రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ధరించకపోతే ట్రాఫిక్ పోలీసలు ఫోటో తీసి చలాన్ పంపించడం వంటివి చేస్తారు. ఇది సర్వసాధారణం. మాములుగా ఎవరైనా చలాన్ చూసుకుని కట్టడం వంటివి చేస్తారు గానీ ఎప్పుడూ జరిగింది ఏంటని ఎవరూ పోలీసులను నిలదీయరు. కానీ ఇక్కడొక వాహనదారుడు మాత్రం ఎవిడెన్స్ కావాలంటూ పోలీసులకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
వివారల్లోకెళ్తే...ఫెలిక్స్‌రాజ్ అనే వ్యక్తి బెంగళూరు రహదారిపై హెల్మట్ ధరించకుండా స్కూటర్‌పై ప్రయాణించాడు. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతనికి తన బండి, నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పంపించి ఫైన్ విదిస్తూ చలాన పంపించారు. దీంతో సదరు వాహనదారుడు ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశిస్తూ..మీరు నా బండి ఫోటో, నెంబర్ ప్లేట్ పంపించారు. కానీ నేను రైడ్ చేస్తున్నట్లు చూపించలేదు. కాబట్టి నేనే రైడ్ చేశాననడానకి ప్రూఫ్ ఏంటని ప్రశ్నించాడు. గతంలో ఇలానే పంపిచారని, జరిమాన చెల్లించానని చెప్పుకొచ్చాడు. మళ్లీ మళ్లీ ఇలా జరిగితే ఊరుకోను.
తాను హెల్మట్ లేకుండా ప్రయాణించినట్లు ప్రూఫ్ చూపించండి. అప్పుడే ఫైన్ కడతా లేకపోతే మీరు కేసు అయినా తీసేయండి అని పోలీసులకే సవాలు విసురుతూ ట్వీట్ చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి.... అతగాడు డ్రైవ్ చేస్తున్న ఫోటో తోపాటు ఎప్పుడూ ఏ సమయంలో ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడో వంటి ఆధారాలు, పోటోలతో సహా పోస్ట్ చేశారు. దీంతో సదరు వాహనదారుడు... ఆధారాలు సమర్పించినందుకు ట్రాఫిక్ పోలీసులకు ధన్యావాదాలు.
ఇలా ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని సమర్థించుకోవడమే గాక ఫైన్ కట్టేస్తానని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన సంబంధించిన విషయాన్ని వివరిస్తూ ఫోటోలను ట్విట్టర్‌లో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు సదరు యువకుడి తీరుపై మండిపడటమే గాకుండా హెడ్ ఫోన్స్‌పెట్టుకుని మరీ వాహనాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది కాబట్టి పోలీసులు మరో నేరం మోపి అరెస్టు చేయాలి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 19, 2022
(చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!)
Comments
Please login to add a commentAdd a comment