‘సినిమా’ చూపిస్తున్నారు!
భారీగా వినోద పన్ను ఎగవేత
థియేటర్ యాజమాన్యాల ఇష్టారాజ్యం
ఏడాదికి రావల్సింది రూ.222 కోట్లు
వసూలవుతున్నది రూ.30 కోట్లు
సిటీబ్యూరో:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు టికెట్ తీసుకుంటూ ప్రేక్షకులకు సినిమా చూపిస్తుంటే.. వినోద పన్ను ఎగ్గొట్టడం ద్వారా వాణిజ్య పన్నుల శాఖకు... జీహెచ్‌ఎంసీకి సినిమా చూపిస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడడం... జీహెచ్‌ఎంసీ అధికారుల ఉదాసీనతతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.200 కోట్లకు పైగా గండి పడుతోంది. సినిమా టికెట్ ధరలో 20 శాతం వినోద పన్ను కింద వసూలు కావలసి ఉండగా... రెండు శాతానికి మించి వసూలవుతున్న దాఖలాలు లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 సర్కిళ్లలో 164 సినిమా థియేటర్లు ఉన్నాయి. మొత్తం థియేటర్ల సిట్టింగ్ సామర్ధ్యం సుమారు 1.50 లక్షలుగా అంచనా. థియేటర్ యాజమాన్యాల నుంచి వాణిజ్య పన్నుల శాఖ వినోద పన్ను వసూలు చేసి... స్థానిక సంస్థ జీహెచ్‌ఎంసీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖాధికారులలోని కొందరి అక్రమాలు.. పర్యవేక్షణ లోపంతో థియేటర్ యాజమాన్యాలు తప్పుడు లెక్కలతో వినోద పన్నును ఎగ్గొడుతున్నాయి. శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో 20 నుంచి 40 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నట్లు లెక్కలు చూపిస్తున్నట్లు వాణిజ్య పన్నుల అధికారులు చెబుతున్నారు. మరికొన్ని థియేటర్లు లోబడ్జెట్ సినిమాలంటూ పన్ను ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది.
మేల్కొన్న జీహెచ్‌ఎంసీ..
జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం ఏటా సుమారు రూ. 222 కోట్లకు పైగా ఆదాయం వినోద పన్ను కింద రావలసి ఉంది. ప్రస్తుతం రూ.30 కోట్ల నుంచి 35 కోట్లు మాత్రమే రావడాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతుండటంతో క మిషనర్ సోమేశ్ కుమార్ చర్యలకు ఉప్రకమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో గురువారం నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో రెండు శాఖల సంయిక్త సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, స్పెషల్ కమిషనర్ బాబు అహ్మద్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్లు, ఇతర అధికారులు సమావేశమయ్యారు. ఏవిధంగా పన్ను రాబట్టాలనే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే...
{పతి సినిమా హాల్‌లో ప్రదర్శనప్రారంభమైన అరగంట అనంతరం ఎన్ని సీట్లు నిండాయన్న సమాచారం సంబంధిత యాజమన్యాలు సంబంధిత నెంబర్‌కు ఎంఎంఎస్ పంపాలి. ఇది జీహెచ్‌ఎంసీ సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానంగా ఉంటుంది.జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది సినిమా హాళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, నిండిన సీట్లు, ఎంఎంఎస్ ద్వారా వచ్చిన సమాచారంతో సరిపోల్చాలి.
{పస్తుతం పేర్కొంటున్న సీట్లు, వసూలు చేసే రేట్లను పరిశీలించాలి. వినోదకార్యక్రమాలకు టికెట్లు వసూలు చేసే సంస్థలపై దృష్టి పెట్టి, పన్ను వసూలు చేయాలి. {Vేటర్ పరిధిలో ఉన్న రిసార్టులు, క్లబ్‌లు, ఫంక్షన్ హాళ్లలో నిర్వహించే వినోద కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. వినోదాత్మక ఈవెంట్లను నిర్వహించే వాటిపై జీహెచ్‌ఎంసీ, వాణిజ్య పన్నుల అధికారులు సంయిక్తంగా తనిఖీలు నిర్వహించాలి.