in four days
-
‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’
భోపాల్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. -
రాగల నాలుగు రోజుల్లో వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 6 నుంచి 10 తేదీ వరకు 10 నుంచి 22 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీలు, కనిష్టం 21 నుంచి 22 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 83 నుంచి 87, మధ్యాహ్నం 64 నుంచి 66 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. -
నాలుగు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై 4 నుంచి 12 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 68, మధ్యాహ్నం 54 నుంచి 58 శాతం మధ్య ఉండొచ్చన్నారు. గంటకు 11 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
సర్వే నాలుగు రోజుల్లో పూర్తి కావాలి
అనంతపురం అర్బన్ : ‘ప్రజాసాధికార సర్వేలో మీ పనితీరు సంతృప్తిగా లేదు. సర్వే ఇంత జాప్యం చేస్తే ఎలా..? నాలుగు రోజుల్లో వంద శాతం సర్వే పూర్తవ్వాలి. లేకపోతే చర్యలు తప్పవు’ అని మున్సిపల్ అధికారులను, సిబ్బందిని జాయింట్ కలెక్టర్ బి.లక్మీకాంతం హెచ్చరించారు. సోమవారం ఆయన డ్వామా హాల్లో ప్రజాసాధికార సర్వేపై ఆర్డీఓ మలోలాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ జనాభా 2.73 లక్షలు ఉంటుందని, ఇప్పటి వరకు ఎంత మేర సర్వే పూర్తి చేశారని ప్రశ్నించారు. ఇందుకు అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి మాట్లాడుతూ 2.04 లక్షలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన జనాభాలో శాశ్వతంగా వలసలు వెళ్లిన వారి, మృతుల సంఖ్య వివరాలను మంగళవారం సాయంత్రంలోగా ఇవ్వాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్షి్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశలన్నీ అల్ప పీడనంపైనే..!
కొవ్వూరు : జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాట్లు వేసే అవకాశం లేక 45 వేల ఎకరాల్లో వరి సాగుకు స్వస్తి పలికినా చలించడం లేదు. ఈ పరిస్థితుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంపైనే జిల్లా రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా గడచిన రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. రెండు నెలల్లో అంతంతే.. జూన్‌లో మురిపించిన వర్షాలు జూలై, ఆగస్టు నెలల్లో అంతంతమాత్రంగానే కురిశాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి. రెండు నెలల్లోనూ వర్షాలు కురిసి ఉంటే డెల్టాలోనూ సాగునీటి కష్టాలు తప్పేవి. ఈశాన్య రుతు పవనాలు పూర్తిగా మొహం చాటేయడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి అల్పపీడనంగా మారనున్నట్టు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం దీని ప్రభావంతో అయినా వర్షాలు కురిస్తే పంట లను కాపాడుకోవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న నాలుగు రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం డెల్టాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పెరవలి, ఉండ్రాజవరం, తణుకు అత్తిలి, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో జల్లులు కురిశాయి. మెట్ట మండలాల్లో జడివాన కురిసింది. సరాసరి వర్షపాతం 5.4 మిల్లీమీటర్లు జిల్లాలో జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు 573 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 458.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో 5.4 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. కొవ్వూరులో గరిష్టంగా 46.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా జీలుగుమిల్లి, నల్లజర్లలో 1.6 మిల్లీమీటర్ల చొప్పున కురిసింది. గోపాలపురంలో 38.4, కొయ్యలగూడెంలో 18.2, జంగారెడ్డిగూడెంలో 15.6, బుట్టాయగూడెంలో 7.4, ద్వారకాతిరుమలలో 24.2, టి.నరసాపురంలో 8.4, చింతల పూడిలో 5.4, కామవరపుకోటలో 11.6, లింగపాలెంలో 12.4, చాగల్లులో 18.2, దేవరపల్లిలో 9.6, తాళ్లపూడిలో 2.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.