ప్రగతినగర్ : ప్రభుత్వ సేవలు ప్రజలకు సులువుగా, వేగవంతంగా అందించేందుకు గత సర్కారు మీ-సేవ కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇవి ప్రజా పనులకు సత్వర పరిష్కారాలను అందిస్తున్నాయి. తహశీల్దార్, రిజిస్ట్రార్, పోలీస్, పోస్టాఫీస్, మున్సిపాలిటీ.. ఇలా పలు శాఖలకు సంబంధించని ఎన్నోరకాల సేవలను ఈ కేంద్రాలు అందిస్తున్నాయి.
ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు సైతం ఉపాధి లభించినట్లైంది. ఇలాంటి మీ-సేవ కేంద్రాల మంజూరు విషయంలో ఇటీవల జిల్లాలో ఇష్టానుసారంగా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలె బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాగు తాను బదిలీ అవుతున్నానని ఈఎస్‌డీ(ఎలక్ట్రానికల్ డెలివరీ సర్వీసెస్) జిల్లా మేనేజర్‌తో కుమ్మకైన సదరు అధికారి ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి జిల్లాలో సుమారు 30 మీ-సేవ కేంద్రాలను ఆగమేఘాల మీద మంజూరు చేశారు.
నిబంధనలకు విరుద్దంగా
మీ-సేవ కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్న అనంతరం సెంటర్ మంజూరు కోసం అన్ని నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి రూ. 12వేల డిపాజిట్ చెల్లించాలి. అయితే బదిలీ అయిన అధికారి, మీ-సేవ మేనేజర్లు కలిసి ఈఎస్‌డీ అధికారులను బోల్తా కొట్టించారు. తహశీల్దార్‌లతో సంబంధం లేకుండా ఈఎస్‌డీ అధికారులతో ఒప్పందం పెట్టుకొని మీ-సేవలకు సత్వరం మంజూరు చేశారు.
ఒక్కో మీ-సేవ సెంటర్ మంజూరుకు రూ. 50వేల వరకు అడ్డగోలుగా వసూలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అధికారులే నిబంధనలకు తుంగలో తొక్కి వసూళ్లకు పాల్పడుతుండటంతో.. ప్రజలకు సేవలందించాల్సిన పలు మీ-సేవ నిర్వాహకులు వారి దగ్గర అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రుసుము పది రూపాయాలే కదా అని అడిగితే.. ప్రభుత్వం రూపొందించిన రుసుము తీసుకుంటే కనీసం సెంటర్ అద్దె కూడా కట్టలేమంటూ.. వినియోగదారులకు తెగేసి చెబుతున్నారు.
తహశీల్దార్లకు తెలియకుండానే
జిల్లాలో మీ-సేవ కేంద్రాల మంజూరుకు జిల్లా జాయింట్ కలెక్టరే(జేసీ) సర్వాధికారి. అయితే మీ-సేవ సెంటర్ కోసం ముందుగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పరిశీలించిన అనంతరం తహశీల్దార్ వీఆర్‌ఓ, ఆర్‌ఐల ద్వారా ఎంక్వైరీ చేయించి ఆర్డీఓకు నివేదికను పంపుతారు. అనంతరం ఆర్డీఓ, తహశీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌ఓల పరిశీలన తర్వాత దరఖాస్తు ఫైలు కలెక్టరేట్ చేరుతుంది. జేసీ దానికి మంజూరు తెలిపిన అనంత రం తిరిగి ఆర్డీఓ, తహశీల్దార్ ద్వారా మీ-సేవ కేంద్రాల మేనేజర్‌కు అప్పగించాలి.
అయితే ప్రస్తుతం బదిలీ అయిన సదరు జిల్లా అధికారి ఈ నిబంధనలన్నింటినీ అటకెక్కించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలనలు లేకుండానే ఒక్కో సెంటర్ నిర్వాహకుని వద్ద నుంచి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తహశీల్దార్‌ల ప్రమేయం లేకుండానే ఏకంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలో 14, కామారెడ్డి పరిధలో 8, బోధన్‌లో 7, ఆర్మూర్‌లో 2 మీ -సేవ కేంద్రాల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ సెంటర్ల మంజూరులో సదరు అధికారి ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
5
మొగిపురుగు.. తొలిచేస్తోంది
ప్రస్తుతం మక్క పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పురుగు ముందుగా పత్రహరితాన్ని హరించి వేస్తుందని, తర్వాత కాండానికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందన్నారు. ప్రాథమిక దశలోనే వీటిని అరికట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు గంగారెడ్డి ఈ పురుగు వల్లవాటిల్లే నష్టాలను వివరించారు. నివారణ చర్యలను సూచించారు.
లక్షణాలు
కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 30-40 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తినేస్తాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత చిన్నచిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది.
ఇది కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువుగానే చనిపోతుంది.
నివారణ చర్యలు
పొలంలో కలుపు మొక్కలను నివారించాలి.
పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి.
ఎకరాకు 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36 యస్.ఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారి చేయాలి.
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి.
‘మీ-సేవ’ల మంజూరులో గోల్‌మాల్?
Published Thu, Aug 21 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement