irish
-
93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!
ఓ వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా దేహ ధారుడ్యంతో పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారు. అతడి శరీరాకృతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి గల కారణాలేంటని అధ్యయనం చేసే పనిలో పడ్డారు పరిశోధకులు. ఐరిష్కి చెందిన 93 ఏళ్ల రిచర్డ్ మెర్గాన్ అనే వ్యక్తి చూడటాని 40 ఏళ్ల వ్యక్తిలా చురుగ్గా ఉన్నాడు. పైగా 70 ఏళ్ల వయసులో రోయింగ్(పడవ రేస్)ను ప్రారంభించినప్పటికీ నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడిని చూస్తే యువకుడి మాదిరిగా మంచి శరీరాకృతితో ఉంటాడు. శాస్త్రవేత్తలు సైతం అతడి హృదయ స్పందన రేటుని చూసి ఆశ్చర్యపోతున్నారు. మోర్గాన్ ఫిట్నెస్ ప్రయాణం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు అధ్యయనం చేయడంతో ఒక్కసారిగా అతను వార్తల్లో నిలిచాడు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అతను మనందరికీ ప్రేరణ అని చెబుతున్నారు. అతని జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను పరిశీలించింది పరిశోధకుల బృందం. అంతేగాదు అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం, హృదయ స్పందన రేటు, తదితర వాటిని రోయింగ్ ఎర్గోమీటర్తో కొలిచారు. అందుకు సంబంధించిన అధ్యయనం గురించి గత నెలలో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యింది. ఇక మోర్గాన్ తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చానని చెప్పుకొచ్చారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని తెలిశాక ఇక ఆపలేదని, అదే ఈ రోయింగ్ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు మోర్గాన్. వ్యాయామం మంచి ఫిట్నెస్గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్యా వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్‌పై జరిపిన పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. ఇక అతను మంచి ఫిట్‌నెస్‌లో.. వ్యాయామం స్కిప్ చేయకపోవడం, బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారం తదితరాలు తన రోజూ వారీ జీవశైలిలో ఉండే ప్రాథమిక మూల స్థంభాలని చెప్పారు పరిశోధకులు. ఇంకేందుకు ఆలస్యం వయసుతో సంబంధం లేకుండా చక్కగా మంచి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండటమే గాక వృధాప్య ప్రభావం పడకుండా చూసుకోండి. (చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడికి చూపించిన ప్రధాని మోదీ!) -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి బుకర్ ప్రైజ్
లండన్: ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్–2023 లభించింది. లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్ లించ్ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది. దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, పెరిగిపోతున్న నిరంశకుత్వం, ప్రబలుతున్న అశాంతి, వలసల సంక్షోభం.. వంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ‘ప్రాఫెట్ సాంగ్’ నవలలో పాల్ లించ్ హృద్యంగా చిత్రీకరించారు. కెన్యాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన ‘వెస్ట్రన్ లేన్’ నవల టాప్–6లో నిలిచింది. -
బందీల విడుదలపై ఐర్లాండ్ ప్రధాని ట్వీట్.. ఇజ్రాయెల్ ఫైర్
టెల్ అవీవ్: హమాస్ రెండో విడత 17 మంది బందీలను ఆదివారం విడుదల చేసింది. వీరిలో ఐర్లాండ్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. తమ దేశ బాలిక విడుదలపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. తమ దేశ బాలిక ఎమిలి హ్యాండ్ విడుదల కావడంపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ హర్షం వ్యక్తం చేశారు. తప్పిపోయిందుకున్న బాలిక తిరిగిరావడం ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. బాలిక కుటుంబంతో కలిసినందుకు ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. తమకు ఇది ఎంతో ఊరటను కలిగించిందని అన్నారు. అయితే.. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. బాలిక తప్పిపోయిందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దళాల ఒత్తిడితోనే బందీలను హమాస్ విడుదల చేసిందని స్పష్టం చేసింది. ఎమిలిని హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి బందీగా అపహరించుకుపోయారని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా కాల్పులకు విరమణ ప్రకటించారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేయాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం 24 మందిని హమాస్ విడుదల చేసింది. రెండో విడతగా 17 మందిని వదిలిపెట్టింది. ఇదీ చదవండి: Uttarakashi Tunnel Operation: ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ -
Global Hunger Report 2022: ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి. నివేదిక ఏం చెప్పిందంటే... ► 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది. ► జీహెచ్ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది. ► ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్‌లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి. ► ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి ► చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ► భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది. ► పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ► పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి. ► భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ► ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టనను దిగజార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రపంచ ఆకలి సూచిని రూపొందించారని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తింది. ఆకలి సూచిని లెక్కించే పద్ధతిలోనే తప్పులు తడకలు ఉన్నాయని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఆహార, వ్యవసాయ సంస్థ దష్టికి తీసుకువెళుతున్నట్టుగా కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించకుండా భారత్ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. విరుచుకుపడిన విపక్షాలు దేశంలో రోజు రోజుకి ఆకలి కేకలు పెరిగిపోతూ ఉండడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎనిమిదన్నరేళ్లలోనే మోదీ ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తాయి. పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న ఆహార నిల్వలు గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ఇకనైనా కేంద్రం తాను చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు. -
'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో?
ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బెర్గ్ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారిపోతుంది. 'భద్రత కంటే లాభాలే ముఖ్యం' అనే మచ్చ జూకర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ చేసిన ఆరోపణలు, వెలుగులోకి తెచ్చి ఆధారాలు ఆయన్ను మరింత అష్ట దిగ్భందనం చేస్తున్నాయి.'ఐ కాంట్ బ్రీత్' అనే తరహాలో అవి చాలవన్నట్లు తాజాగా ఐర్లాండ్ డేటా ప్రొటెకమిషన్ భారీ జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. అండర్ యురేపియన్ యూనియన్ - 2018 డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం..ఫేస్‌బుక్‌పై ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ అధికారులు 36 మిలియన్ల యూరోల (ఇండియన్ కరెన్సీలో రూ.3,14,62,56,000.00) ఫైన్ విధించారు. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. మొత్తం 44 యూరోపియన్ యూనియన్ దేశాల్లో బిజినెస్ వ్యవహారాల్ని సులభతరం చేసేందుకు 'వన్ స్టాప్ షాప్'తో ఓ యూనియన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. యూరోపియన్ దేశాల్లో బిజినెస్ వ్యవహరాలు నిర్వహించాలంటే ఆ కమిషన్ సభ్యులు చెప్పినట్లుగా వ్యవహరించాలి. లేదంటే కఠిన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా వన్ స్టాప్ షాప్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌పై ఐర్లాండ్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఆస్ట్రియన్ యాక్టివిస్ట్ ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త మాక్స్ స్క్రెమ్స్ ఫేస్బుక్ ప్రైవసీ వయోలేషన్ పై ఫైట్ చేస్తున్నారు. తాజాగా ఈయన ఫేస్‌బుక్‌పై డజన్ల కొద్ది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన డీపీసీ సభ్యులు ఫేస్బుక్ పై 28 మిలియన్ల యూరోల నుంచి 36 మిలియన్ల యూరోల వరకు జరిమానా విధించారు. మరి ఈ ఫైన్‌తో పాటు ఫేస్‌బుక్‌పై పడిన ఆరోపణలనే తుపాన్లను, సునామీలను తట్టుకొని ఏటికి ఎదురీది తన సంస్థను కాపాడుకుంటారో లేదంటే ఇంకేం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం -
ఐరిస్ ఆరంభమెప్పుడో..
మెదక్ అర్బన్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు ఇప్పటి వరకు ఐరిస్ యంత్రాలు చేరకపోవడంతో ఈ వి«ధానం అమలుకు నోచుకోవడం లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా 2.11 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం, కిరోసిన్‌ను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం ద్వా రా లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులు అందిస్తున్నారు. చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీల వేలిముద్రలు రావడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వేలిముద్రల ఆధారంగా వారికి సరుకులను అందించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐరిస్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విధానంపై ఆగస్టు నెలలోనే డీలర్లకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ శిక్షణ ఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా ఐరిష్ విధానాన్ని అమలు చేయడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట.. రేషన్ దుకాణాలలో జరుగుతున్న అక్రమాలను అ రికట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ పోర్టల్ అ స్సెన్స్ సర్వీసెస్ (ఈ–పాస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని సరుకులను పంపిణీ చేస్తారు. ఈ విధానం అ మలులో లేనప్పుడు రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులు రాకపోయినా వచ్చినట్లు చూపి రేషన్ డీలర్లు సరుకులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ–పాస్ విధానంతో అక్రమాలకు చెక్ పడింది. ఈ విధానంలో వేలిముద్రల సమస్య ఏర్పడటంతో దీన్ని అధిగమించడానికి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. తప్పని తిప్పలు.. ఐరిస్ విధానం అమలులో జరుగుతున్న జాప్యం తో వేలి ముద్రలు పడని వారికి ఇబ్బందులు తప్ప డం లేదు. వేలిముద్రలు పడని వారికి సరుకులు ఇ వ్వాలంటే వీఆర్వోల వేలిముద్రలు అవసరం. కా నీ పని ఒత్తిడి వల్ల వారు సకాలంలో రేషన్ దు కాణాలకు రాలేకపోతున్నారు. వేలిముద్రలు రాని వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోం ది. ఒక్కోసారి సరుకులను కోల్పోవాల్సి వస్తోం ది. ఉన్నతాధికారులు స్పందించి ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బియ్యం ఇవ్వడం లేదు మిషన్‌లో వేలిముద్ర పడకపోవడంతో మాకు అందాల్సిన రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులను ఇవ్వడం లేదు. వేలి ముద్ర ద్వారా సరుకులు అందించేందుకు వీఆర్ఓ ఎప్పుడు వస్తారో..? మాకు తెలియడం లేదు. వారు వచ్చినప్పుడు సరుకులు ఇస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అర్హులమైనా రేషన్ సరుకులు అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్కారు వెంటనే ఏదైనా కొత్త విధానం ద్వారా రేషన్ సరుకులు అందించి ఆదుకోవాలి. – శిర్న గోదావరి, వృద్ధురాలు, మెదక్ -
అబార్షన్... విప్లవాత్మక తీర్పు
డబ్లిన్ : గర్భస్రావంపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు చేస్తున్న పోరాటంపై విప్లవాత్మక తీర్పు వచ్చింది. అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అన్న అంశంపై చేపట్టిన రిఫరెండంలో, 66 శాతం మంది ఈ నిషేధాన్ని ఎత్తివేయాలనే ఓటు వేశారు. శనివారం రోజు దీని తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. 40 నియోజకవర్గాల్లో తొలి నాలుగింటిన్ని వెల్లడించారు. దీనిలో 66.36 శాతం మంది నిషేధం ఎత్తివేయాలని ఓటు వేయగా.. 33.64 శాతం మంది మాత్రం నిషేధ ఎత్తివేతకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు డుబ్లిన్లోని సెంట్రల్ కౌంట్ సెంటర్ వెల్లడించింది. డుబ్లిన్ సెంట్రల్లో 77 శాతం మంది, కార్క్ సౌత్-సెంట్రల్లో 69 శాతం మంది, కార్క్ నార్త్ సెంట్రల్లో 64 శాతం మంది, గాల్వే ఈస్ట్‌లో 60 శాతం మంది అబార్షన్ల నిషేధ ఎత్తివేతకు ‘యస్’ అని ఓటు వేసినట్టు తెలిసింది. దీంతో ఎంతో కట్టుదిట్టంగా అమలవుతున్న అబార్షన్ వ్యతిరేక చట్టానికి ఇక చరమగీతం పాడాల్సివసరం వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు అబార్షన్లకు అనుమతి ఇచ్చే ఓ కొత్త చట్టం తీసుకొస్తామని ప్రధాని లియో వరడ్కర్ చెప్పారు. కొత్త చట్టం డ్రాఫ్టింగ్ కోసం మంగళవారం కేబినెట్ సమావేశమవుతుందని తెలిపారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశమున్నప్పుడు అబార్షన్‌కు అనుమతించేలా ఈ కొత్త చట్టం రూపుదిద్దుకోనుంది. అబార్షన్ నిషేధం అనే కఠినతర చట్టం వల్ల ఆరేళ్ల క్రితం సవిత అనే ఓ భారతీయ మహిళ మృతి ఎందరినో కలచివేసింది. దీంతో ఐర్లాండ్ ప్రభుత్వం ఈ రిఫరెండాన్ని చేపట్టింది. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్ వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నేడు వెల్లడైన తొలి ఫలితం కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తోంది. -
ఐరిష్‌తో విద్యార్థుల హాజరు నమోదు
- డీడీ యూ ప్రసాదరావు కర్నూలు(అర్బన్): వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల హాజరును ఐరీష్ ద్వారా నమోదు చేయనున్నట్లు ఆ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు చెప్పారు. శుక్రవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ భవన్లో జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులకు ఆయన ఐరీష్ మిషన్లు అందించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ గతంలో అన్ని వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరు నమోదుకు సంబంధించి ట్యాబ్‌లు అందించామన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ట్యాబ్‌ల ద్వారా హాజరు సక్రమంగా నమోదు కాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు సరఫరా చేసిన విధంగానే ఇక్కడకు కూడా ఐరిష్ మిషన్లను పంపించారన్నారు. వీటిలో ప్రీమెట్రిక్ వసతి గృహాలకు 54, పోస్టుమెట్రిక్ వసతి గృహాలకు 21 ప్రకారం కేటాయించామని, వాటిని సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులకు అందిస్తున్నామన్నారు. జూన్ 12వ తేదీన హాస్టళ్లు పునః ప్రారంభమైన నాటి నుంచే ట్యాబ్‌లు లేక ఐరిష్ మిషన్ల ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. మ్యాన్యువల్‌గా హాజరును నమోదు చేస్తే మెస్ బిల్లులు విడుదల కావన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 16 వసతి గృహాలు విలీనమవుతున్నాయని చెప్పిన ఆయన పోస్టింగుల కోసం ఎలాంటి హైరానా చెందాల్సిన అవసరం సంక్షేమాధికారులకు సూచించారు. పలు కళాశాల వసతి గృహాలతో పాటు మూడు ప్రీమెట్రిక్ వసతి గృహాలకు కూడా హెచ్‌డబ్ల్యూఓలు లేరని, ఆయా వసతి గృహాలకు విలీనమయ్యే హాస్టళ్ల సంక్షేమాధికారులను సర్దుబాటు చేస్తామన్నారు. ఇంకా మిగిలితే సహాయ సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాలకు నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమాధికారులు ఆర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఈ నాగభూషణం, శ్రీరామచంద్రుడు, వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం అధ్యక్షుడు జెడ్ దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
సెక్స్ కు ఆకర్షితులౌతున్న ఐరిష్ టీనేజర్లు..
ఐర్లాండ్ టీనేజర్లు ఇప్పుడు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఎనిమిది నుంచి 18 ఏళ్ళ వయసులోని పిల్లలపై చేసిన సర్వేలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నాయి. అక్కడ ధూమపానంతోపాటు తాగుడుకు అలవాటు పడిన పిల్లలకంటే చిన్న వయసులోనే సెక్స్ పట్ల ఆకర్షితులవుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఐర్లాండ్ లో తాజాగా 230 స్కూళ్ళలో 13,500 మంది విద్యార్థులపై హెల్గ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బయటపడ్డ విషయాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే తమకు సెక్స్ అనుభవాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులోనూ పేద, మధ్య తరగతి పిల్లలే సెక్స్ పట్ల అధిక ఆసక్తి చూపుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు సెక్స్ లో పాల్గొనేప్పుడు దాదాపు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. వీరంతా సెక్స్ సమయంలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా 15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసు పిల్లలను సెక్స్ గురించి ప్రశ్నించినపుడు మాత్రం 27 శాతంమంది శృంగార అనుభవం పొందుతున్నట్లు తెలిసిందని, అంతకు ముందున్నకంటే రెండు మూడు శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. అయితే 2010 లో స్కూలు పిల్లలపై చేసిన సర్వేల్లోని నిష్పత్తికంటే... తాజా లెక్కల్లో స్మోకింగ్, డ్రింకింగ్ బానిసల సంఖ్య తగ్గిందని హెల్త్ ప్రమోషన్ రీసెర్స్ సెంటర్ పరిశోధకులు అంటున్నారు. అయితే సెక్స్ అనుభవాలను పొందుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు వారు చెప్తున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 12 నుంచి 8 శాతానికి సిగరెట్లు, మద్యం సేవించే వారి సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన వల్లే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాక 2011 తో పోలిస్తే వారంతా డైటింగ్ పై కూడ శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే నేపథ్యంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని... స్వీట్లు, కూల్ డ్రిక్ ల వాడకం తగ్గిస్తున్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది. -
బయోమె‘ట్రిక్కు’
సాక్షి, సంగారెడ్డి: బయోమెట్రిక్ అటెండెన్స్.. వేలిముద్రలు/ కనుపాప(ఐరిష్)ను స్కాన్ చేసి ధ్రువీకరించుకున్నాకే సంబంధిత ఉద్యోగి, అధికారి విధులకు హాజరైనట్లు నమోదు చేస్తుంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును నమోదు చేయడానికి ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇంత పకడ్బందీ ‘ఈ’ బయోమెట్రిక్ పద్ధతినే బురిడీ కొట్టించి విధులకు డుమ్మా కొట్టిన ఓ జిల్లా అధికారిణి అడ్డంగా దొరికిపోయారు. ఆరోగ్య శ్రీ మెదక్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సౌజన్య బయోమెట్రిక్ హాజరుకే ‘ట్రిక్కు’ చేసి విచారణ ఎదుర్కొంటున్నారు. మామూలుగా ప్రతి కార్యాలయంలోనూ బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదును ప్రారంభించడానికి ముందు ఉద్యోగులందరి నుంచి వారి వేలిముద్రలు/ఐరీష్‌ను తీసుకుని కంప్యూటర్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత ఉద్యోగులు తమ వేలిముద్రలు/ఐరీష్ వెబ్సైట్లో తన వేలి ముద్రకు బదులు తన కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి సంబంధించిన వేలిముద్రను ఎన్రోల్ చేయించారు. దీంతో ఆ ఉద్యోగి అధికారిక వెబ్సైట్లో డాక్టర్ సౌజన్య తరఫున అక్రమంగా చొరబడి(లాగినై) ఆమె విధులకు రాకపోయినా హాజరైనట్లు నమోదు చేసేవారు. హైదరాబాద్‌లో నివాసముంటూ మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సౌజన్య తరచుగా విధులకు గైర్హాజరయ్యేవారు. దీంతో తాత్కాలిక ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వచ్చే వారు రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఈ అంశం బయటకు పొక్కడంతో ఆమె వెంటనే నష్టనివారణ చర్యలకు సిద్ధమయ్యారు. ఇటీవల తన కుడి చేతి వేలిముద్రలను నమోదు చేయించారు. దీనికోసం ఎడమ చేయి విరిగిందని కారణం చూపారు. ఈ అంశంతో పాటు పలు అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మ మంగళవారం ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని సందర్శించి డాక్టర్ సౌజన్య హాజరుకు సంబంధించిన సమాచారాన్ని సీడీల్లో తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులను నుంచి ముడుపులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై సైతం విచారణ జరుపుతున్నట్లు విచారణాధికారి డాక్టర్ పద్మ తెలిపారు. కాగా, ఈ అంశంపై ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సౌజన్య వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
విల‘పింఛన్’
సాక్షి, మంచిర్యాల : సర్కారు నిర్ణయాలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పూటకో విధానం అమలు చేయడంతో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. గతంలో స్మార్ట్‌కార్డుల ద్వారా పంపిణీ చేస్తామని, అనంతరం ఆధార్, రేషన్ కార్డుల ఎన్రోల్మెంట్ అంటూ తిప్పుకున్నారు. ప్రస్తుతం పింఛన్ల పంపిణీలో అక్రమాలను నిరోధించడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంతో చేతుల వేళ్లు లేనివారు.. వంకరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీరికోసం ప్రస్తుతం మళ్లీ ఐరీష్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కవిధానం సక్రమంగా అమలు చేయకపోవడంతో పింఛన్‌కు వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎండనకా.. వాననకా పింఛన్ కోసం బారులు తీరుతున్నారు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం అధికారుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా బాధలు తీరడం లేదు.. వీరి గోస ప్రభుత్వానికి తగలడం లేదు. అక్రమాల పర్వం జిల్లా వ్యాప్తంగా 2,75,639 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారు. 65 ఏళ్ల పైబడి వయస్సు ఉన్న వారితోపాటు అభయహస్తం కింద 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతినెలా రూ.200, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.500, వితంతువులకు రూ.500 చొప్పున డీఆర్డీఏ అందిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ రూపంలో అర్హులకు అందిస్తున్న ఆర్థికసహాయాన్ని చూసి కొందరు దళారులు, ఉద్యోగులు అనర్హులనూ జాబితాలో చేర్చి అక్రమంగా పింఛన్ పొందుతున్నారు. పలుచోట్ల అర్హులకు అందించాల్సిన పింఛన్ కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనర్హులను గుర్తించడంతోపాటు వారి పెన్షన్లు రద్దు చేసేందుకు రెండు నెలల క్రితం బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టింది. పింఛన్‌దారులు ప్రతినెల వారి చేతి బొటన వేలిముద్ర ఆ పరికరంపై పెడితే యంత్రం వారి వేలిముద్ర స్కాన్ చేసుకుంటుంది. వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు వస్తాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ వేలి ముద్రలు చెరిగిపోయి ప్రమాదాల్లో చేతులు పోయిన వారికి మాత్రం సమస్యలు మొదలయ్యాయి. వృద్ధులు పరికరంపై వేలిముద్ర పెడితే స్కాన్ కావడం లేదు. చేయిలేని వాళ్లు వేలిముద్రలు వంకర ఉన్న వాళ్లు తమ వేలి ముద్రలు స్కాన్ చేయించుకోలేని పరిస్థితి. దీంతో వీరికి పెన్షన్ నిలిచింది. ఇలాంటి వాళ్లు జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. తెరపైకి ‘ఐరీష్’ వేలిముద్రలు చెరిగిపోయిన వృద్ధులు, చేతివేళ్లు లేని వాళ్లకు రెండు నెలల నుంచి పింఛన్ అందక అవస్థ లు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఐరీష్ విధానంలో ఇవ్వాలని ఆలోచిస్తోం ది. ఐరీష్ ద్వారా కంటి స్కాన్ చేసి పెన్షన్ ఇస్తారు. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ఏదైన గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించా రు. ఓ విధంగా ఆలోచిస్తే ఈ ప్రక్రియ బాగానే ఉ న్నా ఐరీష్తోనూ వృద్ధులకు ఇబ్బందులు తప్పేట ట్లు లేవు. ఇప్పటికే ఆధార్ కార్డు దరఖాస్తు సమయంలో చాలామంది వృద్ధులకు కళ్లు స్కాన్ కాక ఇబ్బందులు తలెత్తాయి. కళ్లు కూడా స్కాన్ కాక పో తే ఎలా అని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బయోమెట్రిక్ పద్ధతిలో చేతి బొటన వేలు స్కాన్ కాని వారి కోసం ఐరీష్ విధానం అమలు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించి.. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పారు.