ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్‌మైండ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్‌కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.
గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.
సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది.
Comments
Please login to add a commentAdd a comment