జెరూసలేం: గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసింది. ఆస్పత్రి దాడిపై తీవ్రంగా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ హమాస్‌తో కలిసి మిత్ర కూటమిగా పనిచేస్తోంది.
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది.
#IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p
— IndiaToday (@IndiaToday) October 18, 2023
అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష‍్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్‌లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు.
A purported Islamic Jihad rocket hit hospital #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @PoojaShali pic.twitter.com/RgTJ8hldgm
— IndiaToday (@IndiaToday) October 18, 2023
ఇదీ చదవండి: సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు
Comments
Please login to add a commentAdd a comment