ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: కడియాల కోసం కొందరు దొంగలు ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లను నరికి, ఆపై హత్య చేశారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని చోటు చేసుకుంది. మృతురాలిని కంకుబాయిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. చార్‌భుజా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కంకుబాయి తన భర్తకు భోజనం పెట్టేందుకు తను ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కంకుబాయి తన భర్త పనిచేస్తున్న పొలానికి చేరుకోలేదు. దీంతో మహిళ భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన పిల్లలను కంకుబాయి ఎక్కడ అని అడిగాడు. కంకుబాయి ఉదయాన్నే పొలానికి ఆహారం తీసుకుని తన దగ్గరకే వచ్చిందని అతని పిల్లలు చెప్పారు.
దీంతో మహిళ భర్త, బంధువులు, స్థానికులు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో చరభుజ పోలీస్ స్టేషన్‌లో మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తరువాత ఓ వ్యవసాయ పొలం వద్ద కంకుభాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కడియాల కోసం ఆమె కాళ్లు నరికివేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలించే క్రమంలో మెడపై కూడా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు పేర్కొన్నారు. వెండి కడియాల కోసమే ఆమె కాళ్లను దొంగలు నరికినట్లు పోలీసుల విచారణలో తేలింది. పాదాలు నరికిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం ఇదే తొలిసారి కాదు. జైపూర్‌లో కొద్ది రోజుల క్రితం, పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ శవమై కనిపించింది. ఆమెను కూడా ఈ రకంగానే హత్య చేశారు.
చదవండి: నటిపై దాడి: ఆపై నాలుగు గంటలు అక్కడే ఎందుకు ఉన్నట్లు?
Comments
Please login to add a commentAdd a comment