కామారెడ్డిటౌన్ : ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంపూట్యర్ ఆపరేటర్లు నిశితంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ సూచించారు. స్థానిక ఆర్కే డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కామారెడ్డి డివిజన్ సమగ్ర సర్వే ఆన్‌లైన్ నమోదును సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఎటువంటి తప్పులు జరుగకుండా కచ్చితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, లేని పక్షంలో అర్హ్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతారని అన్నారు.
సర్వే విజయవంతం కావాలంటే ఈ ఘట్టమే ప్రధానమన్నారు. అధికారులు దగ్గరుండి నమోదు చేయించాలని ఆయన ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని స్థానిక అధికారుల ద్వారా సేకరించాలన్నారు. ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం తీసుకోకుండా సూపర్‌వైజర్లు, వీఆర్‌వోల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 32 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో కొత్తగా 40వేల కుటుంబాలు నమోదు చేసుకున్నారని, ఇంకా సు మారు 10 వేల కుటుంబాలు నమోదు కావాల్సి ఉం దని తెలిపారు. నమోదు కాని కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడుతామన్నారు.
ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలున్నాయని వాటిని వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆపరేటర్ల వివరాల రిజిష్టర్లను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్లతో కాసేపు ముచ్చటించారు. జాగ్రత్తగా సర్వే వివరాలను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయదేవ్ ఆచార్య , తహశీల్దార్ గఫర్‌మియా, వీఆర్‌వోలు తదితరులున్నారు.
పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి
Published Tue, Aug 26 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement