
గుజరాత్:గుజరాత్‌లో అమానవీయ ఘటన జరిగింది. పిల‍్లాడు బంతిని పట్టుకున్నాడని.. ఓ దళిత వ్యక్తి వేలు కోసేశారు. పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. మైదానం చివర కూర్చుని ఓ పిల్లాడు ఆటను చూస్తున్నాడు. ఈ క్రమంలో బంతి అతని వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని పట్టుకున్నాడని కొంతమంది అతన్ని హీనంగా దూషించారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానపరిచారు. పిల్లాడి మేనమామ ధీరజ్ పర్మర్ వారిని వారించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. కానీ సాయంత్రం నిందితులు కత్తులతో వచ్చి ధీరజ్, అతని సోదరుడు కిర్టీపై వాగ్వాదానికి దిగారు. అనంతరం కిర్టీ వేలును కత్తిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి