'కొత్త నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలి' | cs rajiv sharma meeting with central team over currency demonetization problems | Sakshi
Sakshi News home page

'కొత్త నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలి'

Published Wed, Nov 23 2016 2:56 PM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

'కొత్త నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలి' - Sakshi

'కొత్త నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలి'

హైదరాబాద్ : కొత్త రూ.500 నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర బృందాన్ని కోరారు. నోట్ల రద్దుతో తలెత్తిన పరిణామాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా హైదరాబాద్లో బుధవారం జరిగిన సమావేశానికి సీఎస్తో పాటు ఆర్బీఐ, పలు బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.

నోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి వివరించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుదలపై శాఖలవారీగా నివేదికలు సమర్పించారు. వ్యవసాయ అవసరాలతో పాటు ప్రభుత్వ చెల్లింపులకు పాత నోట్లను అనుమతించాలని రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement