Proof
-
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
ప్రతిభ అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ప్రతిభావంతులు తమ సత్తాను ఏ రంగంలోనైనా చాటుకోవచ్చు. అలా నృత్య దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రాధిక ఇప్పుడు మోగాఫోన్ పట్టారు. ఆమె తెరకెక్కించిన చిత్రం ది ప్రూఫ్. గోల్డెన్ స్టూడియోస్ పతాకంపై గోమతి నిర్మించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శకుడు మిష్కిన్, యూకీ సేతు, గీత రచయిత స్నేహన్, నటుడు రోబో శంకర్, సంతోష్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్వీ ఉదయకుమార్ మాట్లాడుతూ ప్రూఫ్ చిత్రంలో అన్నీ అంశాలు బాగున్నాయన్నారు. ఇది ఒక క్లాస్ దర్శకురాలు చేసినట్లుగా ఉందన్నారు. దర్శకురాలు రాధిక చాలా సింపుల్‌గా ఉంటారని.. అయితే చాలా ప్రతిభావంతురాలని ప్రశంసించారు. ఇప్పుడు సినిమా ట్రెండ్ మారిపోయిందన్నారు. దర్శకులు నటిస్తున్నారని.. నృత్యదర్శకులు, నటులు, సంగీత దర్శకులు కూడా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. సినిమా అందరినీ ఆదరిస్తుందని పేర్కొన్నారు.అయితే మేకింగ్ స్టైల్ తెలియకుండానే కొందరు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని చిత్రాలు హిట్ అయినంత మాత్రాన.. అది సరైన విధానం అని తాను చెప్పలేనన్నారు. ఎక్కడ ఏ షాట్ ఉండాలి.. ఇంటర్వెల్ ఎక్కడ ఉండాలి అన్న విషయాలను సహాయ దర్శకులు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నేపథ్యమే సరికొత్త ట్రెండ్ అని పేర్కొన్నారు. దానితోనే మనం సంసాదించుకుంటున్నామన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కథల గురించి పట్టించుకోవడం లేదని కాంబినేషన్ సరిగా సెట్ అయితే చాలు అనుకుంటున్నారన్నారు. ఈ మూవీ డైరెక్టర్ రాధికకు ఒక్క విషయం చెప్పదలచుకున్నానని.. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారని, వారి గురించి పట్టించుకోకుండా ట్రెండ్‌కు తగినట్లుగా చిత్రాలు చేయాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో రుద్వీర్ వదన్, మెమ్గోపీ, రిత్విక, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించారు. దీపక్ సంగీతం అందించారు. -
'గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ దళాల పనే'
జెరూసలేం: గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసింది. ఆస్పత్రి దాడిపై తీవ్రంగా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ హమాస్‌తో కలిసి మిత్ర కూటమిగా పనిచేస్తోంది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. #IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p — IndiaToday (@IndiaToday) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. A purported Islamic Jihad rocket hit hospital #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @PoojaShali pic.twitter.com/RgTJ8hldgm — IndiaToday (@IndiaToday) October 18, 2023 ఇదీ చదవండి: సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు -
దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ కేన్సర్ నివారణ!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు. దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
ప్రూఫ్ ఏంటంటూ నిలదీసిన వాహనదారుడు.... పోలీసుల రియాక్షన్‌తో సైలెంట్
రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ధరించకపోతే ట్రాఫిక్ పోలీసలు ఫోటో తీసి చలాన్ పంపించడం వంటివి చేస్తారు. ఇది సర్వసాధారణం. మాములుగా ఎవరైనా చలాన్ చూసుకుని కట్టడం వంటివి చేస్తారు గానీ ఎప్పుడూ జరిగింది ఏంటని ఎవరూ పోలీసులను నిలదీయరు. కానీ ఇక్కడొక వాహనదారుడు మాత్రం ఎవిడెన్స్ కావాలంటూ పోలీసులకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. వివారల్లోకెళ్తే...ఫెలిక్స్రాజ్ అనే వ్యక్తి బెంగళూరు రహదారిపై హెల్మట్ ధరించకుండా స్కూటర్‌పై ప్రయాణించాడు. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతనికి తన బండి, నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పంపించి ఫైన్ విదిస్తూ చలాన పంపించారు. దీంతో సదరు వాహనదారుడు ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశిస్తూ..మీరు నా బండి ఫోటో, నెంబర్ ప్లేట్ పంపించారు. కానీ నేను రైడ్ చేస్తున్నట్లు చూపించలేదు. కాబట్టి నేనే రైడ్ చేశాననడానకి ప్రూఫ్ ఏంటని ప్రశ్నించాడు. గతంలో ఇలానే పంపిచారని, జరిమాన చెల్లించానని చెప్పుకొచ్చాడు. మళ్లీ మళ్లీ ఇలా జరిగితే ఊరుకోను. తాను హెల్మట్ లేకుండా ప్రయాణించినట్లు ప్రూఫ్ చూపించండి. అప్పుడే ఫైన్ కడతా లేకపోతే మీరు కేసు అయినా తీసేయండి అని పోలీసులకే సవాలు విసురుతూ ట్వీట్ చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి.... అతగాడు డ్రైవ్ చేస్తున్న ఫోటో తోపాటు ఎప్పుడూ ఏ సమయంలో ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడో వంటి ఆధారాలు, పోటోలతో సహా పోస్ట్ చేశారు. దీంతో సదరు వాహనదారుడు... ఆధారాలు సమర్పించినందుకు ట్రాఫిక్ పోలీసులకు ధన్యావాదాలు. ఇలా ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని సమర్థించుకోవడమే గాక ఫైన్ కట్టేస్తానని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన సంబంధించిన విషయాన్ని వివరిస్తూ ఫోటోలను ట్విట్టర్లో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు సదరు యువకుడి తీరుపై మండిపడటమే గాకుండా హెడ్ ఫోన్స్పెట్టుకుని మరీ వాహనాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది కాబట్టి పోలీసులు మరో నేరం మోపి అరెస్టు చేయాలి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. pic.twitter.com/jRd7FX0KNs — ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 19, 2022 (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
అనుమానాన్నే రుజువు అనలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : అనుమానం..అది ఎంత బలమైనదైనప్పటికీ దానిని సాక్ష్యం స్థానంలో అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుకమైన కారణంతో దోషిగా నిరూపించలేకపోతే నిందితుడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఒక చర్యకు నిందితులే కారణమని నిరూపించడానికి అందుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని సాక్ష్యాలతోపాటు చూపాలని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఓ హోంగార్డును కరెంటు షాకిచ్చి చంపేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు విముక్తి కల్పిస్తూ ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. వనవిహారి మహాపాత్ర, అతని కొడుకు లుజా, మరికొందరితో కలిసి తన భర్త విజయ్‌కుమార్‌కు విషమిచి్చ, కరెంటు షాక్‌తో చంపేశారంటూ గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి, ఆమె భర్త విజయ్ కుమార్ చందాబాలి పోలీస్ ఠాణాలో పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఎలక్ట్రిక్ షాక్‌తోనే విజయ్‌కుమార్ చనిపోయినట్లు తేలింది. ఇది హత్యే అనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. నిందితులకు చెందిన ఒక గదిలో తన భర్త విగతజీవుడిగా పడి ఉన్నాడనీ, ఇది హత్యేనని గీతాంజలి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు బలమిచ్చేలా అంతకుముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొంటూ ఒరిస్సా హైకోర్టు నిందితులకు విముక్తి కల్పించింది. చదవండి: లాకర్ల విషయంలో భరోసా ఉండాల్సిందే -
ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్‌తో ‘జొమాటో’ ఫుడ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ రెస్టారెంట్ గైడ్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. రెస్టారెంట్లు పంపిన ఆహార పదార్ధాలను మార్గం మధ్యలో ఎవరూ ఓపెన్ చేసేందుకు వీలులేకుండా గట్టి భద్రతా చర్యలను చేపట్టింది. ఇక నుంచి ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ టేప్స్‌తో ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మధ్య ఓ డెలివరీ బాయ్ పార్సిల్‌ను ఓపెన్ చేసిన సంఘటన వైరల్ కాగా, అప్పట్లోనే ఇటువంటి నాణ్యతా చర్యను చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా తొలుత దేశంలోని 10 నగరాల్లో ఈ తరహా సేవలను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. పునర్వినియోగానికి వీలైన సింగిల్ మెటీరియల్ పాలిమర్‌తో ఫుడ్ డెలివరీ జరుగుతుందని తెలిపింది. తొలి దశలో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణె, జైపూర్, చండీగఢ్, నాగ్‌పూర్, వడోదరల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు. ఈ దశలో 5,000 రెస్టారెంట్లు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌తో ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారాయన. -
ఆ పార్క్‌కి వెళ్లే జంటలకు షాక్
సాక్షి, చెన్నై : చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. పార్క్‌లోకి ప్రవేశించాలంటే వారు తప్పనిసరిగా వివాహ ధృవీకరణ పత్రం చూపించాల్సిందన్న నియమం విధించింది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో జంటల వెకిలి చేష్టలు గత కొంతకాలంగా బాగా పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయటంతో అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. పార్క్‌కి వెళ్లే జంటలు తమ వెంట తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ చూపించకపోతే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తారు. తొలుత జంటల ఓటర్ ఐడీ, ఆధార్ తరహాలో గుర్తింపుకార్డులు, ఫోన్ నంబర్లను పరిశీలించాలని భావించారు. కానీ, చివరకు వివాహ ధృవీకరణ పత్రం అయితేనే సబబన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిదేనని.. అందుకోసం ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదని వారంటున్నారు. పార్క్‌ను ‘ఫ్యామిలీ బిజినెస్’గా మార్చారంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం అమలయ్యాక విద్యార్థుల తాకిడి బాగా తగ్గిందంటూ సిబ్బంది చెబుతున్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్ పై ఇవిగో ఆధారాలు!
భారతదేశానికి చెందిన ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ గురించిన నిజాలు బయటపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ఐజీ ముస్తాక్ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన ప్రాంతాలకు ఎస్పీగా పనిచేస్తున్న అధికారి గులాం అక్బర్‌కు పాత్రికేయుడు మనోజ్ గుప్తా ఫోన్ చేశారు. దీంతో ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించిన పాకిస్థానీ పోలీసు అధికారి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వాస్తవాలను తన నోటితోనే వెల్లడించాడు. దాడిలో ఐదుగురు పాక్ సైనికులు కూడా మరణించారని తెలిపాడు. అధికారితో మనోజ్ గుప్తా పూర్తి సంభాషణ: గుప్తా: గులాం. ఎలా ఉన్నావు. నేను ఐజీ ముస్తాక్ (అని మనోజ్ తనను తాను అధికారికి పరిచయం చేసుకున్నారు) అధికారి: దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను సార్. గుప్తా: మీ ప్రాంతంలో ఏం జరుగుతుంది? (అక్కడి విషయాలను రాబట్టడం మొదలుపెట్టారు) అధికారి: ఉదయం నుంచి బోర్డర్ వద్ద ప్రశాంతంగానే ఉంది సార్. గుప్తా: సర్జికల్ స్ట్రైక్స్ అని వాళ్లు మాట్లాడుతున్నారు. (భారత్ ను ఉద్దేశించి) అధికారి: గత నెల 29న జరిగిన దాడుల గురించి వాళ్లు మాట్లాడుతున్నారు సార్. ఇప్పటివరకూ ముగ్గరు సైనికులు మృతి చెందినట్లు గుర్తించారు. గుప్తా: కానీ వాళ్లు 30 నుంచి 40 మంది దాడిలో మరణించారని అంటున్నారు. అధికారి: అవును సార్. వాళ్లు చాలా మంది మరణించారని అంటున్నారు. కానీ ఆ దాడి అంత తీవ్రమైంది కాదు. గుప్తా: అవునవును. అత్ముక్వాం వైపుకు ఎవరైనా వెళ్లారా? అధికారి: లేదు సార్. అటువైపు ఎవరూ వెళ్లలేదు. కానీ లీపా, అధిరాల్లో ఆ రాత్రి నలుగురు మృతి చెందారు. గుప్తా: మొత్తం ఎంతమంది మరణించి ఉంటారు? అధికారి: సర్జికల్ స్రైక్స్ లో మొత్తం మీద 12 మంది దాకా మృతి చెంది ఉండొచ్చు సార్. గుప్తా:12 మంది ఒక్క క్యాంప్ లోనే మృతి చెందారా? అధికారి: లేదు సార్. అన్ని క్యాంపులూ కలిపే చెబుతున్నాను. స్ట్రైక్స్ ను గురించిన వివరాలేవి బయటకు రావడం లేదు. ఆ ప్రాంతానికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. గుప్తా: ఏయే క్యాంపుల్లో దాడులు జరిగాయి? అధికారి: లీపా, అస్మాని, భీంబర్ లలో జరిగాయి సార్. గుప్తా: ఆర్మీ పోస్టుల్లో మొత్తం 12మందిని చంపారు. అధికారి: అవును సార్ మొత్తం 12 మంది. గుప్తా: వాళ్లకు దహనసంస్కారాలు ఎక్కడ నిర్వహించారు? అధికారి: వాళ్ల సొంత గ్రామాల్లోనే సార్. గుప్తా: వారి వివరాలు చెప్పగలవా?. అధికారి: మరణించిన వారి లిస్టు తీసుకురా( ఆఫీస్ క్లర్క్ కు ఆర్డర్ ఇచ్చారు). గుప్తా: లిస్టులో మృతి చెందిన వారందరి వివరాలు ఉన్నాయా? అధికారి: కొన్ని మాత్రమే ఉన్నాయి సార్. గుప్తా: ఈ పేర్లన్నీ సర్జికల్ స్ట్రైక్స్ లో మరణించిన వారివేనా? అధికారి: అవును సార్. గుప్తా: లైన్ సరిగా లేనట్లుంది. నీ ల్యాండ్ లైన్ నంబర్ కొంచెం చెప్తావా? అధికారి: ల్యాండ్ లైన్ బేస్ మెంట్ లో ఉంది సార్. ముజఫరాబాద్ కోడ్(05822)తో నంబర్ ను చెప్పాడు గుప్తా: ఇప్పుడు నీ మాట బాగానే వినిపిస్తుంది. ఆ లిస్టులోని పేర్లు ఒకసారి చదువుతావా? అధికారి: క్లర్క్ ఫైల్ మొత్తాన్ని తెస్తున్నాడు సార్. సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వివరాలు మొత్తం అందులో ఉంటాయి. గుప్తా: ఫైల్ నీ దగ్గరకు వచ్చిందా? అధికారి: ఇప్పుడే వచ్చింది సార్. గుప్తా: సరే అందులో వివరాలు చెప్పు అధికారి: సర్జికల్ స్ట్రైక్స్ లో మొత్తం ఐదుగురు సైనికులు మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. (వీరి పేర్లను కూడా అధికారి వెల్లడించారు). దాడిలో లీపాకు దగ్గరలోని ఒక మసీదు కూడా ధ్వసమైంది. గుప్తా: దాడి ఎంతసేపు జరిగిందో తెలుసా? అధికారి: దాడి రాత్రి సమయంలో మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగింది సార్. గుప్తా: మొత్తం వాళ్లు ఎంతమంది వచ్చారు? అధికారి: ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదు సార్. గుప్తా: వాళ్లు మన పోస్టుల్లో ఒక దానిపై దాడి చేశారు. అధికారి: దాడి ఒక్క చోట జరగలేదు సార్. వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి దాడి చేశారు. ఎదురుకాల్పులు కూడా జరిగాయి సార్. గుప్తా: ఎంతమంది భారతీయ సైనికులు వచ్చారో నీకు ఏమైనా తెలుసా? అధికారి: నాకు తెలియదు సార్. ఆ ప్రదేశానికి ఎవరినీ వెళ్ల నివ్వడం లేదు. స్ధానిక ప్రభుత్వాలు కూడా ఏమీ చెప్పడం లేదు. గుప్తా: ఒకసారి ఐదుగురు మరణించారని, మరోసారి 12మంది మరణించారని చెబుతున్నావు? అధికారి: అవి వేర్వేరు పోస్టుల వద్ద చనిపోయిన వారి వివరాలు సార్. గుప్తా: మరి ఇంటిలిజెన్స్ ఏమంటోంది? అధికారి: మృతదేహాలను అంబులెన్స్ లలో తరలించినట్లు వారు చెబుతున్నారు సార్. గుప్తా: స్ధానికులు, జీహాదీల్లో ఎవరైనా మరణించారా? అధికారి: స్ధానికులెవరూ మరణించ లేదు సార్. కాని జీహాదీలు మృతి చెందారనే సమాచారం ఉంది. గుప్తా: జీహాదీలు ఎంతమంది మరణించారు? అధికారి: ఈ విషయంపై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు సార్. గుప్తా: ఆర్మీ(పాక్ ఆర్మీ) జీహాదీలకు ఆశ్రయం కల్పిస్తుందా? అధికారి: అది అందరికీ తెలిసిన విషయమే సార్. గుప్తా: జీహాదీలకు చెందిన సమాచారాన్ని ఆర్మీ బయటకు రానివ్వడం లేదని అనుకుంటున్నారా? అధికారి: అవును సార్. ఆ పని వాళ్లే చేస్తారు. అది మా అందరికీ తెలుసు. అందకే దాడులు జరిగిన ప్రాంతాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. గుప్తా: ఎంతమంది జీహాదీలు చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు? అధికారి: అది చెప్పడం కష్టం సార్ గుప్తా: పర్లేదు ఆలోచించి చెప్పు అధికారి: క్యాంపుకు 5 నుంచి 6గురి వరకూ ఉండొచ్చు సార్. గుప్తా: ఐదు క్యాంపులపై దాడులు చేసిన భారతీయ దళాలు 20 మంది జీహాదీలను మట్టుపెట్టి ఉంటాయి? అధికారి: అలా చెప్పడం కష్టం సార్. అది ముష్కరులను పంపే సంస్ధపై ఆధారపడి ఉంటుంది. గుప్తా: అయితే వీళ్లందరూ ఏ సంస్ధకు చెందిన వారు కావచ్చు? అధికారి: లష్కరే కు చెందిన వాళ్లు సార్ గుప్తా: మరి జీహాదీలను మీరు కూడా మీతో ఉంచుకుంటారా? అధికారి: లేదు సార్. ఆర్మీ ఆ పనిచేస్తుంది. గుప్తా: వారిని ఆర్మీ వద్దకు ఎవరు తీసుకొస్తారు? అధికారి: ఆర్మీయే వాళ్లును తెచ్చుకుంటుంది సార్. వాళ్ల చేతుల్లోనే ఉగ్రసంస్ధ నడుస్తుంది. గుప్తా: సరే. నీ గుర్తింపును మరోసారి చెప్పు? అధికారి: గులాం అక్బర్, ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్. -
సిమ్పుల్గా మోసం
కస్టమర్ ఫొటో, ఐడీ ప్రూఫ్‌లతో క్లోనింగ్ ఒకే పేరుతోనే అధికంగా నంబర్లు మంజూరు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న వైనం తిరుపతిలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. ఓ ఉద్యోగానికి మిమ్మల్ని ఎంపిక చేశాం.. అధిక మొత్తంలో జీతం వస్తుంది.. కాకపోతే మీరు ముందుగా రూ.50 వేలు నగదు చెల్లించాలని నమ్మబలికారు. చెప్పిన అకౌంట్లో నగదును జమచేసి ఫోన్‌చేయగా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులను ఆశ్రయించగా ఆ నంబర్‌ను వేరే జిల్లాలో మరో వ్యక్తి వాడుతున్నట్టు తేలింది. వ్యాపారులు అదే పేరుపై సిమ్ కేటాయించారని గుర్తించారు. తిరుపతి మంగళంలో నివాసముంటున్న యువతికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బాధితురాలు వీటిపై కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తీరా అది ఓ మహిళదేనని తేలింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరుతో సిమ్‌కార్డు పొందినట్టు పోలీసులు గుర్తించారు. ....ఇవన్నీ సిమ్ మాఫియాల కథ.. ఈ తరహా సమస్యలు తరచూ నగరంలో వెలుగులోకి వస్తున్నాయి. 25 నుంచి 30 శాతం మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే వారు వాడే సిమ్ కార్డు ఎక్కడైనా నేరం జరిగిన సమయంలో పోలీసులు ఆరా తీస్తే గుట్టు రట్టవుతోంది. అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. సిమ్వాడుతున్న అమాయకులు పోలీసులకు దొరికి బలైపోతున్నారు. తిరుపతి క్రైం: పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన సిమ్మాయగాళ్లు ప్రస్తుతం తిరుపతి నగరంలో కూడా విజృంభిస్తున్నారు. ఎలాంటి ప్రూఫ్‌లు అవసరం లేకుండా సిమ్‌కార్డులు అమ్మే దందా జోరుగా సాగుతోంది. సిమ్ కొనుగోలుదారులు ఐడీ ప్రూఫ్‌ను పోర్జరీచేసి సిమ్‌కార్డును యాక్టివేట్ చేసి వ్యాపారులు, డీలర్లు అధిక ధరలకు విక్రయిన్నారు. వివిధ రకాల నెట్వర్క్ కంపెనీలకు తమ వ్యాపారులను విస్తృతపరుస్తున్నారు. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. జోరుగా అమ్మకాలు గతంలో కొందరు డీలర్ల వద్దే ఇలాంటి సిమ్‌కార్డులు లభ్యమయ్యేవి. ఇప్పుడు కంపెనీలు విచ్చలవిడిగా ఔట్లెట్లు ఏర్పాటుకు అనుమతులివ్వడంతో చిల్లర వ్యాపారులు, ఫ్యాన్సీ షాపులు, రీచార్జ్ కౌంటర్లు, రోడ్లపై టెంట్లల్లో సైతం సిమ్‌కార్డులు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా కంపెనీలు ఎక్కువ సిమ్‌కార్డులు విక్రయించినవారికి రాయితీలు, కానుకలు, ఇన్సెన్టివ్లు, కమీషన్లతో పాటు లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. వీటికి ఆశపడి ఏజెంట్లు, డీలర్లు అడ్డదార్లు తొక్కుతూ కస్టమర్లను ఇబ్బందిపెడుతున్నారు. ఎలా జరుగుతోందంటే.. ఏ కంపెనీ సిమ్ కావాలన్నా ట్రాయ్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంది. ఇలా సిమ్ కొనుగోలుదారుడు సమర్పించిన జిరాక్స్‌లను పెద్దసంఖ్యలో కాపీచేస్తున్నారు. వాటి ద్వారా సిమ్‌కార్డులను బ్లాక్ చేస్తున్నారు. అనంతరం కాపీ ప్రూఫ్ ద్వారా ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా ఎవరికిపడితే వారికి సిమ్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చిక్కుల్లో అమాయకులు వ్యాపారుల మితిమీరిన దురాశ వల్ల అమాయకులు చిక్కుల్లో పడుతున్నారు. సిమ్ జారీ అయ్యేది ఒకరిపేరుతో.. దాన్ని వాడేది మరొకరు. వారు సిమ్ కార్డును దుర్వినియోగం చేస్తే అందులో అడ్రస్‌లో ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలి. పలు కేసుల్లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివాటిపై పోలీసుల నిఘా తగ్గడంతో సిమ్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
అమ్మకానికి మార్గరెట్ థాచర్ నివాసం...!
బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ ప్యాలెస్ ను అమ్మకానికి పెట్టారు. ఆరంతస్తుల ఆ అపూర్వ భవనంలో సిబ్బంది క్వార్టర్స్, లూయిస్ ఫైర్ ప్లేస్ లు... ఓ ప్రధానమంత్రికి కావలసిన అన్నిరకాల హంగులూ ఉన్నాయి. దానికి తోడు... నీలి రాతితో మెరసి పోతున్న ఆ సౌధాన్ని.. కొనేవారి కోసం యజమానులు నిరీక్షిస్తున్నారు. మాజీ ప్రధాని చివరిగా నివసించిన ఆ భవనంలోని ప్రత్యేకతలను బట్టి... దాని ఖరీదును ముఫ్ఫై మిలియన్ల యూరోలుగా నిర్ణయించారు. లండన్ లోని 73 ఛెస్టర్ స్క్వేర్ లో ఉన్న ఆ భవంతిలో అంతకు ముందు కవి మాథ్యూ ఆర్నాల్డ్, నవలా రచయిత మేరీ షెల్లీ, 1930 కంజర్వేటివ్ ప్రధాని స్టాన్లీ బాల్డ్ విన్ నివసించారు. ఇటీవల లగ్జరీ డెవలపర్ లెకాన్ ఫీల్డ్ కొన్ని మిలియన్ పౌండ్లతో పునరుద్ధరించి, మూడేళ్ళ తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఈ భవంతిలోని ప్రధాన ద్వారాలకు థాచర్ ఇష్టంతో పొదిగించుకున్న 73 నీలి ఫలకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాల్లోని ఫ్లోరింగ్, లాబీలకు కూడ అదేరకం రాయిని వినియోగించారు. ఇటువంటి ప్రత్యేకతలు కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ భవనానికి ఏర్పాటు చేసిన బాంబ్ ప్రూఫ్ తలుపులు ఆ నాయకురాలి జీవితానికి గుర్తులుగా నిలుస్తున్నాయి. థాచర్ 1984 లో బ్రైటన్ హోటల్ బాంబు దాడి నుంచి తప్పించుకున్న తర్వాత బాంబ్ ఫ్రూఫ్ తలుపుల అవసరం మరింత పెరిగింది. అంతేకాదు ఈ ప్యాలెస్ లో ప్రదర్శన శాలలు, మోడరన్ జిమ్, సినిమా హాల్, 500 సీసాలు పట్టే వైన్ సెల్లార్ వంటి మరెన్నో ఆధునిక హంగులూ ఉన్నాయి. మేడమీది రెండో అంతస్తులో మాస్టర్ సూట్లు, డబుల్ బెడ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియా, మాస్టర్ బాత్ రూమ్ సహా అనేక ప్రత్యేక ఆకర్షణలు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అలాగే భవనంలోని మరో ఐదు బెడ్ రూమ్ లు, సిబ్బంది వసతి గృహాలతోపాటు ఇటాలియన్ ఫర్నిచర్, పాలరాతి టేబుల్ రాచరికపు అందాలను ఉట్టిపడేలా చేస్తున్నాయి. థాచర్ త్రండి ఆల్ ఫ్రెడ్ రాబర్ట్స్ 'గ్రాంథం' ప్రాంతానికి 1945 నుంచి 1946 వరకు మేయర్ గా పనిచేశారు. దీంతో ఆమె తన బాల్యాన్ని గ్రాంథం లో గడిపింది. స్థానిక గ్రామర్ స్కూల్లో చదివిన మార్గరెట్... ఆక్స్ ఫర్డ్ సోమర్ విల్లె కాలేజీలో కెమిస్ట్రీ లో పట్టభద్రత పొందింది. అనంతరం ఓ పరిశోధన రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి, ఆమెకు 25 ఏళ్ళ వయసున్నపుడు రాజకీయాల్లో అడుగు పెట్టింది. 1951 లో కంజర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికై... 1970 లో పార్టీ నాయకురాలిగా ఎదిగింది. తర్వాత మూడు పర్యాయాలు జనరల్ ఎన్నికల్లో గెలిచి మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా థాచర్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. -
‘ఐకేపీ’కి టోకరా
►తక్కువ ధాన్యం తెచ్చి ఎక్కువ నమోదు చేసుకున్న బినామీలు ► హమాలీల రిజిస్టర్‌తో వెల్లడైన అక్రమాలు ►రూ.14 లక్షలకు పైగా జేబులోకి.. ► కమీషన్‌కు ఎసరు ► డబ్బులు తిరిగి ఇవ్వమంటే దబాయిస్తున్న దళారులు మహదేవపూర్ : ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మహదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్, సూరారం, అన్నారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కేంద్రాల నిర్వహణ బాధ్యలను ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలకు అప్పగించింది. సూరారం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు 284 మంది రైతుల నుంచి 20,887.60 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. ఇందులో కేవలం సూరారం గ్రామానికి చెందిన నలుగురు రైతులే 11,900 క్వింటాళ్లు విక్రయించారు. వీరితోపాటు రైతులందరికీ కలిపి రూ.2,80,09,248 చెల్లించారు. తక్కువ విక్రయించి.. ఎక్కువ చూపించి.. సూరారం గ్రామానికి చెందిన రైతు నల్లమాసు నగేశ్ 6,414.80 క్వింటాళ్లు, నల్లమాసు సదాశివుడు 2,393.60 క్వింటాళ్లు, నల్లమాసు నాగేందర్ 618 క్వింటాళ్లు, పొడేటి లక్ష్మారెడ్డి 2,473,60 క్వింటాళ్లు విక్రయించినట్లు మహిళా సంఘాలను నమ్మించారు. ఐకేపీ నుంచి రూ.1,60,07,048 తీసుకున్నారు. నిజానికి నగేశ్ విక్రయించింది కేవలం 6158.72 క్వింటాళ్లు. కానీ ఇతడు 256.08 క్వింటాళ్లు అదనంగా చూపి మహిళా సంఘాలను తప్పుదోవ పట్టించాడు. అలాగే నల్లమాసు సదాశివుడు విక్రయించింది 2352.08 క్వింటాళ్లయినా.. 40.80 క్వింటాళ్లు అదనంగా చూపాడు. పొడేటి లక్ష్మారెడ్డి విక్రయించింది 1786 క్వింటాళ్లయినా.. 686.80 క్వింటాళ్లు అదనంగా చూపాడు. హమాలీ రిజిస్టర్ల పరిశీలనతో వెలుగులోకి.. సూరారం ఐకేపీ కేంద్రానికి డీఆర్డీఏ నుంచి రైతులకు చెల్లించేందుకు మొత్తం రూ.3,10, 87,911 మంజూరయ్యాయి. ఇందులో రైతులకు చెల్లించిన రూ.2,80,09,248, హమాలీలకు రూ.2,29,757 పోను తమ వద్ద ఇంకా రూ.13,70,060 మాత్రమే నిల్వ ఉన్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలు డీఆర్డీఏకు పంపించారు. మిల్లులకు చేర్చిన ధాన్యం.. చెల్లించిన మొత్తాన్ని పరిశీలించిన అధికారులు.. మహిళా సంఘాల వద్దే ఇంకా రూ.14,78,846 ఉన్నాయనుకుని కమీషన్ పంపలేదు. ఈ విషయం తెలియని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు కమీషన్ (సుమారు రూ.ఆరు లక్షలు క్వింటాల్‌కు రూ.34 ప్రభుత్వం కమీషన్ ఇస్తుంది) ఇవ్వాలంటూ బుధవారం ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. మహిళా సంఘం నుంచే రూ.14,78,846 రావాల్సి ఉందని చెప్పడంతో అవాక్కయ్యారు. కొనుగోలు రిజిస్టర్‌తోపాటు హమాలీల రిజిస్టర్‌ను పరిశీలించగా తేడా కనిపించింది. ముగ్గురు దళారులు కలిసి ఏకంగా 983.68 క్వింటాళ్లు అదనంగా చూపి రూ.14లక్షలకు పైగా తమ జేబుల్లో నింపుకున్నారు. ఈ విషయమై సదరు రైతులు (దళారులను) అడిగితే తాము విక్రయించిన ధాన్యానికే డబ్బులు చెల్లించారంటూ దబాయిస్తున్నారని మహిళలు పేర్కొంటున్నారు. విషయాన్ని మహిళలు ఏపీఓ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పీడీకి నివేదిస్తానని తెలిపారు. రైతులు (దళారులు) డబ్బులు చెల్లించకుంటే పోలీసులను ఆశ్రయించేందుకు మహిళా సంఘాల సభ్యులు సిద్ధమవుతున్నారు. -
రాష్ట్ర సలహామండలిలో జిల్లావాసికి చోటు
ఆరుగురి సభ్యుల్లో రిటైర్డ్ ఐఏఎస్ పాపారావుకు అవకాశం అస్సాం హోం సెక్రటరీగా విధులు.. ఐక్యరాజ్యసమితిలోనూ బాధ్యతలు ఇన్టాక్ లైఫ్ మెంబర్‌గా కొనసాగుతున్న విశ్రాంత అధికారి కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి ఆరుగురు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సలహా సంఘం సభ్యుల్లో బీవీ.పాపారావుకు అవకాశం దక్కింది. పాపారావు వరంగల్ జిల్లా వాసి. ఆయన స్వగ్రామం నెల్లికుదురు మండలం మునిగలవీడు. 1970 దశకంలో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో పాపారావు డిగ్రీ చదివారు. అనంతరం 1982 బ్యాచ్ అస్సాం కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం హోం సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున పని చేశారు. పాపారావుకు మంచి పరిపాలనాదక్షుడిగా పేరుంది. ఉద్యోగ కాలం పూర్తి కాకుండానే ముందస్తు ఉద్యోగ విరమణ చేసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వారసత్వ సంపద పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాలకుర్తి మండలం బమ్మెరలో పొతన వంశీకులకు సంబంధించి సుమారు నాలుగు ఎకరాల భూమిని కొని అభివృద్ధి చేస్తున్నారు. ఇన్టాక్ లైఫ్ మెంబర్‌గా కూడా పాపారావు ఉన్నారు. కాకతీయ ఉత్సవాల సమయంలో ప్రతే ్యకంగా కాఫీటేబుల్ బుక్ రూపొందించారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువులపై ‘ఇరిగేషన్ ఆఫ్ కాకతీయ’ పేరుతో సమగ్ర సమాచారం సేకరించి అందుబాటులో ఉంచారు. 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు జయూపసేనాని రచించిన నిత్యరత్నావళి గ్రంధాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ప్రపంచవ్యాప్తంగా కాకతీయ కీరిన్తి ఇనుమడింపజేసేందుకు కృషిచేశారు. ఇన్టాక్ కన్వీనర్‌గా పనిచేస్తున్న నిట్ పూర్వ ఆచార్యులు పాండురంగారావు ఈ మేరకు స్పందిస్తూ... ‘మేము ఇన్టాక్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా కలిసి పనిచేస్తున్నాం. పాపారావు ప్రభుత్వ సలహా సంఘంలో సభ్యుడిగా నియమితులు కావడం సంతోషదాయకం. పాపారావు మార్గనిర్ధేశకంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.’ అని ఆకాంక్షించారు.