల వివరాలు సేకరించి, అవసరమైతే కొన్నిటిని 14.5 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని వాణిజ్య పన్నుల శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు సిద్ధం గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య శాఖ ఆదాయం తగ్గుముఖం పట్టింది. జీరో దందాతో వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ క్షీణించింది. ఫలితంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖ రాబడి మందగిస్తునట్లయింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చే మొత్తం రాబడిలో 74 శాతం నగరం నుంచే జమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో అత్యధిక ఆదాయం సమకూరే గ్రేటర్లో జీరో దందాకు అడ్డుకట్ట వేసేందుకు, ఇందులో భాగంగా ముమ్మర తనిఖీలకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. -
వ్యాట్ నష్టం 30 కోట్లు
పన్ను ఎగవేసిన 70 మంది బిల్డర్లు ప్రభుత్వ శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఖాజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. వివిధ శాఖలు అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తలంటుపోసింది. అధికారుల హస్తలాఘవం, నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని చీవాట్లు పెట్టింది. పౌర సరఫరాలు, విద్యుత్, పింఛన్లు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి అన్ని విషయాల్లోనూ ఇదే తంతుగా ఉందని లోపాలను ఎత్తిచూపింది. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్మించిన భవనాలకు సంబంధించి 2013 మార్చి నుంచి మే మధ్యలో 70 మంది బిల్డర్లు వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూ. 30.78 కోట్ల మేర ఎగవేసినట్లు కాగ్ తేల్చింది. బిల్డర్లు తాము నిర్మించే కట్టడాల వల్ల పొందిన ప్రతిఫలంలో 25 శాతం మీదగాని, స్టాంపు డ్యూటీ చెల్లింపునకు నిర్ణయించిన మార్కెట్ విలువలో గానీ 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎస్ఆర్ నగర్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసిన 70 మంది బిల్డర్లను ఇంటర్నెట్ ద్వారా గుర్తించిన కాగ్ తనిఖీలు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ 70 మంది బిల్డర్లు తక్కువ స్టాంపు డ్యూటీతో ఏడు రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్టర్ చేసి ఆ విలువ ఆధారంగా వ్యాట్ చెల్లింపులు జరిపినట్లు గుర్తించింది. ఈ క్రమంలో రూ. 30.78 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు గుర్తించి వాణిజ్య పన్నుల శాఖకు, ప్రభుత్వానికి 2013 ఆగస్టులోనే తెలియజేసినట్లు కాగ్ స్పష్టం చేసింది. కాగ్ పరిశీలనలో తేలిన అంశాలు - వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వే బిల్లులను పరిశీలించడం లేదు, అడ్వాన్స్ వే బిల్లులు పంపడం లేదు - వ్యాట్ డీలర్లు సమర్పించిన టర్నోవర్ వివరాలకు, చెక్‌పోస్టుల వద్ద ఉన్న జీఐఎస్ సమాచారంతో సరిపోలిస్తే 2012 నవంబర్ నుంచి 2013 మే మధ్య వేల కోట్ల రూపాయల తేడా ఉన్నట్లు తేలింది. - తప్పుడు డిక్లరేషన్లపై పన్ను తక్కువ విధింపు, జరిమానాలు విధించకపోవడం - అంతర్రాష్ట్ర కొనుగోళ్లలో సీ ఫారాల దుర్వినియోగంపై జరిమానాలు విధించకపోవడం - చెల్లని సీ-ఫారాలను అనుమతించడం ద్వారా పన్ను రాయితీ ఇవ్వడం ఆర్టీసీకి టోల్ నష్టం క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండానే ఆర్టీసీ డీపీఆర్ తయారు చేసిందని, కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లు రాకముందే రుణంగా తెచ్చిన నిధులతో బస్స్టాండ్లు, టెర్మినల్స్ నిర్మించడంతో నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సిన యూజర్ ఫీజును టోల్‌టాక్స్‌కు అనుగుణంగా సవరించకపోవటంతో 2010 ఏప్రిల్ నుంచి 2013 మే వరకు రూ. 50.69 కోట్లను ఆర్టీసీ నష్టపోయిందని తెలిపింది. 2012 నుంచి జిల్లాల్లో రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాల మీద టోల్ చార్జీలపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఆర్టీసీ తమ బస్సులన్నింటినీ హైదరాబాద్‌లో రిజిస్టర్ చేయించటంతో ఈ రాయితీని కోల్పోయినట్లయింది. 2011లో పూర్తయిన కోఠి బస్సు టెర్మినల్స్‌లో వాణిజ్య సముదాయాన్ని లీజుకు ఇవ్వటం ఆలస్యం కావటంతో ఆర్టీసీ రూ. 29.02 కోట్లను కోల్పోయింది. వాహనాల పన్ను హుష్‌కాకి ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మోటారు వాహనాల పన్ను వసూళ్లలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నట్లు కాగ్ తేల్చింది. 2012 ఏప్రిల్-2013 మార్చి మధ్య రవాణాశాఖ కార్యాలయాల్లో పలు రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఇది వెల్లడైందని తెలిపింది. ‘‘వీటి పరిధిలో 6,447 మంది వాహనదారులు రూ. 10.32 కోట్ల త్రైమాసిక పన్ను ఎగ్గొట్టినట్టు తేలింది. కనీసం వారికి నోటీసులు కూడా పంపలేదు. జరిమానాగా వసూలు చేయాల్సిన రూ. 20.65 కోట్లనూ పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బకాయిలు రూ. 36.76 కోట్ల వరకు ఉన్నట్టు తేలింది’’ అని వెల్లడించింది.