సర్జికల్ స్ట్రైక్స్ పై ఇవిగో ఆధారాలు!
సర్జికల్ స్ట్రైక్స్ పై ఇవిగో ఆధారాలు!
Published Thu, Oct 6 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
భారతదేశానికి చెందిన ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ గురించిన నిజాలు బయటపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ఐజీ ముస్తాక్ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన ప్రాంతాలకు ఎస్పీగా పనిచేస్తున్న అధికారి గులాం అక్బర్‌కు పాత్రికేయుడు మనోజ్ గుప్తా ఫోన్ చేశారు.
దీంతో ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించిన పాకిస్థానీ పోలీసు అధికారి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వాస్తవాలను తన నోటితోనే వెల్లడించాడు. దాడిలో ఐదుగురు పాక్ సైనికులు కూడా మరణించారని తెలిపాడు.
అధికారితో మనోజ్ గుప్తా పూర్తి సంభాషణ:
గుప్తా: గులాం. ఎలా ఉన్నావు. నేను ఐజీ ముస్తాక్ (అని మనోజ్ తనను తాను అధికారికి పరిచయం చేసుకున్నారు)
అధికారి: దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను సార్.
గుప్తా: మీ ప్రాంతంలో ఏం జరుగుతుంది? (అక్కడి విషయాలను రాబట్టడం మొదలుపెట్టారు)
అధికారి: ఉదయం నుంచి బోర్డర్ వద్ద ప్రశాంతంగానే ఉంది సార్.
గుప్తా: సర్జికల్ స్ట్రైక్స్ అని వాళ్లు మాట్లాడుతున్నారు. (భారత్ ను ఉద్దేశించి)
అధికారి: గత నెల 29న జరిగిన దాడుల గురించి వాళ్లు మాట్లాడుతున్నారు సార్. ఇప్పటివరకూ ముగ్గరు సైనికులు మృతి చెందినట్లు గుర్తించారు.
గుప్తా: కానీ వాళ్లు 30 నుంచి 40 మంది దాడిలో మరణించారని అంటున్నారు.
అధికారి: అవును సార్. వాళ్లు చాలా మంది మరణించారని అంటున్నారు. కానీ ఆ దాడి అంత తీవ్రమైంది కాదు.
గుప్తా: అవునవును. అత్ముక్వాం వైపుకు ఎవరైనా వెళ్లారా?
అధికారి: లేదు సార్. అటువైపు ఎవరూ వెళ్లలేదు. కానీ లీపా, అధిరాల్లో ఆ రాత్రి నలుగురు మృతి చెందారు.
గుప్తా: మొత్తం ఎంతమంది మరణించి ఉంటారు?
అధికారి: సర్జికల్ స్రైక్స్ లో మొత్తం మీద 12 మంది దాకా మృతి చెంది ఉండొచ్చు సార్.
గుప్తా:12 మంది ఒక్క క్యాంప్ లోనే మృతి చెందారా?
అధికారి: లేదు సార్. అన్ని క్యాంపులూ కలిపే చెబుతున్నాను. స్ట్రైక్స్ ను గురించిన వివరాలేవి బయటకు రావడం లేదు. ఆ ప్రాంతానికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు.
గుప్తా: ఏయే క్యాంపుల్లో దాడులు జరిగాయి?
అధికారి: లీపా, అస్మాని, భీంబర్ లలో జరిగాయి సార్.
గుప్తా: ఆర్మీ పోస్టుల్లో మొత్తం 12మందిని చంపారు.
అధికారి: అవును సార్ మొత్తం 12 మంది.
గుప్తా: వాళ్లకు దహనసంస్కారాలు ఎక్కడ నిర్వహించారు?
అధికారి: వాళ్ల సొంత గ్రామాల్లోనే సార్.
గుప్తా: వారి వివరాలు చెప్పగలవా?.
అధికారి: మరణించిన వారి లిస్టు తీసుకురా( ఆఫీస్ క్లర్క్ కు ఆర్డర్ ఇచ్చారు).
గుప్తా: లిస్టులో మృతి చెందిన వారందరి వివరాలు ఉన్నాయా?
అధికారి: కొన్ని మాత్రమే ఉన్నాయి సార్.
గుప్తా: ఈ పేర్లన్నీ సర్జికల్ స్ట్రైక్స్ లో మరణించిన వారివేనా?
అధికారి: అవును సార్.
గుప్తా: లైన్ సరిగా లేనట్లుంది. నీ ల్యాండ్ లైన్ నంబర్ కొంచెం చెప్తావా?
అధికారి: ల్యాండ్ లైన్ బేస్ మెంట్ లో ఉంది సార్. ముజఫరాబాద్ కోడ్(05822)తో నంబర్ ను చెప్పాడు
గుప్తా: ఇప్పుడు నీ మాట బాగానే వినిపిస్తుంది. ఆ లిస్టులోని పేర్లు ఒకసారి చదువుతావా?
అధికారి: క్లర్క్ ఫైల్ మొత్తాన్ని తెస్తున్నాడు సార్. సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వివరాలు మొత్తం అందులో ఉంటాయి.
గుప్తా: ఫైల్ నీ దగ్గరకు వచ్చిందా?
అధికారి: ఇప్పుడే వచ్చింది సార్.
గుప్తా: సరే అందులో వివరాలు చెప్పు
అధికారి: సర్జికల్ స్ట్రైక్స్ లో మొత్తం ఐదుగురు సైనికులు మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. (వీరి పేర్లను కూడా అధికారి వెల్లడించారు). దాడిలో లీపాకు దగ్గరలోని ఒక మసీదు కూడా ధ్వసమైంది.
గుప్తా: దాడి ఎంతసేపు జరిగిందో తెలుసా?
అధికారి: దాడి రాత్రి సమయంలో మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగింది సార్.
గుప్తా: మొత్తం వాళ్లు ఎంతమంది వచ్చారు?
అధికారి: ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదు సార్.
గుప్తా: వాళ్లు మన పోస్టుల్లో ఒక దానిపై దాడి చేశారు.
అధికారి: దాడి ఒక్క చోట జరగలేదు సార్. వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి దాడి చేశారు. ఎదురుకాల్పులు కూడా జరిగాయి సార్.
గుప్తా: ఎంతమంది భారతీయ సైనికులు వచ్చారో నీకు ఏమైనా తెలుసా?
అధికారి: నాకు తెలియదు సార్. ఆ ప్రదేశానికి ఎవరినీ వెళ్ల నివ్వడం లేదు. స్ధానిక ప్రభుత్వాలు కూడా ఏమీ చెప్పడం లేదు.
గుప్తా: ఒకసారి ఐదుగురు మరణించారని, మరోసారి 12మంది మరణించారని చెబుతున్నావు?
అధికారి: అవి వేర్వేరు పోస్టుల వద్ద చనిపోయిన వారి వివరాలు సార్.
గుప్తా: మరి ఇంటిలిజెన్స్ ఏమంటోంది?
అధికారి: మృతదేహాలను అంబులెన్స్ లలో తరలించినట్లు వారు చెబుతున్నారు సార్.
గుప్తా: స్ధానికులు, జీహాదీల్లో ఎవరైనా మరణించారా?
అధికారి: స్ధానికులెవరూ మరణించ లేదు సార్. కాని జీహాదీలు మృతి చెందారనే సమాచారం ఉంది.
గుప్తా: జీహాదీలు ఎంతమంది మరణించారు?
అధికారి: ఈ విషయంపై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు సార్.
గుప్తా: ఆర్మీ(పాక్ ఆర్మీ) జీహాదీలకు ఆశ్రయం కల్పిస్తుందా?
అధికారి: అది అందరికీ తెలిసిన విషయమే సార్.
గుప్తా: జీహాదీలకు చెందిన సమాచారాన్ని ఆర్మీ బయటకు రానివ్వడం లేదని అనుకుంటున్నారా?
అధికారి: అవును సార్. ఆ పని వాళ్లే చేస్తారు. అది మా అందరికీ తెలుసు. అందకే దాడులు జరిగిన ప్రాంతాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు.
గుప్తా: ఎంతమంది జీహాదీలు చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు?
అధికారి: అది చెప్పడం కష్టం సార్
గుప్తా: పర్లేదు ఆలోచించి చెప్పు
అధికారి: క్యాంపుకు 5 నుంచి 6గురి వరకూ ఉండొచ్చు సార్.
గుప్తా: ఐదు క్యాంపులపై దాడులు చేసిన భారతీయ దళాలు 20 మంది జీహాదీలను మట్టుపెట్టి ఉంటాయి?
అధికారి: అలా చెప్పడం కష్టం సార్. అది ముష్కరులను పంపే సంస్ధపై ఆధారపడి ఉంటుంది.
గుప్తా: అయితే వీళ్లందరూ ఏ సంస్ధకు చెందిన వారు కావచ్చు?
అధికారి: లష్కరే కు చెందిన వాళ్లు సార్
గుప్తా: మరి జీహాదీలను మీరు కూడా మీతో ఉంచుకుంటారా?
అధికారి: లేదు సార్. ఆర్మీ ఆ పనిచేస్తుంది.
గుప్తా: వారిని ఆర్మీ వద్దకు ఎవరు తీసుకొస్తారు?
అధికారి: ఆర్మీయే వాళ్లును తెచ్చుకుంటుంది సార్. వాళ్ల చేతుల్లోనే ఉగ్రసంస్ధ నడుస్తుంది.
గుప్తా: సరే. నీ గుర్తింపును మరోసారి చెప్పు?
అధికారి: గులాం అక్బర్, ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్.
Advertisement
Advertisement