
భారమైతే మాకివ్వండి
ప్రగతినగర్ : ‘పసి మొగ్గలను తుంచేయొద్దు.. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులెవరైనా మాకు అప్పగిస్తే కంటికి రెప్పలా కాపాడు కుంటాం..కానీ వారిని చెత్తకుప్పల్లో.. నాళాల్లో వేసి వారి ప్రాణాలు తీయండి. అది మానవతకే చెరగని మచ్చ’. అంటూ కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని బాల సదనంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.అనాథ శిశువులను ముద్డాడారు.
అమ్మా, నాన్నలు లేరనే దిగులు రానీయకుండా చిన్నారులను చూసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి ఉద్బోధించారు. కేక్‌కట్ చేసి కలెక్టర్ చిన్నారులకు తినిపించారు. అనంతరం బాలసదనంలో ఉన్న 80 మంది చిన్నారులకు కొత్త దుస్తులతో పాటు, దుప్పట్లు,స్వెటర్లు హెల్పింగ్ హార్ట్స్ సబ్యులు అందజేశారు. కార్యాక్రమంలో ఆర్బీఓ యదిరెడ్డి,హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు రమణారెడ్డి, మహేశ్, శ్రీనివాస్, కార్తిక్, వేణు, డీఎం సివిల్ సప్లై దివాకర్, ఏఎస్‌ఓ లక్ష్మీభవాని, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాష్, సుధాకర్, ప్రభాకర్,తహశీల్దార్‌లు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
క్యాంప్ ఆఫీసులో కొత్త సంవత్సర వేడుకలు
నిజామాబాద్ క్రైం : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరిగాయి.అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులు హాజరు కాగా ఎస్పీ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కేక్‌కట్ చేశారు. ఎస్పీని కలిసిన వారిలో జిల్లా అదనపు ఎస్పీ పాండునాయక్, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ ప్రసాద్‌రావు, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ డీఎస్పీలు ఆనంద్‌కుమార్, ఎ భాస్కర్, ఆకుల రాంరెడ్డి, రాంకుమార్, ఎన్‌ఐబీ డీఎస్పీ రవీందర్, హోంగార్డు డీఎస్పీ సులోమాన్, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ గులాం గౌస్ మెయినోద్దీన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్‌పాష తదితరులు పాల్గొన్నారు.