అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 6 నుంచి 10 తేదీ వరకు 10 నుంచి 22 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీలు, కనిష్టం 21 నుంచి 22 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 83 నుంచి 87, మధ్యాహ్నం 64 నుంచి 66 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.