- ‘ఉద్యోగుల పంపిణీ’పై హైకోర్టును కోరాలని ఏపీ, తెలంగాణ నిర్ణయం
- కమలనాథన్ కమిటీ భేటీలో ఇరు రాష్ట్రాలు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ కేసులు.. ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలంటూ ఉమ్మడి హైకోర్టును అభ్యర్థించాలని తెలంగాణ, ఏపీ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీలు)కు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు లేఖలు రాయనున్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కమలనాథన్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో పాటు రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.
డిప్యూటీ కలెక్టర్ల తాత్కాలిక పంపిణీపై గతంలో ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. అయితే స్టే సంగతి తెలియని కమలనాథన్ కమిటీ.. రెండు రాష్ట్రాలకు డిప్యూటీ కలెక్టర్లను తాత్కాలికంగా పంపిణీ చేసింది. పంపిణీ తర్వాత స్టే సంగతి తెలియడంతో.. నోటిఫై చేయకుండా నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీకి స్టే అడ్డంకిగా ఉన్నందున.. త్వరగా కేసును పరిష్కరించాలని ఇరు రాష్ట్రాలు ఏజీల ద్వారా ఉమ్మడి హైకోర్టుకు విజ్ఞప్తి చేయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీల తుది పంపిణీపై స్టేను కూడా త్వ రగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఆ లోగా అభ్యంతరాలు లేని డీఎస్పీలను రిలీవ్ చేసేందుకు ఆస్కారం ఉం టుందేమో న్యాయ పరిశీలన చేయాలని ఇరు రాష్ట్రాల ఏజీలకు సీఎస్‌లు సూచించారు.
ఇప్పటికే ఏపీలో తెలంగాణకు చెందిన 41 మంది ఎస్‌వోలుండటంతో.. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన వారిని చేర్చుకోవడానికి ఏపీలో పోస్టులు లేవు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను త్వరగా పరిష్కరించి తుది కేటాయింపులు పూర్తి చేయాలని కోరుతూ కేంద్రానికి ఫైలు పంపించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా కమలనాథన్ కమిటీ గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది.
త్వరగా పరిష్కరించండి
Published Tue, Aug 30 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
Advertisement
Advertisement