పొలంలో మూత్రం పోశాడని.. బాలుడి మర్మాంగం కోసివేత | 5-year-old's penis chopped off | Sakshi
Sakshi News home page

పొలంలో మూత్రం పోశాడని.. బాలుడి మర్మాంగం కోసివేత

Published Wed, Jun 4 2014 5:17 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

పొలంలో మూత్రం పోశాడని.. బాలుడి మర్మాంగం కోసివేత - Sakshi

పొలంలో మూత్రం పోశాడని.. బాలుడి మర్మాంగం కోసివేత

లక్నో: ఉత్తరప్రదేశ్ అత్యాచారాలు, నేరాలతో అట్టుడికిపోతోంది. మహిళా జడ్జిపై అత్యాచారం చేసి హత్యాయత్నం జరగా, మరో విషాదకర, ఒళ్లు జలదరించే సంఘటన వెలుగుచూసింది. పొలంలో మూత్రం పోశాడనే కారణంతో దాని యజమాని అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడి మర్మంగాన్ని కోసేశాడు. ప్రతాప్గఢ్ జిల్లా కొరాలి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

ఇటుక బట్టీ కార్మికుడు శేష్రామ్ కొడుకు రితేష్ మంగళవారం సాయంత్రం మూత్ర విసర్జనకు ఓ పొలానికి వెళ్లాడు. ఈ కుర్రాడిని చూసిప పొలం యజమాని విచక్షణ రహితంగా ప్రవర్తించాడు.  రితేష్ను చావబాదడంతో పాటు అతని మర్మాంగాన్ని కత్తరించాడు. రక్తస్రావం అవుతున్నా ఈ అబ్బాయి కష్టమ్మీద ఇంటికి చేరుకున్నాడు. రితేష్ను వెంటనే చికిత్స నిమిత్తం అలహాబాద్కు తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పొలం యజమాని దుర్గేష్ మౌర్య, అతని కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement