సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం క్షీణించినా రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో జీఎస్‌టీ ఆదాయం గతేడాది కంటే రూ.35.35 కోట్లు పెరిగి రూ.1,998.12 కోట్లకు చేరుకుంది.
► గతేడాది ఇదే కాలానికి జీఎస్‌టీ ఆదాయం రూ.1,962.77 కోట్లుగా ఉంది.
► దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో జీఎస్‌టీ ఆదాయం 14.36 శాతం క్షీణించి రూ.1,02,082 కోట్ల నుంచి రూ.87,422 కోట్లకు పడిపోయింది.
► రాష్ట్రంలో ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో జీఎస్‌టీ ఆదాయం పెరిగిందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ తెలిపారు.
► లాక్‌డౌన్ సమయంలో 75 శాతం ఆదాయం కోల్పోయినా ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలు గు నెలల్లో ఆ నష్టం 25 శాతానికి తగ్గిందన్నారు.
► ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం రూ.5,508.49 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి రూ.7,345.69 కోట్లుగా ఉంది.
► రీస్టార్ట్ తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది.
► జూలైలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.852.97 కోట్లు వస్తే గతేడాది ఇదే కాలానికి రూ.859 కోట్లుగా ఉంది.
► కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రూ.2,713 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.3,521 కోట్లుగా ఉంది.
జీఎస్‌టీ ఆదాయంలో వృద్ధి
Published Mon, Aug 3 2020 5:19 AM | Last Updated on Mon, Aug 3 2020 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment