మాతృ జిల్లాల్లోనే రికార్డులు | Records in of Parent district | Sakshi
Sakshi News home page

మాతృ జిల్లాల్లోనే రికార్డులు

Published Sun, Oct 2 2016 4:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

మాతృ జిల్లాల్లోనే రికార్డులు

మాతృ జిల్లాల్లోనే రికార్డులు

కొత్త జిల్లాలకు స్కానింగ్ కాపీలు  సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం

సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా మాతృ జిల్లాల్లో ఉన్న ఒరిజనల్ రికార్డులను ఆయా జిల్లాల్లోనే భద్రపరిచి, కొత్త జిల్లాలకు అవసరమైన రికార్డులను స్కానింగ్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో నూతన జిల్లాల ఏర్పాటుపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

కొత్త జిల్లాలు ఏర్పాటైన రోజు నుంచే ప్రతి శాఖ తమ కార్యాలయాలు ప్రారంభించి, కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లలో నూతన పోస్టుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement