మున్సిపాలిటీల్లో క్యాష్‌లెస్ విధానం
ఇందూరు : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముందుగా నగదు రహిత లావాదేవీలు జరగాల్సిందేనని కలెక్టర్ యోగితా రాణా స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో క్యాష్‌లెస్ విధానం ఏ విధంగా జరుగుతుందో కలెక్టర్ సమీక్షించారు. మున్సిపాలిటీల పరిధిలోని 90 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. ఈ నెల 22లోగా ప్రతి కుటుంబంలో క్యాష్‌లెస్ లావాదేవీలు చేయించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.
రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో టీవోటీలకు క్యాష్‌లెస్‌పై రెండోరోజు అవగాహన కల్పించారు. లంచాలు, అవినీతి ని అరికట్టాలంటే నగదు రహిత చెల్లింపులు ముఖ్యమన్నారు. క్యాష్‌లెస్‌పై బ్యాంకు మిత్ర, పంచాయతీ కార్యదర్శులతోనూ కలెక్టర్ మాట్లాడారు