ముఖ్యమంత్రి కేసీఆర్తో బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ సీఎస్ కూడా సమావేశం అయ్యారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ సీఎస్ కూడా సమావేశం అయ్యారు. మెట్రో ప్రాజెక్ట్పై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన ఈ సందర్భంగా కేసీఆర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా అంతకు ముందు మెట్రో ఎండీ, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. మరోవైపు కేసీఆర్ తీరు వల్లే మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటామంటోందని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై మెట్రో ఎండీ వివరణ ఇస్తూ మెట్రో ప్రాజెక్ట్ పనులు ఆగిపోలేదని, కొనసాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు.