Computer Operator
-
కంప్యూటర్ ఆపరేటర్.. కుంభకోణంలో అన్నీ తానై
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ కీలక పాత్రధారిగా వ్యవహరించాడు. నలుగురు మేనేజర్ల హయాంలో అవినీతికి అంతా తానై సూత్రధారిగా నిలిచాడు. అప్పనంగా డబ్బు సంచులు ఇంటికి చేరుతుండడంతో జిల్లా మేనేజర్‌గా విధుల్లో ఉన్న వారు కిమ్మనకుండా భాగస్వామ్యులయ్యారు. మొత్తం విషయం బహిర్గతం కావడంతో తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. తమకేమి తెలియదంటూ ఉన్నతాధికారుల ఎదుట నంగనాచి కబుర్లు చెబుతున్నారు. డీఎం ఓటీపీల ద్వారానే శివకుమార్ నిధులు పక్కదారి పట్టించారు. రూ.40 కోట్లు ప్రజాధనం స్వాహా కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం సీఐడీకి బదలాయించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చెల్లింపులు ఉండాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్‌కు ఎస్బీఐ బ్యాంకు అధికారులు అనుమతించారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి తమ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలు మేనేజర్లు నిర్బయంగా చెప్పడంతో కంప్యూటర్ ఆపరేటర్ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక అకౌంట్లకు ప్రభుత్వ నగదు బదలాయించాడు. ఐదేళ్లుగా ప్రజా«ధనాన్ని పక్కదారి పట్టించి కొల్లగొట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే, మరో 24 మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రమేయం ఉండడం విశేషం. నిస్సంకోచంగా దోపిడీ ప్రజాధనం దోపిడీ వ్యవహారం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందనే విషయం తెలిసీ కూడా నిస్సంకోచంగా దోపిడీ చేయడంలో డీఎంలు కీలకంగా నిలిచారు. ఈ తరహా అవినీతికి తెర తీసిన కృష్ణారెడ్డి నుంచి కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ఇలా ఒకరి తర్వాత మరొకరు నలుగురు డీఎంలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇంటర్నల్ ఆడిటర్లను మేనేజ్ చేయవచ్చనే ధీమా, రికార్డులు అందుబాటులో లేకుండా చేస్తామనే ధైర్యంతో ఈ దోపిడీకి తెరతీశారు. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ చెప్పినట్లు నడుచుకోవడంతో అత్యంత సులువుగా స్వాహా సాధ్యమైంది. ఒక వైపు బ్యాంకర్ల సహకారం, మరో వైపు ఇంటర్నల్ ఆడిటర్లు దన్నుగా నిలవడంతో బయటకు దోపిడీకి మార్గం సుగమం అయింది. 12 డ్యాకుమెంట్లు ఫ్రీజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఫ్రీజ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రోణింకి కూర్మనాథ్ ప్రకటించారు. వాస్తవంగా 32 మంది ప్రత్యక్ష పాత్రధారులున్నారు. అయితే వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మిగతావారంతా ప్రైవేట్ వ్యక్తులే. ఇందులో చేజర్ల దయాకర్ (9 డాక్యుమెంట్లు), సూర్యపవన్ (3 డాక్యుమెంట్లు) పేరిట ఉన్న 12 డాక్యుమెంట్లు మాత్రమే ఫ్రీజ్ చేశారు. నెల్లూరు, కోవూరు, బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న ఆ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం రూ.3 కోట్లు మాత్రమే. బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్లు విలువైన ఆస్తులుగా పలువురు చెబుతున్నారు. పాత్రధారులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే మిగతా వారి ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయాల్సి ఉంది. జల్సాలకు అలవాటు పడి.. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ ఏర్పాటు చేసే పార్టీలకు అలవాటు పడడంతోనే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఊబిలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి వ్యక్తిగత అవసరాలు, బంధువులు శుభకార్యాలకు సైతం డబ్బులు వెచ్చించినట్లు సమాచారం. మరో వైపు బ్యాంకర్లకు కూడా అదే స్థాయిలో ట్రీట్ ఇవ్వడంతో ఎనీటైమ్మనీ (ఏటీఎం) లాగా ఉపయోగపడినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు ఎవరెవరికి ఎంత మొత్తం, ఎక్కడెక్కడ అందించింది.. ఎవరి అకౌంట్లకు ఎంత మొత్తం బదిలీ చేసిందనే వివరాలు పోలీసులకు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. సీఐడీకి కేసు బదలాయింపు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నిధులు స్వాహా వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 14న క్రైమ్ నంబర్ 527/2022గా ఐసీపీ సెక్షన్లు 120బీ, 409 మేరకు 11 మందిపై కేసు నమోదు చేశారు. తాజా నివేదిక ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది ప్రమేయం ఉందని వెల్లడియ్యింది. వీరిలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్, పవన్, రాజాం అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచారు. నిందితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, దాదాపు రూ.40 కోట్లకుపైగా స్వాహాకు గురైనట్లు గుర్తించడంతో మరింత లోతైన విచారణ చేపట్టి కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు సీబీసీఐడీ విభాగాన్ని జిల్లా యంత్రాంగం ఆశ్రయించింది. ఆ మేరకు శుక్రవారం ఎస్పీ విజయారావుతో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న వ్యవహారాన్ని వివరిస్తూ లేఖ రాస్తూనే, ఎఫ్ఐఆర్తో పాటు, అధికారిక నివేదిక సీబీసీఐడీ ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు లభించిన తర్వాత కేసును బదలాయించనున్నారు. -
కంప్యూటర్ ఆపరేటర్‌కు లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను వేధిస్తున్న స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు మాతృశాఖకు పంపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఆరోగ్యవిభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్‌ను ఆదేశించారు. బాధితురాలు మేయర్‌కు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చార్మినార్ జోన్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు, కొందరు యూనియన్ నేతలకు గత వారమే తన బాధలు తెలియజేశారు. తాజాగా సోమవారం నేరుగా మేయర్ విజయలక్ష్మిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు. విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన శ్రీనివాస్ గత ఫిబ్రవరిలో పదోన్నతిపై బల్దియాకు వచ్చారు. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తరచూ చార్మినార్ జోన్‌కు వెళ్లేవాడని సమాచారం. తన విషయం బహిర్గతమవుతుందని తెలిసి సోమవారం అయ్యప్పమాల ధరించినట్లు జీహెచ్ఎంసీలో ప్రచారం జరుగుతోంది. -
కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య
సాక్షి, నల్గొండ: అధికారుల వేధింపులు తాళలేక అటవీశాఖ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధి చిన్నపురి గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మార్నేని మధుమోహన్ (44) జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పై అధికారుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్ రాసి పెట్టాడు. -
నా చావుకు కారణం సుజితనే..
-
నా చావుకు కారణం సుజితనే..
సాక్షి, ఒంగోలు : ఉన్నతాధికారి వేధింపులు భరించలేక కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా తాళ్లూరు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో శివపార్వతి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొంత కాలంగా స్పెషల్ ఆఫీసర్ సుజిత, తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో ఆరోపించింది. వేధింపులు భరించలేకే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. తన చావుకు కారణం స్పెషల్ ఆఫీసర్ సుజితనే కారణం అని వీడియోలో తెలిపింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా శివపార్వతి విధులకు ఆలస్యంగా వస్తుందని, మందలించడంతో మనస్తాపం చెంది శివపార్వతి ఆత్మహత్యా యత్నం చేసిందని పాఠశాల వర్గాలు తెలిపాయి. -
తెలుగు తమ్ముళ్ల వసూళ్ల దందా
- చెక్‌పోస్టు వద్ద అనధికారిక అంగళ్లు - ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహణ - వారు చెప్పిందే రేటు! - దోపిడీకి గురువుతున్న వాహనదారులు కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఒక పేపర్ జిరాక్స్ తీయించుకోవాలంటే రూ.1 నుంచి రూ.2లు తీసుకుంటారు. కానీ అక్కడ మాత్రం రూ.10లు వసూలు చేస్తారు. నెట్ సెంటర్లలో నాలుగు పేపర్లున్న పత్రాలను డౌన్లోడ్ చేయాలంటే రూ.10ల నుంచి రూ.15లు తీసుకుంటారు. అక్కడ మాత్రం రూ.50లు ఇవ్వాల్సిందే. ఇదేదో కాకులు దూరని కారడవి కాదు..నీళ్లు దొరకని ఎడారి ప్రాంతమూ కాదు. కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామంలోని వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద ప్రైవేటు ఆపరేటర్లు కొనసాగిస్తున్న దందా. అధికార పార్టీ నాయకుల సహకారంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి వాహనమూ స్థానిక పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాణిజ్యపన్నుల శాఖ అధికారులచే తనిఖీ చేయించుకుని వెళ్లాలి. ప్రతిరోజూ ఇక్కడ 1400 నుంచి 1600 వరకు వాహనాలు తనిఖీ చేయించుకుని వెళ్తాయి. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు వెళ్లి ట్రాన్సిస్ట్ పాస్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేయించుకుని వెళ్లాలి. ఈ పనిని వాణిజ్యశాఖ అధికారులే చేయించాలి. కానీ ఆ పని తమకు భారం అవుతుందని చెప్పి ప్రైవేటు ఆపరేటర్లకు ఆహ్వానం పలికి దందాకు తెరతీశారు. అధికారుల కనుసన్నల్లో ఈ చెక్‌పోస్టు వద్ద 20కి పైగా ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రత్యక్షమయ్యారు. ఒక గొడుగు, దాని కింద కంప్యూటర్, ప్రింటర్/జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసుకుని కూర్చుంటారు. ఒక్కొక్కరు రోజుకు 50 నుంచి 80 దాకా ట్రాన్సిస్ట్ పాస్‌లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసి ఇస్తుంటారు. ఇలా నాలుగు పేజీల ఒక పాస్ డౌన్లోడ్ చేసి ఇవ్వడానికి రూ.50లు వసూలు చేస్తారు. అంతేకాదు ఒక పేజిని జిరాక్స్ చేసి ఇవ్వడానికి రూ.10లు ఛార్జి చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఆపరేటర్ రోజుకు రూ.3వేల నుంచి రూ.4వేల దాకా ఆర్జిస్తున్నట్లు సమాచారం. తెలుగు తమ్ముళ్లదే హవా తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వాణిజ్యపన్నుల శాఖకు ప్రతి నెలా లక్ష్యాలు విధించారు. తెలంగాణా రాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేసి పంపించాలి. ఈ మేరకు ప్రతి ఒక్క వాహనమూ ట్రాన్సిస్ట్ పాస్ చూపించాలి. ఇక్కడే కొంతమంది తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. వెంటనే రహదారి పక్కన గుడిసెలు, బంకులు వేయించారు. ఒక్కో గుడిసె, బంకులను నెలకు రూ.5వేల చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా అద్దెలు తీసుకున్న వారు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకున్నారు. ఆ గుడిసె, బంకుల ఎదురుగా రహదారిపై చిన్న గొడుగు ఏర్పాటు చేసి, దాని కింద కంప్యూటర్, ప్రింటర్‌ను ఉంచి దందా చేయిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద 20కి పైగా ఆపరేటర్లు 24 గంటలూ పనిచేస్తారు. ఎండా, వాన, చలిని లెక్క చేయకుండా కంప్యూటర్ ఆపరేటర్లు నెల, రోజు చొప్పున జీతానికి ఇక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ వీటిని ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు మాత్రం నెలకు ఎలాంటి పని చేయకుండానే రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల చేస్తున్న దందాను అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
పీడీని బురిడీ కొట్టించే యత్నం!
* కౌన్సిలర్‌గా వేరే వ్యక్తి పరిచయం * విలేకరుల రాకతో బట్టబయలు ఇచ్ఛాపురం రూరల్ : తనపై వచ్చిన ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు కౌన్సిలర్ స్థానంలో వేరే వ్యక్తిని కౌన్సిలర్‌గా పరిచయం చేసి డ్వామా పీడీనే బురిడి కొట్టించే యత్నంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ అడ్డంగా దొరికిపోయూడు. వివరాల్లోకి వెళ్తే...ఇక్కడి సివిల్ సప్లై కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గుజ్జు హేమసుందరరావు రేషన్ కార్డుల మంజూరు, ఆధార్ కార్డుల అనుసంధానంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఏఎస్‌పేటకు చెందిన ఎస్.చిన్నారావు యూదవ్ జిల్లా అధికారులు ఇటీవల ఫిర్యాదు చేశాడు. దీనిపై డ్వామా పీడీ రోణంకి కూర్మనాథ్ విచారించేందుకు తహశీల్దార్ కార్యాలయూనికి శుక్రవారం వచ్చి విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు చిన్నారావు అసలు ఉన్నదీ లేనిదీ స్థానిక కౌన్సిలర్‌ను తీసుకురావాల్సిందిగా కంప్యూటర్ ఆపరేటర్ హేమసుందర్‌ను పీడీ ఆదేశించారు. కొన్ని నిమిషాల తరువాత మూడో వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ పేరున ఏఎస్‌పేటకు చెందిన పత్రి తవిటయ్య అనే వ్యక్తిని తీసుకువచ్చి ఇతనే కౌన్సిలర్‌గా పరిచయడం చేశాడు. దీంతో పీడీ ఆయన నుంచి ఫిర్యాదుదారుడు చిన్నారావుకు సంబంధించిన విషయూలపై ఆరా తీశారు. చిన్నారావు అనే వ్యక్తి నిరక్షరాస్యుడని, ఫిర్యాదులో ఇంగ్లిష్‌లో సంతకం చేయడం వల్ల ఫిర్యాదు బోగస్‌గా పీడీ తేల్చారు. ఇంతలోనే స్థానిక విలేకరులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హేమసుందరరావు తెచ్చిన వ్యక్తి కౌన్సిలర్ కాదని, పరారుు వ్యక్తని చెప్పడంతో పీడీ కూర్మనాధ్ అవాక్కయ్యూరు. దీంతో పీడీ సీరియస్ అయ్యూరు. దీనిపై పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తానని విలేకరులకు తెలిపారు. పాయితారి ఫీల్డఅసిస్టెంట్ సస్పెన్షన్ ఇటీవల ఉపాధి పనుల్లో కూలీల మస్టర్లలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పాయితారి ఫీల్డ్ అసిస్టెంట్ రూపాను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపిడి కు పీడీ కూర్మనాథ్ తెలిపారు. -
రూ.కోటి మాయం చేసిన కంప్యూటర్ ఆపరేటర్
మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రూ.1 కోటి మేర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి, అడ్డంగా దొరికిపోయాడు. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మాణయ్య.. కొన్ని నెలల క్రితం జాయింట్ డెరైక్టర్ వద్ద ఉన్న 12 చెక్కులను దొంగిలించి రూ.1.03 కోట్ల మేర వేర్వేరు పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. చెక్కులు కనిపించకపోవటంతో జాయింట్ డెరైక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఉద్యోగినిపై దాడికి పాల్పడిన యజమాని అరెస్టు
గచ్చిబౌలి (హైదరాబాద్) : ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఓ కంపెనీ యజమానిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాబ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఓ యువతి(22) గచ్చిబౌలి టెలికాంనగర్‌లో గల బ్రిక్‌మోర్ ఇన్ఫ్రాలో మూడు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. కాగా బుధవారం కంపెనీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి క్యాబిన్లోకి వెళ్లి తనకు పెళ్లి నిశ్చయమైందని, ఉద్యోగం మానేస్తానని చెప్పింది. వెంటనే ఎండీ శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహంతో.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతారంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి బలవంతంగా 'కంపెనీ ఇచ్చిన జీతం తిరిగి ఇచ్చేస్తాను' అని రాయించుకున్నాడు. భయంతో ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలుపగా వారు శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. -
కలెక్టర్ ఆదేశించినా !
ఇందూరు: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదు’ అన్న చందంగా ఉంది బీసీ స్టడీ సర్కిల్ అధికారి తీరు. తనకు అన్యాయం జరిగిందని.., న్యాయం చేసి ఆదుకోవాలని బాధిత ప్రభుత్వ ఉద్యోగి కలెక్టర్‌ను వేడుకున్నాడు. దీంతో బాధితుడి ఆవేదనలో న్యాయం ఉందని గ్రహించిన కలెక్టర్ బకారుులు చెల్లించాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. కానీ, సదరు అధికారి మాత్రం తన నీచబుద్ధిని చూపించాడు. బాధితుడిని ముప్పుతిప్పలు పెట్టడంతో బాధితుడు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు. జిల్లా కేంద్ర శివారు నాగారం ప్రాంతంలో ఉన్న జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో ఎన్. లక్ష్మి నరసింహచారి 2010 డిసెంబర్ 1వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్సోర్సింగ్ పద్దతిపై నియామకమయ్యూడు. అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు నెలసరి వేతనం రూ.8 వేలు ఉండగా, కొన్ని రోజుల తరువాత రూ.9500కు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు అదనంగా పెరిగిన రూ.1500 వేతనాన్ని పొందుతున్నారు. ఇతడికి మాత్రం పెరిగిన వేతనం నేటి వరకు అమలు కాలేదు. ఈ విషయమై తనకు న్యాయం చేయూలని గతంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ అధికారి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా న్యాయం జరగలేదు. దీంతో సదరు బాధిత ఉద్యోగి తనకు రావాల్సిన సుమారు రూ.70 వేలు నష్టపోయూడు. ఇటీవల మరోసారి ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి న్యాయం చేయూలని వేడుకున్నాడు. తనకు న్యాయం చేయూలని గ్రీవెన్స్ సెల్లో విన్నవించుకున్నాడు. దీంతో స్పందించిన ఆయన స్టడీ సర్కిల్ అధికారికి ఫైలు సమర్పించమని ఆయన సూచించారు.దీంతో ఆయన ఏజేసీకి ఫైలు సమర్పించగా పరిశీలించిన ఆయన కంప్యూటర్ ఆపరేటర్ వేతనం కోల్పోయిన విషయం వాస్తవమే అని గ్రహించి ఫైలును కలెక్టర్‌కు పంపించారు. దానిని పరిశీలించిన కలెక్టర్ బాధిత ఉద్యోగికి రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. దీంతో బాధిత ఉద్యోగి తనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు. మరుసటి రోజు బీసీ స్టడీ సర్కిల్ అధికారి వద్దకు వెళ్లి బాకాయి వేతనంపై వివరణ కోరగా సదరు అధికారి నేనివ్వని మోకాలడ్డాడు. ఏజేసీ, కలెక్టర్ ఫైలును సరిగా చూడకుండా సంతకం పెట్టారు. మరోసారి నేను వారితో మాట్లాడుతానని అన్నట్లు బాధితుడు తెలిపాడు. చేతుల వరకు బాకాయి డబ్బులు చేజారి పోయూయని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.అయినా పట్టువదలని బాధితుడు తనకు న్యాయం చేయూలని కోరుతూ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిచాడు. పర్సంటేజీ కోసమేనా...? కంప్యూటర్ ఆపరేటర్‌గా మూడేళ్లు పనిచేసిన బా ధితుడు తనకు రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని తిరుగుతున్నా అధికారులు సతాయించడం వెనుక ఆం తర్యమేమిటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్సం టేజీ ఇస్తే డబ్బులు ఇచ్చే వారేమో అనే ఆరోపణలు విని పిస్తున్నాయి. స్వయంగా కలెక్టర్, ఏజేసీ ఆదేశించినా బకాయిలు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అనే వాదనలు ఉన్నాయి. ‘అతడికి చెప్పు... అందులోం చి పర్సంటేజీ ఇవ్వాలని. అలా చేస్తే రావాల్సిన బాకాయిలు ఇప్పిస్తా’ అని కార్యాలయంలోని ఓ మధ్యవర్తితో సదరు ఉద్యోగి అన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలి
కామారెడ్డిటౌన్ : ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంపూట్యర్ ఆపరేటర్లు నిశితంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ సూచించారు. స్థానిక ఆర్కే డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కామారెడ్డి డివిజన్ సమగ్ర సర్వే ఆన్లైన్ నమోదును సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఎటువంటి తప్పులు జరుగకుండా కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, లేని పక్షంలో అర్హ్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతారని అన్నారు. సర్వే విజయవంతం కావాలంటే ఈ ఘట్టమే ప్రధానమన్నారు. అధికారులు దగ్గరుండి నమోదు చేయించాలని ఆయన ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని స్థానిక అధికారుల ద్వారా సేకరించాలన్నారు. ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం తీసుకోకుండా సూపర్వైజర్లు, వీఆర్వోల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 32 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో కొత్తగా 40వేల కుటుంబాలు నమోదు చేసుకున్నారని, ఇంకా సు మారు 10 వేల కుటుంబాలు నమోదు కావాల్సి ఉం దని తెలిపారు. నమోదు కాని కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడుతామన్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలున్నాయని వాటిని వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆపరేటర్ల వివరాల రిజిష్టర్లను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్లతో కాసేపు ముచ్చటించారు. జాగ్రత్తగా సర్వే వివరాలను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయదేవ్ ఆచార్య , తహశీల్దార్ గఫర్‌మియా, వీఆర్వోలు తదితరులున్నారు. -
‘ఆపరేటర్ల’ నియామకంలో ప్రతిష్టంభన
మోర్తాడ్ : గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణకు సంబంధించి ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో పనులు సాగడం లేదు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలను 477 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ పంచాయతీలలోనే కంప్యూటర్లను ఏర్పాటు చేసి పంచాయతీ వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 287 క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లను కేటాయించారు. ఇంకా 190 క్లస్టర్లకు కంప్యూటర్లు అందజేయాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు... ఆపరేటర్లను పంచాయతీలు నేరుగా నియమించుకోకుండా ప్రభుత్వమే ఔట్సోర్సింగ్ విధానంలో ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కార్వే సంస్థ ఆపరేటర్ల నియామక బాధ్యతలను తీసుకుంది. వేసవిలోనే ఆపరేటర్లను ‘కార్వే’ సంస్థ ఎంపిక చేసి వారికి కొంత శిక్షణ ఇచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేటర్లతో పంచాయతీ పనులు సాగించాలని ‘కార్వే’ సంస్థ నిర్ణయిం చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపరేటర్ల నియామకాలకు సంబంధించిన ఏజెన్సీకి ఇంకా పచ్చజెండా ఊపలేదు. దీంతో ఆ సంస్థ ఏమి చేయడం లేదు. పంచాయతీలకు వసూలయ్యే పన్నులు, చేసే ఖర్చులు, ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యే నిధులు, చేపట్టే పనులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. పంచాయతీల ఆన్‌లైన్‌కు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రియా’ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. తాజాగా ‘మన ఊరు మన ప్రణాళిక’కు అవసరమైన పూర్తి వివరాలను ఆన్లైన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదే శించింది. ఆ న్‌లైన్ చేయడానికి గడువు ఎక్కువగా లేకపోవడం, ఆ పరేటర్ల నియామకం జరగకపోవడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నా ఆపరేటర్లు లేని కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ప్రభుత్వం స్పందించి కంప్యూటర్ల ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంటేనే పంచాయతీల్లో పనులు సాగనున్నాయి. -
ఆ సిబ్బందిని అక్కడికే పంపండి
నాలుగో తరగతి ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా పనిచేస్తారు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన డీఎంఈ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన సూపరింటెండెంట్ సిద్ధార్థ వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం విజయవాడ : సూపర్ స్పెషాలిటీ విభాగాలకు కేటాయించిన సిబ్బంది వైద్య కళాశాలలోఎలా విధులు నిర్వర్తిస్తారని, వారిని ఆ విభాగాలకే పంపించేయాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ శాంతారామ్ అన్నారు. వారిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లున్నారని ప్రిన్సిపాల్ చెప్పడంతో, నాలుగో తరగతి ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్స్‌గా ఎలా పనిచేస్తారంటూ డీఎంఈ ప్రశ్నించారు. సిద్ధార్థ వైద్య కళాశాల డెవలప్మెంట్ సొసైటీ సమావేశం శుక్రవారం కళాశాలలోని సెమినార్ హాల్లో జరిగింది. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శాంతారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ విభాగాల సిబ్బంది, వైద్య కళాశాలలో పనిచేస్తున్న విషయంలో ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఏజెండాలోని అంశాలైన వైద్య కళాశాలలో ఇంటర్నల్ఫోన్స్ రిపేరు, కొత్తవి ఏర్పాటు, జిరాక్స్ మెషిన్స్ కొనుగోలు, మైక్రోబయాలజీలో పరికరాల కొనుగోలు, రూ.4లక్షలతో అన్ని డిపార్ట్మెంట్లలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా ఫర్నిచర్ కొనుగోలు వంటి అంశాలపై సమావేశంలో తీర్మానించారు. అధిక వ్యయం అయ్యే రోడ్లనిర్మాణం, భవనాల మరమ్మతులు, ఇతర విభాగాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఈఈ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు డాక్టర్ శివశంకర్, డాక్టర్ శశాంక్ ఏడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోండి... ప్రభుత్వాస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్స్, సిటీ టెక్నిషియన్ప్ పోస్టులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి డీఎంఈ శాంతారామ్ దృష్టికి తీసుకెళ్లారు. రేడియోగ్రాఫర్స్ కొరత తీవ్రంగా ఉందని ఎనిమిది మందికి ఒక్కరే అందుబాటులో ఉన్నారని, డ్రైవర్స్ కొరత ఉందని తెలిపారు. దీంతో వీఐపీలు నగరంలో పర్యటించే సమయంలో ఉన్న వారు కాన్వాయ్‌కు సర్ధుబాటు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రెండు చోట్ల ఆస్పత్రు ఉండటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో నిర్వహణ కష్టంగా ందని తెలిపారు. ఆమె అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన డీఎంఈ శాంతారామ్ ప్రస్తుతం శాంక్షన్ అయిన పోస్టుల ఖాళీలను భర్తీ చేద్దామని, కొత్త పోస్టుల శాంక్షన్ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. తొలుత ఆయన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయానికి వెళ్లి వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు. -
ఉద్వాసన !
గృహనిర్మాణ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిపై వేటు 120 మంది తొలగింపునకు జీవో రోడ్డున పడనున్న కుటుంబాలు ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు ‘జాబు కావాలంటే ... బాబు రావాలని’ ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఊదర గొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న జాబులకే భద్రత లేకుండా పోతోంది. చేస్తున్న చిన్నపాటి జాబూ చేజారిపోతుందనే అభద్రతా భావంతో కాంట్రాక్టు సిబ్బంది నలిగిపోతున్నారు.. తమ పరిస్థితి ఏమవుతుందోనని వారం రోజులుగా కుటుంబ సభ్యులంతా కుమిలిపోతున్నారు.. ఇదీ గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల దుస్థితి. గుడివాడ : జిల్లా గృహనిర్మాణ శాఖలో వర్క్ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా వివిధ మండలాల్లో 120 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో వర్క్ ఇన్స్పెక్టర్లు 108 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 12 మంది ఉన్నారు. ఏడున్నరేళ్లుగా వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిని 2007 జనవరిలో జిల్లా సమాఖ్య ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోగా రెండేళ్ల క్రితం ఎం.కె. ఎంటర్ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు మార్చారు. వీరికి వచ్చేది చిరు జీతమే. నెలకు రూ.9,200 తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పూర్తిస్థాయిలో భాగస్వాములుగా ఉంటారు. నిరుపేదలను గుర్తించటం, వారిని ఇల్లు కట్టుకునేందుకు ప్రోత్సహించటం వంటి విధులు నిర్వహిస్తుంటారు. స్టేజీల వారీగా జరిగిన పనులకు బిల్లులు చేయించే విషయంలో వర్క్ ఇన్స్పెక్టర్లదే కీలక భూమిక. బాబు వస్తే పర్మినెంటు అవుతుందనుకుంటే... చంద్రబాబు వస్తే తమ కాంట్రాక్టు జాబులు పర్మినెంటు అవుతాయని ఈ చిరుద్యోగులు ఇప్పటివరకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారి ఆశలను అడియాసలు చేస్తూ.. అసలుకే ఎసరు పెడుతూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30 తరువాత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వం మెమో జారీ చేయటం వారి ఆయా కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. రోడ్డున పడనున్న 120 కుటుంబాలు... ఉద్యోగుల జోలికి వెళ్లనని ఎన్నికల ముందు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు నేడు అధికారంలోకొచ్చాక వారిని తీవ్ర అభద్రతా భావానికి గురిచేస్తున్నారని గృహనిర్మాణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని ఎప్పటికైనా పర్మినెంటు కాక పోతుందా అనే ఆశతో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నామని, తీరా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్నే ఊడగొట్టే నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి బతుకుతున్న తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. బాబు వస్తే జాబు సంగతి ఏమో గానీ.. ఉన్న జాబు పోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
జీసీసీలో బియ్యం పక్కదారి?
7.6 టన్నుల బియ్యం రానేలేదు అలమటిస్తున్న గిరిజనులు గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్ : గూడెంకొత్తవీధి గిరిజన సహకార సంస్థలో మరో అక్రమం బయటపడింది. ఏడాది క్రితం రూ.71 లక్షల జీసీసీ సొమ్ము పక్కదారి పట్టిన విషయం జనం మరచిపోకముందే మరో అవినీతి వెలుగు చూసింది. ఈసారి ఏకంగా 7.60 టన్నుల బియ్యం పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీసీసీ సంస్థ ఆయా గ్రామాల్లోని డిపోలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంది. జీకేవీధిలో బ్రాంచి,గొడౌన్ ఏర్పాటు చేసి 26 ముఖ్య డిపోలు, 12 సబ్ డిపోల ద్వారా కార్డుదారులకు సరుకులు ఇస్తున్నారు. ఈ 36 డిపోలకు గత ఏప్రిల్ నెలకు సంబంధించి 3,30,600 కిలోల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఐతే ఏప్రిల్, మే నెలల్లో రావలసిన బియ్యం లో 7.60 టన్నుల సరుకును అధికారులు సరఫరా చేయనే లేదు. దీంతో జీసీసీ అధికారులు వీటిని పక్కదారి పట్టించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ రెండు నెలలకు సంబంధించి పౌరసరఫరాల శాఖ నుంచి స్టాకు తక్కువగా వస్తోందని జీసీ సీ సిబ్బంది చెబుతున్నారు. అయితే తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు జీసీసీ అధికారులు ఈ భారాన్ని సేల్స్‌మెన్‌పై వేస్తున్నారు. అన్ని డిపోలకు రెండేసి బస్తాలు తగ్గించి పంపుతున్నారు. దీంతో ఆ మేరకు గిరిజనులకు కోటాలో కోతపడుతోంది. జీసీసీ అధికారుల జాడ ఎక్కడ? గూడెంకొత్తవీధి గిరిజన సహకార సంస్థలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా పూర్తిస్థాయి బ్రాంచి మేనేజర్ లేకపోవడంతో అధికారులు విధులకు తరచు డుమ్మా కొడుతున్నారు. రెండు నెలల క్రితం కొయ్యూరు జీసీసీ బ్రాంచి మేనేజర్‌గా ధర్మజ్ఞానంను జీకేవీధికి ఇన్చార్జి మేనేజరుగా నియమించారు. అయితే రెండు మండలాల బాధ్యతలు చూసుకోవడంలో ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇక గోదాము విషయానికి వస్తే సూపరింటెండెంట్ చింతపల్లిలోనే మకాం వేసి, ఓ సహాయకుని ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. బుధవారం విలేకరుల బృందం జీసీసీ బ్రాంచి కార్యాలయానికి వెళ్లగా బ్రాంచి కార్యాలయంలో తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు గూడెంకొత్తవీధి బ్రాంచి పరిధిలో జరిగే అక్రమాలపై ఆ సంస్థ పాడేరు డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా ఈ సంఘటనపై తనకు సమాచారం లేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రూ. 5 కోట్లకు ఉద్యోగాలను అమ్ముకున్నారు..
హన్మకొండ, న్యూస్‌లైన్ : ఒక్కటి, రెండు కాదు... 130కిపైగా ఉద్యోగాలను బేరం పెట్టారు. ట్రాన్స్‌కోలోని ఓ ఉన్నతాధికారి ‘నాయక’త్వంలో వీటిని అమ్మకానికి పెట్టగా... యూనియన్ నేత ఒకరు వసూళ్ల దందా నిర్వహించారు. రూ.ఐదు లక్షలకో ఉద్యోగం చొప్పున మొత్తం రూ. 5 కోట్ల మేర దండుకున్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిన ట్రాన్స్‌కోలో ఇటీవల చేపట్టిన ఉద్యోగాల నియూమకంలో వెలుగుచూసిన విక్రయ దందా ఇది. అన్ని అర్హతలున్నా... తమకు కొలువు ఇవ్వడం లేదని, మార్కులు తక్కువగా ఉన్న వారికి అవకాశం కల్పించారంటూ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు ఇటీవల విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారితో సహా ఓ ఎస్ఈ స్థాయి అధికారి.. వారి అనుకూల వర్గానికి ప్రాధాన్యమిస్తూ అక్రమ పద్ధతుల్లో భర్తీ చేస్తున్నారని.. పలువురు యూనియన్ నేతల మధ్యవర్తిత్వంతో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు విజిలెన్స్ పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో సుమారు ఏడాది నుంచి విడతల వారీగా ఉద్యోగులను నియమించినట్లు, ఇప్పటివరకు మొత్తం 130 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకున్నట్లు గుర్తించారు. వారి నుంచి సుమారు రూ. 5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తేలింది. ట్రాన్స్‌కో సబ్స్టేషన్లలో కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకున్న ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టేందుకు ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం అడిషనల్ ఎస్పీ రంగంలోకి దిగడం ట్రాన్స్‌కోలో కలకలం రేపుతోంది. బయటకు తెల్వకుండానే... ట్రాన్స్‌కో కార్యాలయూల నిర్వహణ, లైన్ వర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్ వింగ్, లైన్స్ మెరుుంటనెన్స్ వింగ్ వంటి విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను నియమించుకోవాలని ట్రాన్స్ కో ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. వారి నియామక బాధ్యతలను జిల్లా అధికారులకే కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగుల నియామకాన్ని ఇక్కడి అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఎక్కడా బయటకు పొక్కకుండా... వారి బంధువర్గం, యూనియన్ నేతల పైరవీలతో ఉద్యోగాల నియూమక ప్రక్రియ పూర్తి చేశారు. యూనియన్ నేతలే స్వయంగా దరఖాస్తులు తీసుకుని, వారే ఎంపిక చేశారని విచారణలో తేలినట్లు సమాచారం. ట్రాన్స్‌కో పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయనే విషయంలో విచారణ చేస్తున్నామని ట్రాన్స్‌కో విజిలెన్స్ వరంగల్ సీఐ జితేందర్‌రెడ్డి తెలిపారు. మరో 20 మందికి... క్షేత్రస్థాయిలో మరో 20 మంది ఉద్యోగులు కావాలని, వారిని కూడా ఔట్ సోర్సింగ్‌లో తీసుకునేందుకు సదరు అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీటిని కొనుక్కునేందుకు ఐటీఐ చేసిన నిరుద్యోగులు బేరసారాలకు దిగుతున్నారు. ఇప్పటికే సుమారు 40 మంది నిరుద్యోగ యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వినికిడి. వీరిలో ఎంత మందికి ఉద్యోగం ఇస్తారనేప్రచారం జరుగుతుండగానే... అర్హులకు అన్యాయం చేశారంటూ ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగానికి కొంతమంది ఉప్పందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నారుు. -
అవి‘నీటి’ గలగల
=జీవీఎంసీ వాటర్ వర్క్స్‌లో మామూళ్ల ప్రవాహం =తాజాగా ఏసీబీకి చిక్కిన ఈఈ సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ వాటర్ వర్క్స్ విభాగంలో ‘మామూళ్లు’ ధార కడుతున్నాయి. ఇక్కడి అధికారులు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించేశారు. పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, వ్యక్తిగత కుళాయి కనెక్షన్ల మంజూరుకు ఇక్కడి నుంచి అనుమతి తప్పనిసరి. బల్క్, సెమీ బల్క్ కనెక్షన్లకు సంబంధించి సొమ్ము ఇస్తేనే పని చేస్తారన్న అపవాదును ఇక్కడి అధికారులు మూటగట్టుకున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించే విషయమై రూ.30వేలు లంచం తీసుకుంటూ నీటిసరఫరా విభాగం ఈఈ పీవీవీ సత్యనారాయణరాజు సహా కంప్యూటర్ ఆపరేటర్ అప్పలరాజు ఏసీబీకి చిక్కిన విషయం జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. డీఎస్పీ నరసింహారావు, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, రమణమూర్తి, గణేష్‌లు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. నగరం మొత్తం మీద టీఎస్సార్ కాంప్లెక్సులో ఏర్పాటైన మంచినీటి సరఫరా విభాగం కీలకమైనది. వాణిజ్య అవసరాల కోసం హొటళ్లు, విందు వినోదాలకు, ఉచిత నీటి సరఫరా ఇక్కడి నుంచే మొదలవుతుంది. మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ, ఏలేరు తదితర రిజర్వాయర్ల నుంచి నగరానికి మంచినీటి సరఫరా కావాలంటే పైప్లైన్లు వేయించడం, పంప్‌హౌస్‌లు నిర్మాణం, వాటికి రోడ్లు వేయించడం కూడా ఇక్కడి అధికారులే చేయిస్తుంటారు. వీటికి సంబంధించి కాంట్రాక్టర్లు టెండర్ల మేరకు పనులు పూర్తి చేయిస్తారు. వారికి బిల్లులు మంజూరు చేయించాలంటే అనధికారికంగా అధికారులు బిల్లు మొత్తంలో 1శాతం కమిషన్ డిమాండ్ చేస్తుంటారు. బుధవారం నరవకు చెందిన గల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి గతేడాది మెటల్‌రోడ్డు వేయించినందుకు సుమారు రూ.20 లక్షల బిల్లు కోరగా అక్కడి ఈఈ రూ.4శాతం కమిషన్ డిమాండ్ చేయడమే ఇక్కడి అవినీతికి మచ్చు. జీవీఎంసీ వాటర్‌వర్క్స్ విభాగంలో ఏడాది నుంచి క్లియర్ కాని ఫైళ్లు ఉన్నాయి. అప్పు చేసి వడ్డీలు కడుతూ బిల్లు కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లు ఇక్కడి పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. కోట్లాదిరూపాయల డీడీల కుంభకోణం కూడా గతంలో ఇదే విభాగంలో జరగడం మరింత అక్రమాలకు తావిస్తోంది. అయితే తనను ఎవరో ఇరికించారని, గురువారం తాను ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, కాంట్రాక్టర్లు కొంతమంది పీఎఫ్, ఈఎస్ఐ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆ విషయం తాను సమావేశంలో వెల్లడించాల్సి ఉంది కాబట్టే ఈ విధంగా ఇరికించారని తోటి సిబ్బంది వద్ద ఈఈ రాజు వాపోయినట్టు తెలిసింది. కాళ్లరిగేలా తిప్పించుకుంటూ బిల్లు మంజూరుకు కమీషన్ డిమాండ్ చేయబట్టే తాను ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు గల్లా శ్రీనివాసరావు సాక్షికి చెప్పారు. ఏసీబీకి ఫిర్యాదివ్వాలంటే డీఎస్పీ సెల్ నంబర్ 9440446170, 71, 72, 73ను సంప్రదించవచ్చు