chopped off
-
బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు..
గుజరాత్:గుజరాత్లో అమానవీయ ఘటన జరిగింది. పిల్లాడు బంతిని పట్టుకున్నాడని.. ఓ దళిత వ్యక్తి వేలు కోసేశారు. పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. మైదానం చివర కూర్చుని ఓ పిల్లాడు ఆటను చూస్తున్నాడు. ఈ క్రమంలో బంతి అతని వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని పట్టుకున్నాడని కొంతమంది అతన్ని హీనంగా దూషించారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానపరిచారు. పిల్లాడి మేనమామ ధీరజ్ పర్మర్ వారిని వారించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. కానీ సాయంత్రం నిందితులు కత్తులతో వచ్చి ధీరజ్, అతని సోదరుడు కిర్టీపై వాగ్వాదానికి దిగారు. అనంతరం కిర్టీ వేలును కత్తిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
ఘోరం: వాటి కోసం మహిళ కాళ్లను నరికి.. ఆపై..
జైపూర్: కడియాల కోసం కొందరు దొంగలు ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లను నరికి, ఆపై హత్య చేశారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని చోటు చేసుకుంది. మృతురాలిని కంకుబాయిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. చార్భుజా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కంకుబాయి తన భర్తకు భోజనం పెట్టేందుకు తను ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కంకుబాయి తన భర్త పనిచేస్తున్న పొలానికి చేరుకోలేదు. దీంతో మహిళ భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన పిల్లలను కంకుబాయి ఎక్కడ అని అడిగాడు. కంకుబాయి ఉదయాన్నే పొలానికి ఆహారం తీసుకుని తన దగ్గరకే వచ్చిందని అతని పిల్లలు చెప్పారు. దీంతో మహిళ భర్త, బంధువులు, స్థానికులు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో చరభుజ పోలీస్ స్టేషన్లో మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తరువాత ఓ వ్యవసాయ పొలం వద్ద కంకుభాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కడియాల కోసం ఆమె కాళ్లు నరికివేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలించే క్రమంలో మెడపై కూడా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు పేర్కొన్నారు. వెండి కడియాల కోసమే ఆమె కాళ్లను దొంగలు నరికినట్లు పోలీసుల విచారణలో తేలింది. పాదాలు నరికిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం ఇదే తొలిసారి కాదు. జైపూర్‌లో కొద్ది రోజుల క్రితం, పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ శవమై కనిపించింది. ఆమెను కూడా ఈ రకంగానే హత్య చేశారు. చదవండి: నటిపై దాడి: ఆపై నాలుగు గంటలు అక్కడే ఎందుకు ఉన్నట్లు? -
వివాహేతర సంబంధం : ముక్కులు కోసేసారు
అయోధ్య: వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న నెపంతో ఒక జంట ముక్కులు కోసి పారేసిన ఘటన కలకలం రేపింది. రామాయణంలో శూర్పణఖ ఘటనను గుర్తు చేసిన ఈ ఉదంతం అయోధ్య జిల్లాలోని కంద్ పిప్రా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులిద్దరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం, 23 ఏళ్ల వ్యక్తి వివాహిత మహిళ (30)తో సంబంధం పెట్టుకున్నాడు. (ఆ మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు) మంగళవారం, సదరు వ్యక్తి మహిళ ఇంటికి వచ్చినపుడు. అప్పటికే పథకం ప్రకారం మాటు వేసిన మహిళ మావ, బావ ఇతర కుటుంబ సభ్యులు ఆ జంటని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. అనంతరం వారి ముక్కులు కోసేసారు. ఆ తర్వాత ఆ జంటను ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే వుందని పోలీసు అధికారి ఆశిష్ తివారీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అలాగే బాధితులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాన్ని మోహరించినట్టు తెలిపారు. -
పొలంలో మూత్రం పోశాడని.. బాలుడి మర్మాంగం కోసివేత
లక్నో: ఉత్తరప్రదేశ్ అత్యాచారాలు, నేరాలతో అట్టుడికిపోతోంది. మహిళా జడ్జిపై అత్యాచారం చేసి హత్యాయత్నం జరగా, మరో విషాదకర, ఒళ్లు జలదరించే సంఘటన వెలుగుచూసింది. పొలంలో మూత్రం పోశాడనే కారణంతో దాని యజమాని అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడి మర్మంగాన్ని కోసేశాడు. ప్రతాప్‌గఢ్ జిల్లా కొరాలి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇటుక బట్టీ కార్మికుడు శేష్‌రామ్ కొడుకు రితేష్ మంగళవారం సాయంత్రం మూత్ర విసర్జనకు ఓ పొలానికి వెళ్లాడు. ఈ కుర్రాడిని చూసిప పొలం యజమాని విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. రితేష్‌ను చావబాదడంతో పాటు అతని మర్మాంగాన్ని కత్తరించాడు. రక్తస్రావం అవుతున్నా ఈ అబ్బాయి కష్టమ్మీద ఇంటికి చేరుకున్నాడు. రితేష్‌ను వెంటనే చికిత్స నిమిత్తం అలహాబాద్‌కు తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పొలం యజమాని దుర్గేష్ మౌర్య, అతని కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.