ఇందూరు (నిజామాబాద్ అర్బన్): బాలికల లింగ నిష్పత్తిని పెంపొందించడం, వారిపై వివక్షను నిరోధించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో బేటీ బచావో పథకం జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల లింగ నిష్పత్తి తగ్గడానికి మహిళలకు స్వయం సాధికారత లేకపోవడం ఒక కారణమన్నారు. ఆడపిల్ల పుట్టిన తరువాత పౌష్టికాహారం, విద్యను అందించడంలో వివక్ష చూపుతున్నారని అన్నారు. సామాజిక రు గ్మతలు, లింగ నిర్ధారణ స్కానింగ్ సెంట ర్లు కూడా బాలికల నిష్పత్తి తగ్గడానికి కార ణాలు అవుతున్నాయని అన్నారు. 2011 సంవత్సరం జనాభా ప్రకారంగా వెయ్యి మంది పురుషులకు గాను 918 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. బాలికల నిష్పత్తిని పెంపొందించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని, అందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు తమవంతుగా కృషి చేయాలన్నారు.
జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాలికల దశలో తక్కువగా ఉన్నారన్నారు. నిష్పత్తి సమానం కావాలంటే మహిళలు విద్య పరంగా ఎదగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 950 నిష్పత్తి కంటే తక్కువగా ఉన్న 640 జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. అందులో మన జిల్లా 945 నిష్పత్తితో ఉన్నట్లు వివరించారు. లింగ వివక్షను తగ్గించడానికి కొత్త పెళ్లి జంటలు, గర్భిణులు, తల్లులు, యువతీ యువకులు, వైద్యులు, డయాగ్నోసిస్ సెంటర్‌ల నిర్వహకులకు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అవగాహన ప్రచార సామగ్రి, విద్య, వైద్యం, ఇతర అంశాలను చేపట్టేందుకు రూ.50 లక్షలతో ప్రణాళికను టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ స్రవంతి, రవీందర్, డీఈఓ రాజేశ్, డీఎంఅడ్‌హెచ్‌ఓ సుదర్శనం, డీపీఓ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా డోలోత్సవం
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహుడి ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా డోలోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి అనంతరం స్వామివారికి అభిషేకం చేసి డోలోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి ప్రభు, అర్చకులు శ్రీనివాసచార్యులు, నర్సింహాచార్యులు, పరందామచార్యులు, సిబ్బంది సంతోష్, బాలయ్య, రమేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment