
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్‌పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.
యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment