మెదక్ అర్బన్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు ఇప్పటి వరకు ఐరిస్ యంత్రాలు చేరకపోవడంతో ఈ వి«ధానం అమలుకు నోచుకోవడం లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా 2.11 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం, కిరోసిన్‌ను తీసుకెళ్తున్నారు.
ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం ద్వా రా లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులు అందిస్తున్నారు. చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీల వేలిముద్రలు రావడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వేలిముద్రల ఆధారంగా వారికి సరుకులను అందించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐరిస్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విధానంపై ఆగస్టు నెలలోనే డీలర్లకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ శిక్షణ ఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా ఐరిష్ విధానాన్ని అమలు చేయడం లేదు.
అక్రమాలకు అడ్డుకట్ట..
రేషన్ దుకాణాలలో జరుగుతున్న అక్రమాలను అ రికట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ పోర్టల్ అ స్సెన్స్ సర్వీసెస్ (ఈ–పాస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని సరుకులను పంపిణీ చేస్తారు. ఈ విధానం అ మలులో లేనప్పుడు రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులు రాకపోయినా వచ్చినట్లు చూపి రేషన్ డీలర్లు సరుకులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ–పాస్ విధానంతో అక్రమాలకు చెక్ పడింది. ఈ విధానంలో వేలిముద్రల సమస్య ఏర్పడటంతో దీన్ని అధిగమించడానికి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.
తప్పని తిప్పలు..
ఐరిస్ విధానం అమలులో జరుగుతున్న జాప్యం తో వేలి ముద్రలు పడని వారికి ఇబ్బందులు తప్ప డం లేదు. వేలిముద్రలు పడని వారికి సరుకులు ఇ వ్వాలంటే వీఆర్వోల వేలిముద్రలు అవసరం. కా నీ పని ఒత్తిడి వల్ల వారు సకాలంలో రేషన్ దు కాణాలకు రాలేకపోతున్నారు. వేలిముద్రలు రాని వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోం ది. ఒక్కోసారి సరుకులను కోల్పోవాల్సి వస్తోం ది. ఉన్నతాధికారులు స్పందించి ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
బియ్యం ఇవ్వడం లేదు
మిషన్‌లో వేలిముద్ర పడకపోవడంతో మాకు అందాల్సిన రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులను ఇవ్వడం లేదు. వేలి ముద్ర ద్వారా సరుకులు అందించేందుకు వీఆర్‌ఓ ఎప్పుడు వస్తారో..? మాకు తెలియడం లేదు. వారు వచ్చినప్పుడు సరుకులు ఇస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అర్హులమైనా రేషన్ సరుకులు అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్కారు వెంటనే ఏదైనా కొత్త విధానం ద్వారా రేషన్ సరుకులు అందించి ఆదుకోవాలి.
– శిర్న గోదావరి, వృద్ధురాలు, మెదక్
Comments
Please login to add a commentAdd a comment