సర్వే నాలుగు రోజుల్లో పూర్తి కావాలి
సర్వే నాలుగు రోజుల్లో పూర్తి కావాలి
Published Tue, Feb 28 2017 1:07 AM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM
అనంతపురం అర్బన్ : ‘ప్రజాసాధికార సర్వేలో మీ పనితీరు సంతృప్తిగా లేదు. సర్వే ఇంత జాప్యం చేస్తే ఎలా..? నాలుగు రోజుల్లో వంద శాతం సర్వే పూర్తవ్వాలి. లేకపోతే చర్యలు తప్పవు’ అని మున్సిపల్ అధికారులను, సిబ్బందిని జాయింట్ కలెక్టర్ బి.లక్మీకాంతం హెచ్చరించారు. సోమవారం ఆయన డ్వామా హాల్‌లో ప్రజాసాధికార సర్వేపై ఆర్‌డీఓ మలోలాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ జనాభా 2.73 లక్షలు ఉంటుందని, ఇప్పటి వరకు ఎంత మేర సర్వే పూర్తి చేశారని ప్రశ్నించారు. ఇందుకు అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి మాట్లాడుతూ 2.04 లక్షలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన జనాభాలో శాశ్వతంగా వలసలు వెళ్లిన వారి, మృతుల సంఖ్య వివరాలను మంగళవారం సాయంత్రంలోగా ఇవ్వాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్షి్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement