సచివాలయం తరలింపు పనులు షురూ..
Published Thu, Oct 20 2016 6:39 PM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం తరలింపు పనులు వేగవంతమయ్యాయి. ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవనాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం పరిశీలించారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వివిధ శాఖలకు అనువైన భవనాలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా కొత్త సచివాలయ పనులను ప్రారంభించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భవనాలను పరిశీలించిన వారిలో సీఎస్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement