టెల్ అవీవ్: హమాస్ రెండో విడత 17 మంది బందీలను ఆదివారం విడుదల చేసింది. వీరిలో ఐర్లాండ్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. తమ దేశ బాలిక విడుదలపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది.
తమ దేశ బాలిక ఎమిలి హ్యాండ్ విడుదల కావడంపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ హర్షం వ్యక్తం చేశారు. తప్పిపోయిందుకున్న బాలిక తిరిగిరావడం ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. బాలిక కుటుంబంతో కలిసినందుకు ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. తమకు ఇది ఎంతో ఊరటను కలిగించిందని అన్నారు.
అయితే.. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. బాలిక తప్పిపోయిందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దళాల ఒత్తిడితోనే బందీలను హమాస్ విడుదల చేసిందని స్పష్టం చేసింది. ఎమిలిని హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి బందీగా అపహరించుకుపోయారని తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా కాల్పులకు విరమణ ప్రకటించారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేయాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం 24 మందిని హమాస్ విడుదల చేసింది. రెండో విడతగా 17 మందిని వదిలిపెట్టింది.
ఇదీ చదవండి: Uttarakashi Tunnel Operation: ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment